Cheese Bread Omelette : చీజ్ బ్రెడ్ ఆమ్లెట్‌ను ఇలా వేయాలి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..

Cheese Bread Omelette : మ‌నం అల్పాహారంగా లేదా స్నాక్స్ గా బ్రెడ్ ఆమ్లెట్ ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. బ్రెడ్ ఆమ్లెట్ చాలా రుచిగా ఉంటుంది. అంద‌రూ దీనిని ఇష్టంగా తింటారు. ఈ బ్రెడ్ ఆమ్లెట్ ను చీజ్ వేసి మ‌రింత రుచిగా కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. చీజ్ బ్రెడ్ ఆమ్లెట్ చాలా రుచిగా ఉండ‌డంతో పాటు దీనిని త‌యారు చేసుకోవ‌డం చాలా తేలిక‌. చీజ్ బ్రెడ్ ఆమ్లెట్ ను స్ట్రీట్ స్టైల్ లో ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

స్ట్రీట్ స్టైల్ చీస్ బ్రెడ్ ఆమ్లెట్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

కోడిగుడ్లు – 6, బ్రెడ్ స్లైసెస్ – 6, ఉప్పు – త‌గినంత‌, ప‌సుపు – పావు టీ స్పూన్, చిన్న‌గా త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2, చిన్న‌గా తరిగిన ఉల్లిపాయ – 1, చిన్న‌గా త‌రిగిన చిన్న ట‌మాట – 1, క్యాప్సికం త‌రుగు – 2 టేబుల్ స్పూన్స్, చిల్లీ ప్లేక్స్ – ఒక టీ స్పూన్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా, మిరియాల పొడి – అర టీ స్పూన్, చీజ్ స్లైసెస్ – 4, బ‌ట‌ర్ – 3 టేబుల్ స్పూన్స్.

Cheese Bread Omelette recipe in telugu very tasty prepare in this way
Cheese Bread Omelette

స్ట్రీట్ స్టైల్ చీస్ బ్రెడ్ ఆమ్లెట్ త‌యారీ విధానం..

ముందుగా పెనం మీద బ‌ట‌ర్ వేసి వేడి చేయాలి. బ‌ట‌ర్ క‌రిగిన త‌రువాత బ్రెడ్ స్లైసెస్ ను వేసి రెండు వైపులా ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు కాల్చుకుని ప‌క్కకు పెట్టుకోవాలి. త‌రువాత ఒక గిన్నెలో కోడిగుడ్ల‌ను తీసుకోవాలి. త‌రువాత అందులో ఉప్పు, ప‌సుపు, ప‌చ్చిమిర్చి త‌రుగు, ఉల్లిపాయ త‌రుగు వేసి నురుగు వ‌చ్చే వ‌ర‌కు బాగా క‌ల‌పాలి. త‌రువాత ట‌మాట త‌రుగు, క్యాప్సికం త‌రుగు, చిల్లీ ప్లేక్స్, కొత్తిమీర‌, మిరియాల పొడి వేసి బాగా క‌ల‌పాలి. త‌రువాత పెనం మీద బ‌ట‌ర్ వేసి వేడి చేయాలి. బ‌ట‌ర్ క‌రిగిన త‌రువాత మంట‌ను చిన్న‌గా చేసి ఒక పెద్ద గంటెడు కోడిగుడ్డు మిశ్ర‌మాన్ని వేసి పెనం అంతా వ‌చ్చేలా స్ప్రెడ్ చేసుకోవాలి. త‌రువాత దానిపై రెండు బ్రెడ్ స్లైసెస్ ను ఉంచాలి. వీటిని 15 సెక‌న్ల పాటు ఉంచి ఈ బ్రెడ్ స్లైసెస్ ను మ‌రో వైపుకు తిప్పుకోవాలి.

ఇప్పుడు రెండు బ్రెడ్ స్లైసెస్ మీద రెండుచీజ్ స్లైసెస్ ను ఉంచాలి. త‌రువాత ఆమ్లెట్ చివ‌ర్ల‌ను లోప‌లికి మూసేసి బ్రెడ్ ఒక దాని మీదికి ఒక‌టి వ‌చ్చేలా మ‌డుచుకోవాలి. త‌రువాత వీటిని రెండు వైపులా 15 సెక‌న్ల పాటు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే స్ట్రీట్ స్టైల్ చీస్ బ్రెడ్ ఆమ్లెట్ త‌యార‌వుతుంది. దీనిని ఉద‌యం అల్పాహారంగా లేదా స్నాక్స్ గా త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. వీటిని పిల్ల‌లు మ‌రింత ఇష్టంగా తింటారు. సాధార‌ణ బ్రెడ్ ఆమ్లెట్ కంటే ఈ విధంగా చీజ్ వేసిన బ్రెడ్ ఆమ్లెట్ మ‌రింత రుచిగా ఉంటుంది.

Share
D

Recent Posts