Carrot Kheer : చ‌ల్ల చ‌ల్ల‌గా ఎంతో రుచిగా ఉండే క్యారెట్ ఖీర్‌ను ఇలా చేసి తాగండి.. రుచి చూస్తే వ‌ద‌ల‌రు..!

Carrot Kheer : మ‌నం క్యారెట్ ల‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. క్యారెట్ లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న సంగ‌తి తెలిసిందే. వీటిని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ర‌కాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను సొంతం చేసుకోవ‌చ్చు. క్యారెట్ ను మ‌నం వివిధ ర‌కాల వంట‌ల్లో వాడ‌డంతో పాటు దీనితో క్యారెట్ ప‌చ్చ‌డి, క్యారెట్ రైస్, క్యారెట్ హ‌ల్వా వంటి వాటిని త‌యారు చేస్తూ ఉంటాం. ఇవే కాకుండా క్యారెట్ తో మ‌నం ఎంతో రుచిగా ఉండే క్యారెట్ ఖీర్ ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. క్యారెట్ ఖీర్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా తేలిక‌. ఎంతో రుచిగా ఉండే క్యారెట్ ఖీర్ ను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

క్యారెట్ ఖీర్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

క్యారెట్ – 3 ( మ‌ధ్య‌స్థంగా ఉన్న‌వి), నీళ్లు – రెండు టీ గ్లాసులు, పాలు – అర లీట‌ర్, పంచ‌దార – అర క‌ప్పు లేదా రుచికి త‌గినంత‌, యాల‌కులు – 3, త‌రిగిన బాదం ప‌ప్పు – కొద్దిగా, తరిగిన పిస్తా – కొద్దిగా, త‌రిగిన జీడిప‌ప్పు – కొద్దిగా.

Carrot Kheer recipe in telugu very tasty and cool
Carrot Kheer

క్యారెట్ ఖీర్ త‌యారీ విధానం..

ముందుగా క్యారెట్ ను శుభ్రంగా క‌డిగి ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి. త‌రువాత వాటిని ఒక గిన్నెలోకి తీసుకుని నీళ్లు పోయాలి. ఇప్పుడు ఈ క్యారెట్ ముక్క‌ల‌ను మెత్త‌గా అయ్యే వ‌ర‌కు ఉడికించాలి. క్యారెట్ ముక్క‌లు ఉడికిన త‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి పూర్తిగా చ‌ల్లార‌నివ్వాలి. త‌రువాత వీటిని ఒక జార్ లోకి తీసుకుని మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో పాల‌ను తీసుకుని వేడి చేయాలి. పాలు ఒక పొంగు వ‌చ్చిన త‌రువాత అందులో మిక్సీ ప‌ట్టుకున్న క్యారెట్ మిశ్ర‌మం వేసి క‌ల‌పాలి. త‌రువాత యాల‌కులు, పంచ‌దార వేసి క‌ల‌పాలి. త‌రువాత డ్రై ఫ్రూట్స్ ను వేసి క‌ల‌పాలి. ఈ పాల‌ను రెండు నుండి మూడు పొంగులు వ‌చ్చే వ‌ర‌కు మ‌రిగించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి.

ఇలా చేయ‌డం వ‌ల్ల క్యారెట్ ఖీర్ త‌యార‌వుతుంది. ఈ ఖీర్ ను వేడిగా తాగ‌డం కంటే ఫ్రిజ్ లో ఉంచి చ‌ల్ల‌గా అయిన త‌రువాత తాగితే మ‌రింత రుచిగా ఉంటుంది. ఈ విధంగా క్యారెట్ తో త‌యారు చేసిన ఖీర్ ను తాగ‌డం వ‌ల్ల రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవచ్చు. ఇందులో పంచ‌దార‌కు బ‌దులుగా తేనెను లేదా ప‌టిక బెల్లాన్ని, ఎండు ఖ‌ర్జూరం పొడిని వేసుకుని కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ విధంగా క్యారెట్ ఖీర్ ను త‌యారు చేసుకుని తాగ‌డం వ‌ల్ల రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవ‌చ్చు. ఈ ఖీర్ ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తాగుతారు.

Share
D

Recent Posts