Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home food

Crispy Mokkajonna Garelu : మొక్క‌జొన్న గారెల‌ను ఇలా చేయండి.. క‌ర‌క‌ర‌లాడుతూ సూప‌ర్‌గా వ‌స్తాయి..!

D by D
December 20, 2023
in food, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Crispy Mokkajonna Garelu : మొక్క‌జొన్న కంకుల‌ను కూడా మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. ఇవి మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మొక్క‌జొన్న కంకుల‌ను ఉడికించి, వేయించి, కాల్చుకుని తింటూ ఉంటాము. అలాగే మొక్క‌జొన్న కంకుల‌తో మ‌నం గారెల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాము. మొక్క‌జొన్న గారెలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. క్రిస్పీగా ఉండే గారెలు తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఉంటాయి. స్నాక్స్ గా తీసుకోవ‌డానికి ఇవి చాలా చ‌క్క‌గా ఉంటాయి. వీటిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. మొక్క‌జొన్న గారెల‌ను రుచిగా, క్రిస్పీగా ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

మొక్క‌జొన్న గారెల త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నాన‌బెట్టిన ముదురు మొక్క‌జొన్న గింజ‌లు – 2 క‌ప్పులు, ఎండుమిర్చి – 2, ప‌చ్చిమిర్చి – 2, ఉప్పు – త‌గినంత‌, అల్లం – అర ఇంచు ముక్క‌, వెల్లుల్లి రెబ్బ‌లు – 4, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, శ‌న‌గ‌పిండి – ఒక టేబుల్ స్పూన్, బియ్యంపిండి – ఒక టేబుల్ స్పూన్, చిన్న‌గాత‌రిగిన క‌రివేపాకు – ఒక రెమ్మ‌, త‌రిగిన కొత్తిమీర – 2 టేబుల్ స్పూన్స్, త‌రిగిన పుదీనా – 2 టేబుల్ స్పూన్స్, ఉల్లిపాయ ముక్క‌లు – అర క‌ప్పు, ధ‌నియాల పొడి – అర టీ స్పూన్, గ‌రం మ‌సాలా – పావు టీ స్పూన్, చాట్ మ‌సాలా – పావు టీ స్పూన్, ప‌సుపు – పావు టీ స్పూన్, నూనె – డీప్ ఫ్రైకు స‌రిప‌డా.

Crispy Mokkajonna Garelu recipe very tasty snacks to make
Crispy Mokkajonna Garelu

మొక్క‌జొన్న గారెల త‌యారీ విధానం..

ముందుగా నాన‌బెట్టిన మొక్క‌జొన్న గింజ‌ల‌ను వ‌డ‌క‌ట్టి జార్ లో వేసుకోవాలి. ఇందులోనే ఎండుమిర్చి, ప‌చ్చిమిర్చి, ఉప్పు, అల్లం, వెల్లుల్లి రెబ్బ‌లు, జీల‌క‌ర్ర వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. అవ‌స‌ర‌మైతే కొద్దిగా నీటిని పోసి మిక్సీ ప‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత ఇందులో నూనె త‌ప్ప మిగిలిన ప‌దార్థాల‌న్నీ వేసి బాగా క‌లుపుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక పిండిని తీసుకుని గారెలుగా వ‌త్తుకుని నూనెలో వేసుకోవాలి. గారెలు మ‌రీ మందంగా, మ‌రీ ప‌లుచ‌గా కాకుండా వ‌త్తుకోవాలి. త‌రువాత ఈ గారెల‌ను మ‌ధ్య‌స్థ మంట‌పై క్రిస్పీగా అయ్యే వ‌ర‌కు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా, క్రిస్పీగా ఉండే మొక్క‌జొన్న గారెలు త‌యార‌వుతాయి. వీటిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. స్నాక్స్ తినాల‌నిపించిన‌ప్పుడు ఇలా వేడి వేడిగా మొక్క‌జొన్న గారెల‌ను త‌యారు చేసి తీసుకోవ‌చ్చు.

Tags: Crispy Mokkajonna Garelu
Previous Post

Kakarakaya Nilva Pachadi : చేదు లేకుండా కాక‌ర‌కాయ నిల్వ ప‌చ్చ‌డి ఇలా పెట్టుకోండి.. ఎంతో రుచిగా ఉంటుంది..!

Next Post

Mix These With Ghee : నెయ్యిలో వీటిని క‌లిపి తినండి.. ఎక్కువ లాభాల‌ను పొంద‌వ‌చ్చు..!

Related Posts

ఆధ్యాత్మికం

మీకు శ‌నిదోషం ఉందా..? అయితే ఈ ప‌రిహారాల‌ను పాటిస్తే మంచిది..!

July 3, 2025
ఆధ్యాత్మికం

ఏ వేలితో బొట్టు పెట్టుకుంటే ఎలాంటి ఫ‌లితాలు క‌లుగుతాయంటే..?

July 3, 2025
ఆధ్యాత్మికం

శుక్ర‌వారం నాడు ఇలా చేస్తే మీ ఇంట్లో ల‌క్ష్మీ క‌టాక్ష‌మే..!

July 3, 2025
lifestyle

స్త్రీల‌లో పురుషులు ఇష్టప‌డే 15 అంశాలు ఇవే తెలుసా..?

July 3, 2025
హెల్త్ టిప్స్

ఈ 5 ర‌కాల తెల్ల‌ని విష ప‌దార్థాల‌ను మ‌నం రోజూ తింటున్నామ‌ని తెలుసా..?

July 3, 2025
హెల్త్ టిప్స్

గోధుమ రొట్టె, అన్నం రెండూ ఒకేసారి తిన‌కూడ‌దా..? తింటే ఏమ‌వుతుందో తెలుసా..?

July 3, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.