Cheruku Rasam Paramannam : పరమనాన్ని ఇష్టపడని వారు ఉండరనే చెప్పవచ్చు. పండుగలకు దీనిని ఎక్కువగా తయారు చేస్తూ ఉంటాము. పరమాన్నం చాలా రుచిగా ఉంటుంది. దీనిని బెల్లం లేదా పంచదారతో తయారు చేస్తూ ఉంటారు. అయితే తరుచూ బెల్లం, పంచదారనే కాకుండా మనం చెరుకురసంతో కూడా పరమానాన్ని తయారు చేసుకోవచ్చు. కేవలం రెండే రెండుపదార్థాలను ఉపయోగించి ఈ పరమానాన్ని తయారు చేసుకోవచ్చు. చెరుకురసంతో చేసే ఈ పరమాన్నం చాలా రుచిగా ఉంటుంది. పూర్వకాలంలో దీనిని ఎక్కువగా తయారు చేసేవారు. ఎంతో రుచిగా, కమ్మగా ఉండే ఈ చెరుకు రసం పరమానాన్ని ఎలా తయారు చేసుకోవాలి… అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
చెరుకురసం పరమాన్నం తయారీకి కావల్సిన పదార్థాలు..
చిట్టి ముత్యాల బియ్యం – ఒక గ్లాస్, చెరుకు రసం – 5 గ్లాసులు, దంచిన యాలకులు – 2, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, నెయ్యి – ఒక టేబుల్ స్పూన్, జీడిపప్పు – కొద్దిగా, ఎండుద్రాక్ష – కొద్దిగా, ఎండుకొబ్బరి తురుము – కొద్దిగా.
చెరుకురసం పరమాన్నం తయారీ విధానం..
ముందుగా చిట్టి ముత్యాల బియ్యాన్ని శుభ్రంగా కడిగి నీళ్లు పోసి నానబెట్టాలి. తరువాత ఒక గిన్నెలో తాజా చెరుకు రసాన్ని తీసుకోవాలి. ఇందులో ఎటువంటి ఫ్లేవర్స్ లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఈ చెరుకు రసంలో యాలకులు, దాల్చిన చెక్క వేసి వేడి చేయాలి. చెరుకు రసం మరిగిన తరువాత దీనిపై ఏర్పడిని తేటను నెమ్మదిగా తొలగించాలి. తరువాత నానబెట్టిన బియ్యం వేసి కలపాలి. దీనిపై మూత పెట్టి ఉడికించాలి. బియ్యం ఉడికి దగ్గర పడిన తరువాత మంటను చిన్నగా చేసి మరలా మూత పెట్టి ఉడికించాలి. బియ్యం పూర్తిగా మెత్తగా ఉడికి దగ్గర పడిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీనిని నేరుగా ఇలాగే సర్వ్ చేసుకోవచ్చు. మరింత రుచిగా కావాలనుకునే వారు జీడిపప్పు వేయించి చల్లుకుని సర్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. తరువాత జీడిపప్పు వేసి వేయించాలి. ఇవి కొద్దిగా వేగిన తరువాత ఎండుద్రాక్ష వేసి వేయించాలి. తరువాత ఎండుకొబ్బరి తురుము కూడా వేసి వేయించాలి. ఇప్పుడు వీటిని ముందుగా సిద్దం చేసుకున్న పరమాన్నంలో వేసి కలిపి సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే చెరుకురసం పరమాన్నం తయారవుతుంది. ఈ విధంగా తయారు చేసిన చెరుకు రసం పరమాన్నాన్ని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.