Cheating Husband : భార్యాభర్తలు అన్నాక నమ్మకం మీద సంసారం సాగాలి. అలా కాకుండా ఒకరిపై ఒకరికి నమ్మకం లేకపోతే ఆ కాపురం ఎక్కువ రోజులు నిలబడదు. అలాగే కుటుంబంలోనూ కలహాలు వస్తుంటాయి. చీటికీ మాటికీ గొడవ పడుతుంటారు. అయితే కొందరు భర్తలు మాత్రం భార్యలను చాలా తెలివిగా మోసం చేస్తుంటారు. ఇతర మహిళలతో సంబంధం పెట్టుకుంటారు. కానీ భార్యకు మాత్రం ఆ విషయం తెలియకుండా జాగ్రత్త పడుతుంటారు. ఈ క్రమంలోనే భర్త భార్యను మోసం చేస్తున్న విషయాన్ని పసిగట్టాలంటే.. అందుకు భార్యలు పలు సూచనలను పాటించాలి. వీటిని జాగ్రత్తగా పాటించడం ద్వారా తన భర్త తనను మోసం చేస్తున్నాడా.. లేదా.. అనే విషయాన్ని భార్య ఇట్టే సులభంగా గుర్తించవచ్చు. ఇక ఆ సూచనలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కొందరు భర్తలు అప్పటి వరకు సాదాసీదాగా ఉంటారు. దుస్తులు ధరించడం, హెయిర్ స్టైల్స్, ఇతర అంశాలపై అంతగా శ్రద్ధ చూపించరు. కానీ ఉన్నట్లుండి అన్నింటినీ మార్చేస్తే అప్పుడు భార్య అనుమానించాలి. దుస్తులు ధరించడంతోపాటు ఇతర స్టైల్స్‌లోనూ ఉన్నట్లుండి మార్పులు వస్తే.. అప్పుడు భర్త ప్రవర్తనపై భార్య ఒక కన్నేయాలి. దీంతో మోసం చేస్తున్నాడా.. లేదా.. అనేది సులభంగా తెలుస్తుంది.
ఇప్పట్లో స్మార్ట్ ఫోన్లు అనేవి కామన్ అయిపోయాయి. అయితే ఇంట్లో సాధారణంగా ఫోన్లు అందరికీ ఉంటాయి. కనుక ఒకరి ఫోన్లను ఒకరు ముట్టుకోరు. అయితే మీ భర్త స్వచ్ఛంగా ఉంటే.. మీరు ఫోన్ అడగ్గానే వెంటనే ఇచ్చేస్తాడు. అలా కాకుండా ఫోన్ ఇవ్వడానికి తటపటాయిస్తే అనుమానించాల్సిందే. అలాగే ఫోన్‌లో యాప్‌లకు లాక్‌లు పెట్టుకున్నా.. అనుమానించాల్సిందే. అలాంటి భర్త పట్ల భార్య జాగ్రత్తగా ఉండాలి.
సాధారణంగా ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఇతర కారణాలతో ఎవరైనా సరే డిప్రెషన్ లో ఉంటారు. అలాగే అలాంటి స్థితిలో ఇతరులు ఏదైనా అడిగితే సరిగ్గానే సమాధానం చెబుతారు. కానీ భార్య అడిగితేనే కోప్పడుతారు. సరిగ్గా సమాధానం చెప్పరు. అలాంటి సందర్భాల్లోనూ భార్య.. భర్తను అనుమానించాల్సిందే. భార్య అంటే ఇష్టం లేకనో మరేదైనా కారణం వల్లో భర్త అలా అరుస్తున్నాడని అర్థం చేసుకోవాలి.
భార్యాభర్తలు అప్పుడప్పుడూ సరదాగా టూర్లు వేస్తుంటారు. ఇది సహజమే. కానీ భార్య లేకుండా కేవలం భర్త ఒక్కడే ఒంటరిగా టూరిస్ట్ ప్లేస్లకు వెళ్తున్నాడు.. అంటే.. అనుమానించాల్సిందే. స్నేహితులతో కాకుండా ఒంటరిగా ఎక్కడికైనా టూర్ వేస్తున్నాడంటే.. అలాంటి భర్తను భార్య అనుమానించాలి. ఇలా పలు సూచనలు పాటించడం వల్ల భర్త తనను మోసం చేస్తున్నదీ లేనిదీ.. ఇట్టే తెలిసిపోతుంది. దీంతో భార్య అలర్ట్ అయి అందుకు అనుగుణంగా ఏదైనా చేసేందుకు.. భర్తను తనవైపుకు తిప్పుకునేందుకు అవకాశం ఉంటుంది. లేదంటే.. అలాంటి కాపురం నిలబడదు.