Dhaba Style Dal : ధాబా స్టైల్‌లో ప‌ప్పును ఇలా చేయండి.. రోటీల్లోకి బాగుంటుంది..

Dhaba Style Dal : వివిధ ర‌కాల కూర‌గాయ‌ల‌తో మ‌నం ప‌ప్పు వంట‌కాల‌ను ఇంట్లో త‌ర‌చూ చేసుకుంటూనే ఉంటాం. ఏ కూర‌గాయ లేదా ఆకుకూర‌తో ప‌ప్పు చేసినా బాగుంటుంది. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. అంద‌రూ ఇష్టంగా తింటారు. అయితే ధాబాల‌లో తిన్న‌ప్పుడు మాత్రం మ‌న‌కు ప‌ప్పు ఇంకో రుచి అనిపిస్తుంది. అయితే కాస్త శ్ర‌మించాలే కానీ ధాబాల్లో వండే విధంగానే మ‌నం మ‌న ఇంట్లోనూ ప‌ప్పును ఎంతో రుచిగా చేసుకోవ‌చ్చు. దీన్ని చేయ‌డం కూడా సుల‌భ‌మే. ఈ క్ర‌మంలోనే ధాబా స్టైల్ ప‌ప్పును ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ధాబా స్టైల్ పప్పు త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

కందిప‌ప్పు – అర క‌ప్పు, శ‌న‌గ‌ప‌ప్పు – అర క‌ప్పు, నీళ్లు – 3 క‌ప్పులు, ప‌సుపు – అర టీస్పూన్‌, బిర్యానీ ఆకు – 1, దాల్చిన చెక్క – చిన్న ముక్క‌, నెయ్యి – 3 టేబుల్ స్పూన్లు, జీల‌క‌ర్ర – 1 టీస్పూన్‌, ఉల్లిపాయ – 1, ట‌మాటాలు – 2, అల్లం వెల్లుల్లి ముద్ద – 1 టీస్పూన్‌, కారం – 1 టీస్పూన్‌, ధ‌నియాల పొడి – అర టీస్పూన్‌, గ‌రం మ‌సాలా – అర టీస్పూన్‌, ఉప్పు – త‌గినంత‌, ఆమ్ చూర్ పొడి – అర టీస్పూన్‌, ఇంగువ – చిటికెడు, ఎండు మిర్చి – 2.

Dhaba Style Dal recipe in telugu tastes better with roti
Dhaba Style Dal

ధాబా స్టైల్ ప‌ప్పును త‌యారు చేసే విధానం..

రెండు ర‌కాల ప‌ప్పుల్ని కుక్క‌ర్‌లో వేసి నీళ్లు పోసి 5 విజిల్స్ వ‌చ్చే వ‌ర‌కు ఉడికించుకుని తీసుకోవాలి. స్ట‌వ్ మీద పాన్ పెట్టి నెయ్యి వేయాలి. అది వేడ‌య్యాక బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క‌, జీల‌క‌ర్ర‌, అల్లం వెల్లుల్లి ముద్ద‌, ఇంగువ‌, వెల్లుల్లి రెబ్బ‌లు, ఎండు మిర్చి వేసి వేయించాలి. త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు, ట‌మాటా ముక్క‌లు వేయాలి. అన్నీ వేగాక త‌గినంత ఉప్పు, ప‌సుపు, కారం, ధ‌నియాల పొడి, గ‌రం మ‌సాలా, ఆమ్ చూర్ పొడి, ఉడికించి పెట్టుకున్న ప‌ప్పు వేసి బాగా క‌లిపి ప‌ప్పు ఉడుకుతున్న‌ప్పుడు దింపేయాలి. ఇది అన్నంలోకే కాదు, చ‌పాతీలు, రోటీల్లోకి కూడా బాగుంటుంది. అంద‌రూ ఇష్టంగా తింటారు. ఒక్క‌సారి ట్రై చేస్తే విడిచిపెట్ట‌రు.

Editor

Recent Posts