Dengue Mosquitoes : ప్రస్తుత వర్షాకాలంలో మనం ఎదుర్కునే ముఖ్యమైన సమస్యల్లో దోమలు కూడా ఒకటి. దోమలు మనకు ఎంతో చికాకును, కోపాన్ని తెప్పిస్తాయి. అలాగే వీటి వల్ల మనం విష జ్వరాల బారిన కూడా పడాల్సి వస్తుంది. దోమల కారణంగా డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, బోధకాలు వంటి సమస్యల బారిన పడాల్సి వస్తుంది. ఈ విష జ్వరాల కారణంగా మనం తీవ్ర అనారోగ్యానికి గురి కావాల్సి వస్తుంది. కనుక మనం వీలైనంత వరకు దోమకాటుకు గురి కాకుండా చూసుకోవాలి. మన ఇంట్లో, మన ఇంటి పరిసరాల్లో దోమలు లేకుండా చూసుకోవాలి. చాలా మంది దోమల బెదడను తగ్గించుకోవడానికి దోమల బ్యాట్ లను, స్ప్రేలను, కాయిల్స్ వంటి వాటిని వాడుతూ ఉంటారు. అయితే వీటిని వాడడం అంత మంచిది.
వీటికి బదులుగా కొన్ని సహజ సిద్ద పదార్థాలను ఉపయోగించి కూడా మనం చాలా సులభంగా దోమల బెడద నుండి బయటపడవచ్చు. దోమలను నివారించడంలో వెల్లుల్లి మనకు ఎంతో దోహదపడుతుంది. ఈ వెల్లుల్లిని పొడిగా చేసి నీటిలో కలిపి ఇంట్లో, దోమలు ఎక్కువగా తిరిగే చోట, ఇంటి చుట్టు స్ప్రే చేయాలి. ఇలా చయడం వల్ల దోమల బెడద తగ్గుతుంది. అలాగే వేప ఆకులను ఉపయోగించి కూడా డెంగ్యూను వ్యాప్తి చేసే దోమలను నివారించవచ్చు. వేప ఆకుల పొడిని నీటిలో కలిపి ఇంట్లో, ఇంటి చుట్టూ స్ప్రే చేయాలి. ఇలా చేయడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. ఇక లెమన్ గ్రాస్ ఆయిల్ నుండి వచ్చే వాసన కూడా దోమలకు నచ్చదు. ఈ ఆయిల్ ను కొన్ని చుక్కల మోతాదులో నీటిలో కలిపి స్ప్రే చేయాలి. ఇలా చేయడం వల్ల ఈ వాసన కారణంగా దోమలు రాకుండాఉంటాయి.
అదే విధంగా మన ఇంట్లో ఉండే కర్పూరం వాసన కూడా దోమలకు నచ్చదు. దోమలు ఎక్కువగాఉండే ప్రదేశాల్లో అలాగే ఇంట్లో అక్కడక్కడ కర్పూరం బిళ్లలను ఉంచడం లేదా కర్పూరాన్ని పొడిగా చేసి చల్లడం వంటివి చేయాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లోకి దోమలు రాకుండా ఉంటాయి. ఇక పెప్పర్ మెంట్ ఆయిల్ నుండి వచ్చే వాసన కూడా దోమలకు నచ్చదు. కనుక ఈ ఆయిల్ ను కొన్ని చుక్కల మోతాదులో నీటిలో కలిపిఇంట్లో, దోమలు ఎక్కువగా ఉండే స్ప్రే చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల దోమలు ఇంట్లోకి రాకుండా ఉంటాయి. ఈ చిట్కాలను పాటించడం వల్ల దోమ కాటుకు గురి కాకుండా ఉండడంతో పాటు ఆరోగ్యానికి కూడా హాని కలగకుండా ఉంటుంది.