Chicken Pepper Fry : రెస్టారెంట్ల‌లో ల‌భించే చికెన్ పెప్ప‌ర్ ఫ్రై.. ఇలా చేస్తే రుచిగా ఉంటుంది..!

Chicken Pepper Fry : మ‌నం చికెన్ తో చేసే వంట‌కాల్లో చికెన్ ఫ్రై కూడా ఒక‌టి. చికెన్ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. స్నాక్స్ గా తీసుకోవ‌డానికి, సైడ్ డిష్ గా తిన‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. చికెన్ ఫ్రైను ఒక్కొక్క‌రు ఒక్కో ప‌ద్ద‌తిలో త‌యారు చేస్తూ ఉంటారు. కింద చెప్పిన విధంగా చేసే చికెన్ ఫ్రై కూడా చాలా రుచిగా ఉంటుంది. మిరియాల పొడి వేసి చేసే ఈ చికెన్ ఫ్రైను ఒక్క‌సారి తింటే మ‌ళ్లీ మ‌ళ్లీ ఇదే కావాలంటారు. మ‌రింత రుచిగా, క్రిస్పీగా చికెన్ పెప్ప‌ర్ ఫ్రైను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

చికెన్ పెప్ప‌ర్ ఫ్రై త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

మిరియాలు – ఒక టేబుల్ స్పూన్, నూనె – డీప్ ఫ్రైకు స‌రిప‌డా, ల‌వంగాలు – 3, యాల‌కులు – 3, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క‌, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, చిన్న‌గా త‌రిగిన వెల్లుల్లి త‌రుగు – ఒక టీ స్పూన్, చిన్న‌గా త‌రిగిన అల్లం త‌రుగు – ఒక టీ స్పూన్, చిన్న‌గా త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2, క‌రివేపాకు – 2 రెమ్మ‌లు.

Chicken Pepper Fry recipe make it in restaurant style
Chicken Pepper Fry

మ్యారినేష‌న్ కు కావ‌ల్సిన ప‌దార్థాలు..

చికెన్ – అర‌కిలో, ఉప్పు – త‌గినంత‌, ప‌సుపు -అర టీ స్పూన్, కారం – అర టీ స్పూన్, మిరియాల పొడి -అర టీ స్పూన్, ఫుడ్ క‌ల‌ర్ – కొద్దిగా.

చికెన్ పెప్ప‌ర్ ఫ్రై త‌యారీ విధానం..

ముందుగా గిన్నెలో చికెన్ ను తీసుకోవాలి. త‌రువాత ఇందులో మ్యారినేష‌న్ కు కావ‌ల్సిన ప‌దార్థాలు వేసి క‌ల‌పాలి. తరువాత దీనిపై మూత పెట్టి గంట పాటు మ్యారినేట్ చేసుకోవాలి. త‌రువాత క‌ళాయిలో డీప్ ఫ్రైకు స‌రిప‌డా నూనె పోసి వేడి చేయాలి. త‌రువాత చికెన్ వేసి వేయించాలి. చికెన్ ను పూర్తిగా వేయించి గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత మిరియాల‌ను రోట్లో వేసి క‌చ్చా ప‌చ్చాగా దంచి ప‌క్క‌కు ఉంచాలి. త‌రువాత క‌ళాయిలో 4 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత ల‌వంగాలు, యాల‌కులు, దాల్చిన చెక్క‌, జీల‌క‌ర్ర వేసి వేయించాలి.త‌రువాత వెల్లుల్లి త‌రుగు, అల్లం త‌రుగు, ప‌చ్చిమిర్చి, క‌రివేపాకు వేసి వేయించాలి. ఇవ‌న్నీ వేగిన త‌రువాత వేయించిన చికెన్ వేసి క‌ల‌పాలి. త‌రువాత దంచిన మిరియాల పొడి వేసి అంతా క‌లిసేలా క‌లుపుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే చికెన్ పెప్ప‌ర్ ఫ్రై త‌యార‌వుతుంది. దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. త‌రుచూ ఒకేర‌కంగా కాకుండా ఇలా వెరైటీగా కూడా చికెన్ ఫ్రైను త‌యారు చేసి తీసుకోవ‌చ్చు.

D

Recent Posts