Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home food

Crispy Corn Fried Rice : మొక్క‌జొన్న‌ల‌తో ఎంతో రుచిక‌ర‌మైన క్రిస్పీ కార్న్ ఫ్రైడ్ రైస్‌.. త‌యారీ ఇలా..!

D by D
April 14, 2023
in food, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Crispy Corn Fried Rice : మ‌నం స్వీట్ కార్న్ కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. స్వీట్ కార్న్ మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటూ ఉంటారు. స్వీట్ కార్న్ తో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. స్వీట్ కార్న్ తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో క్రిస్పీ కార్న్ ఫ్రైడ్ రైస్ కూడా ఒక‌టి. కార్న్ తో చేసే ఈ రైస్ వెరైటీ చాలా రుచిగా ఉంటుంది. స్పైసీగా, రుచిగా ఉండే ప్రైడ్ రైస్ ను త‌యారు చేయ‌డం చాలా తేలిక‌. ఎవ‌రైనా దీనిని సుల‌వుగా త‌యారు చేయ‌వ‌చ్చు. స్వీట్ కార్న్ తో ఎంతో రుచిగా ఉండే క్రిస్పీ కార్న్ ఫ్రైడ్ రైస్ ను ఎలా త‌యారు చేయాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

క్రిస్పీ కార్న్ ఫ్రైడ్ రైస్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

స్వీట్ కార్న్ – అర క‌ప్పు, ఉప్పు – చిటికెడు, మిరియాల పొడి – 2 చిటికెలు, మైదా పిండి – ఒక టేబుల్ స్పూన్, కార్న్ ఫ్లోర్ – ఒక టేబుల్ స్పూన్, నూనె – డీప్ ప్రైకు స‌రిప‌డా.

Crispy Corn Fried Rice recipe in telugu make in this method
Crispy Corn Fried Rice

ఫ్రైడ్ రైస్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె – 3 టేబుల్ స్పూన్స్, చిన్న‌గా తరిగిన ప‌చ్చిమిర్చి – 2, స‌న్న‌ని ఉల్లిపాయ తరుగు – 2 టేబుల్ స్పూన్స్, అల్లం త‌రుగు – ఒక టీ స్పూన్, క్యారెట్ త‌రుగు – పావు క‌ప్పు, బీన్స్ త‌రుగు – పావు క‌ప్పు, అన్నం – ఒక క‌ప్పు బాస్మ‌తీ బియ్యంలో ఉప్పు వేసి వండినంత‌, మిరియాల పొడి – అర టీ స్పూన్, డార్క్ సోయా సాస్ – అర టీ స్పూన్, వెనిగ‌ర్ – అర టీ స్పూన్, పంచ‌దార – అర టీ స్పూన్, తెల్ల మిరియాల పొడి – ఒక టీ స్పూన్, చైనీస్ చిల్లీ పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, స్ప్రింగ్ ఆనియ‌న్స్ త‌రుగు – 2 టేబుల్ స్పూన్స్.

క్రిస్పీ కార్న్ ఫ్రైడ్ రైస్ త‌యారీ విధానం..

ముందుగా గిన్నెలో నీటిని తీసుకుని బాగా వేడి చేయాలి. నీళ్లు మ‌రిగిన త‌రువాత స్వీట్ కార్న్ వేసి ఉడికించాలి. వీటిని మెత్త‌గా ఉడికించిన త‌రువాత ఒక గిన్నెలోకి తీసుకుని చ‌ల్ల‌టి నీటిని పోసుకోవాలి. త‌రువాత వీటిని నీళ్లు లేకుండా పూర్తిగా వ‌డ‌క‌ట్టి గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత ఇందులో నూనె త‌ప్ప మిగిలిన ప‌దార్థాల‌న్నీ వేసి బాగా క‌ల‌పాలి. త‌రువాత ఒక‌టి లేదా రెండు టీ స్పూన్ల నీళ్లు పోసి పిండి గింజ‌ల‌కు పట్టేలా క‌లుపుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక ముందుగా సిద్దం చేసుకున్న స్వీట్ కార్న్ ను వేసి వేయించాలి. వీటిని మ‌ధ్య‌స్థ మంట‌పై క్రిస్పీగా అయ్యే వ‌ర‌కు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక ప‌చ్చిమిర్చి, ఉల్లిపాయ, అల్లం త‌రుగు వేసి వేయించాలి.

ఉల్లిపాయ మెత్త‌బ‌డిన త‌రువాత వేయించిన కార్న్ వేసి టాస్ చేసుకోవాలి. త‌రువాత క్యారెట్, బీన్స్ వేసి పెద్ద మంట‌పై 3 నిమిషాల పాటు టాస్ చేసుకోవాలి. త‌రువాత అన్నం వేసి క‌ల‌పాలి. ఇప్పుడు మిరియాల పొడి, సోయా సాస్, వెనిగ‌ర్, పంచ‌దార‌, తెల్ల మిరియాల పొడి వేసి క‌ల‌పాలి. త‌రువాత చిల్లీ పేస్ట్ వేసి క‌ల‌పాలి. చివ‌ర‌గా స్ప్రింగ్ ఆనియ‌న్స్ చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే క్రిస్పీ కార్న్ ఫ్రైడ్ రైస్ త‌యార‌వుతుంది. దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. లంచ్ బాక్స్ లోకి కూడా ఈ వంట‌కం చాలా చ‌క్క‌గా ఉంటుంది.

Tags: Crispy Corn Fried Rice
Previous Post

Cloves With Warm Water : రాత్రి నిద్రపోయే ముందు 2 లవంగాల‌ను తిని గోరు వెచ్చ‌ని నీరు తాగండి.. ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Next Post

Anjeer : అంజీర్ పండ్ల‌కు చెందిన ఈ ర‌హ‌స్యాలు మీకు తెలుసా.. ఆశ్చ‌ర్య‌పోతారు..!

Related Posts

ఆధ్యాత్మికం

మీకు శ‌నిదోషం ఉందా..? అయితే ఈ ప‌రిహారాల‌ను పాటిస్తే మంచిది..!

July 3, 2025
ఆధ్యాత్మికం

ఏ వేలితో బొట్టు పెట్టుకుంటే ఎలాంటి ఫ‌లితాలు క‌లుగుతాయంటే..?

July 3, 2025
ఆధ్యాత్మికం

శుక్ర‌వారం నాడు ఇలా చేస్తే మీ ఇంట్లో ల‌క్ష్మీ క‌టాక్ష‌మే..!

July 3, 2025
lifestyle

స్త్రీల‌లో పురుషులు ఇష్టప‌డే 15 అంశాలు ఇవే తెలుసా..?

July 3, 2025
హెల్త్ టిప్స్

ఈ 5 ర‌కాల తెల్ల‌ని విష ప‌దార్థాల‌ను మ‌నం రోజూ తింటున్నామ‌ని తెలుసా..?

July 3, 2025
హెల్త్ టిప్స్

గోధుమ రొట్టె, అన్నం రెండూ ఒకేసారి తిన‌కూడ‌దా..? తింటే ఏమ‌వుతుందో తెలుసా..?

July 3, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.