Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home food

Dahi Aloo Masala Curry : చ‌పాతీ, పుల్కా, రోటీల్లోకి.. ఈ ఆలు క‌ర్రీని చేసి తినండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!

D by D
September 28, 2023
in food, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Dahi Aloo Masala Curry : మ‌నం బంగాళాదుంప‌ల‌తో ర‌క‌రకాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. బంగాళాదుంప‌ల‌తో చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. బంగాళాదుంప‌ల‌తో చేసే ఈ వంట‌కాల్లో ద‌హీ ఆలూ మ‌సాలా క‌ర్రీ కూడా ఒక‌టి. ఈ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. దేనితో తిన్నా కూడా ఈ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. ఈ కర్రీని ఎవ‌రైనా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఉండే ఈ ఆలూ ద‌హీ మ‌సాలా క‌ర్రీని ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ద‌హీ ఆలూ మ‌సాలా క‌ర్రీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ఉడికించి పెద్ద ముక్క‌లుగా త‌రిగిన బంగాళాదుంప‌లు – పెద్ద‌వి రెండు, నూనె – 2 టేబుల్ స్పూన్స్, ఇంగువ – పావు టీ స్పూన్, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, ఎండుమిర్చి – 2, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, ప‌చ్చిమిర్చి – 4, త‌రిగిన ఉల్లిపాయ – 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, ప‌సుపు – అర టీ స్పూన్, కారం – 2 టీ స్పూన్స్, ధ‌నియాల పొడి – ఒక‌టిన్న‌ర టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, పెరుగు – ఒక కప్పు, క‌సూరి మెంతి – ఒక టీ స్పూన్, నీళ్లు – అర క‌ప్పు, గ‌రం మ‌సాలా – అర టీ స్పూన్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

Dahi Aloo Masala Curry recipe in telugu make like this
Dahi Aloo Masala Curry

ద‌హీ ఆలూ మ‌సాలా క‌ర్రీ త‌యారీ విధానం..

ముందుగా క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత జీల‌క‌ర్ర‌, ఇంగువ‌, ఎండుమిర్చి, క‌రివేపాకు, ప‌చ్చిమిర్చి వేసి వేయించాలి. ఇవి వేగిన త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి. ఇవి వేగిన త‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత ప‌సుపు, ఉప్పు, కారం, ధ‌నియాల పొడి వేసి క‌ల‌పాలి. వీటిని ఒక నిమిషం పాటు వేయించిన త‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. త‌రువాత పెరుగు వేసి క‌ల‌పాలి. ఇప్పుడు మ‌ర‌లా స్ట‌వ్ ఆన్ చేసి చిన్న మంట‌పై నూనె పైకి తేలే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత క‌సూరి మెంతి, నీళ్లు పోసి క‌ల‌పాలి. ఇప్పుడు ఇందులో బంగాళాదుంప ముక్క‌లు వేసి క‌లిపి దీనిపై మూత పెట్టి నూనె పైకి తేలే వ‌ర‌కు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. త‌రువాత గ‌రం మ‌సాలా, కొత్తిమీర వేసి క‌లిపి స‌ర్వ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ద‌హీ ఆలూ మ‌సాలా క‌ర్రీ త‌యార‌వుతుంది. దీనిని రోటీ, చపాతీ, పుల్కా వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ క‌ర్రీని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Tags: Dahi Aloo Masala Curry
Previous Post

Aloo Vankaya Vepudu : ఆలు వంకాయ వేపుడు ఇలా చేయండి.. లొట్ట‌లేసుకుంటూ మొత్తం తినేస్తారు..!

Next Post

Lemon And Coconut Oil For Dandruff : నిమ్మ‌ర‌సం, కొబ్బ‌రినూనెతో ఇలా చేస్తే.. చుండ్రు శాశ్వ‌తంగా మాయం అవుతుంది..!

Related Posts

వైద్య విజ్ఞానం

షుగ‌ర్ వ్యాధి కంట్రోల్‌లో ఉండ‌క‌పోతే కిడ్నీలు చెడిపోతాయా..?

July 4, 2025
ఆధ్యాత్మికం

మీకు శ‌నిదోషం ఉందా..? అయితే ఈ ప‌రిహారాల‌ను పాటిస్తే మంచిది..!

July 3, 2025
ఆధ్యాత్మికం

ఏ వేలితో బొట్టు పెట్టుకుంటే ఎలాంటి ఫ‌లితాలు క‌లుగుతాయంటే..?

July 3, 2025
ఆధ్యాత్మికం

శుక్ర‌వారం నాడు ఇలా చేస్తే మీ ఇంట్లో ల‌క్ష్మీ క‌టాక్ష‌మే..!

July 3, 2025
lifestyle

స్త్రీల‌లో పురుషులు ఇష్టప‌డే 15 అంశాలు ఇవే తెలుసా..?

July 3, 2025
హెల్త్ టిప్స్

ఈ 5 ర‌కాల తెల్ల‌ని విష ప‌దార్థాల‌ను మ‌నం రోజూ తింటున్నామ‌ని తెలుసా..?

July 3, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.