Deepthi Sunaina : గత కొంత కాలంగా దీప్తి సునైనా, షణ్ముఖ్ ఇద్దరూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్న విషయం విదితమే. వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకున్న తరువాత ఒకరిపై ఒకరు పరోక్షంగా పోస్టులు పెడుతూ సెటైర్లు వేస్తున్నారు. అయితే వీరు మళ్లీ కలుస్తారని అనుకున్నారు కానీ అది జరగదని తెలిసిపోయింది. అయితే వారు ఎందుకు విడిపోయారో ఆ కారణాలను కూడా షణ్ముఖ్ వెల్లడించాడు. తాను సిరితో బిగ్ బాస్ ఇంట్లో చనువుగా ఉండడం దీప్తి సునైన కుటుంబ సభ్యులకు నచ్చలేదని.. కనుక వారి ఒత్తిడి మేరకు ఆమె తనకు బ్రేకప్ చెప్పిందని షణ్ముఖ్ తెలిపాడు. దీంతో ఆ చాప్టర్ అక్కడికి ముగిసింది. అయితే తాజాగా మళ్లీ ఓ కొత్త అధ్యాయం మొదలైనట్లు తెలుస్తోంది. అందుకు కారణం.. దీప్తి సునైనా ఒక వ్యక్తితో చనువుగా ఉండడమే అని చెప్పవచ్చు.
దీప్తి సునైనా తాజాగా డాక్టర్ ఆనంద్‌తో కలిసి చనువుగా ఉన్న ఫొటోలను షేర్ చేసింది. అంతేకాదు ఆ పోస్టుకు లవ్ సింబల్‌ను కూడా జత చేసింది. దీంతో ఆమె అతనితో ప్రేమలో పడిందా.. అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నెటిజన్లు కూడా ఇదే విషయాన్ని ఆరా తీస్తున్నారు. దీంతో షణ్ముఖ్‌కు ఇక గుడ్‌బై చెప్పేసినట్లే అని అంటున్నారు. అయితే దీప్తి ఇలా చేస్తే.. మరి షణ్ముఖ్ సంగతేంటి ? మీరు కలుస్తారని మేం చాలా అనుకున్నాం.. ఇప్పుడు ఇలా చేశావేంటి ? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
అయితే దీప్తి సునైనా నిజంగానే అతన్ని ప్రేమిస్తుందా ? లేక ఇదంతా ఏదైనా సిరీస్ లేదా సీరియల్‌లో భాగమా ? అన్నది తెలియాల్సి ఉంది. దీనిపై స్పష్టత రావాలంటే కొద్ది రోజుల వరకు వేచి చూడాల్సిందే. అయితే దీప్తి సునైనా చాలా రోజుల తరువాత ఇలా ఒక వ్యక్తితో కనిపించడంతో అందరూ ఆసక్తిగా ఈ విషయాన్ని తెలుసుకోవాలని చూస్తున్నారు. మరి దీప్తి ఏం చెబుతుందో చూడాలి.