Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home food

Chikkudukaya Masala Kura : చిక్కుడుకాయ‌ల‌ను ఒక్క‌సారి ఇలా కూర చేయండి.. రుచి చూస్తే జ‌న్మ‌లో విడిచిపెట్ట‌రు..!

D by D
July 21, 2023
in food, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Chikkudukaya Masala Kura : మ‌నం చిక్కుడు కాయ‌ల‌తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. చిక్కుడుకాయ‌ల‌తో చేసే కూర‌లు చాలా రుచిగా ఉంటాయి. అలాగే చిక్కుడు కాయ‌ల‌ను తీసుకోవ‌డం మ‌న ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు క‌లుగుతుంది. త‌ర‌చూ చేసే వంట‌కాల‌తో పాటు మ‌నం చిక్కుడుకాయ‌ల‌తో ఎంతో రుచిగా ఉండే మ‌సాలా కూర‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. చిక్కుడుకాయ‌ల‌తో చేసే ఈ మ‌సాలా కూర చాలా రుచిగా ఉంటుంది. అలాగే దీనిని చాలా త‌క్కువ స‌మ‌యంలో, చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ చిక్కుడుకాయ మ‌సాలా కూర‌ను ఎలా తయారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

చిక్కుడుకాయ మ‌సాలా కూర త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

చిక్కుడు కాయ‌లు – పావుకిలో, నూనె – 3 టేబుల్ స్పూన్స్, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2, త‌రిగిన ఉల్లిపాయ – 1, ప‌సుపు – అర టీ స్పూన్, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, త‌రిగిన ట‌మాటాలు – 2, నీళ్లు – 400 ఎమ్ ఎల్, క‌సూరి మెంతి – అర టీ స్పూన్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

Chikkudukaya Masala Kura recipe in telugu make like this
Chikkudukaya Masala Kura

మ‌సాలా పేస్ట్ కు కావ‌ల్సిన ప‌దార్థాలు..

ప‌ల్లీలు – 2 టేబుల్ స్పూన్స్, ల‌వంగాలు – 4, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క‌, ధ‌నియాలు – ఒక టేబుల్ స్పూన్, జీల‌కర్ర – ఒక టీ స్పూన్, మెంతులు – 4 గింజ‌లు, ఎండు కొబ్బ‌రి ముక్క‌లు – ఒక టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెబ్బ‌లు – 6, అల్లం -ఒక ఇంచు ముక్క‌, చింత‌పండు – ఒక రెమ్మ‌, కారం – రెండు టీ స్పూన్స్, ఉప్పు – త‌గినంత‌.

చిక్కుడుకాయ మ‌సాలా కూర త‌యారీ విధానం..

ముందుగా క‌ళాయిలో ప‌ల్లీలు వేసి వేయించాలి. ఇవి కొద్దిగా వేగిన త‌రువాత ల‌వంగాలు, దాల్చిన చెక్క‌, ధ‌నియాలు, జీల‌క‌ర్ర‌, మెంతులు వేసి వేయించి జార్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే జార్ లో మిగిలిన ప‌దార్థాల‌న్నీ వేసి త‌గినన్ని నీళ్లు పోసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత కుక్క‌ర్ లో నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత తాళింపు దినుసులు వేసి వేయించాలి. త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్క‌లు కొద్దిగా వేగిన త‌రువాత ప‌చ్చిమిర్చి, క‌రివేపాకు, ప‌సుపు వేసి క‌ల‌పాలి. ఇవి కూడా వేగిన త‌రువాత ట‌మాట ముక్క‌లు, మిక్సీ ప‌ట్టుకున్న పేస్ట్ వేసి క‌ల‌పాలి.

దీనిని నూనె పైకి తేలే వ‌ర‌కు వేయించిన త‌రువాత చిక్కుడుకాయ ముక్క‌లు వేసి క‌ల‌పాలి. వీటిని రెండు నిమిషాల పాటు వేయించిన త‌రువాత నీళ్లు పోసి క‌ల‌పాలి. త‌రువాత మూత పెట్టి 3 విజిల్స్ వ‌చ్చే వ‌ర‌కు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఆవిరి పోయిన త‌రువాత మూత తీసి కొత్తిమీర వేసుకుని స‌ర్వ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే చిక్కుడుకాయ మ‌సాలా కూర త‌యార‌వుతుంది. దీనిని అన్నం, చ‌పాతీ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది. చిక్కుడు కాయ‌ల‌ను తిన‌ని వారు కూడా ఈ కూర‌ను ఇష్టంగా తింటారు.

Tags: Chikkudukaya Masala Kura
Previous Post

Mullangi Pachadi : ముల్లంగితో ప‌చ్చ‌డి ఎప్పుడైనా చేశారా.. ఒక్క‌సారి ఇలా చేయండి.. టేస్ట్ మామూలుగా ఉండ‌దు..!

Next Post

Almonds For Diabetes : షుగ‌ర్ ఉన్న‌వారు బాదంప‌ప్పును తిన‌వచ్చా.. తింటే ఏమ‌వుతుంది..?

Related Posts

ఆధ్యాత్మికం

వినాయ‌కుడి క‌థ నుంచి త‌ల్లిదండ్రులు నేర్చుకోవాల్సిన ముఖ్య‌మైన విష‌యాలు ఇవే..!

July 3, 2025
వైద్య విజ్ఞానం

పురుషుల క‌న్నా స్త్రీల‌కు 20 నిమిషాలు ఎక్కువ నిద్ర అవ‌స‌రం అట‌.. ఎందుకో తెలుసా..?

July 3, 2025
lifestyle

ఇప్పుడు మ‌నం వాడుతున్న బ్లేడ్ల‌కు అలా డిజైన్ ఎలా వ‌చ్చిందో తెలుసా..?

July 3, 2025
Off Beat

తాజ్ మహల్ గురించి ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా..? మొత్తం 1089 ర‌హ‌స్య గ‌దులు ఉన్నాయి..!

July 3, 2025
పోష‌ణ‌

మీ చ‌ర్మం ఎల్ల‌ప్పుడూ య‌వ్వ‌నంగా క‌నిపించాలంటే వీటిని తీసుకోండి..!

July 3, 2025
చిట్కాలు

ప‌సుపు రంగులోకి మారిన మీ దంతాలు మళ్లీ తెల్ల‌గా మారాలంటే ఈ చిట్కాల‌ను పాటించండి..!

July 3, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
mythology

మ‌హాభార‌త కాలంలో ప‌న్నులు ఎలా వ‌సూలు చేసేవారో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.