Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home food

Dhaba Style Kaju Paneer Masala : ధాబా స్టైల్‌లో కాజు ప‌నీర్ మ‌సాలా ఇలా చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!

D by D
March 18, 2024
in food, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Dhaba Style Kaju Paneer Masala : మ‌న‌కు ధాబాల్ల‌లో ల‌భించే ప‌నీర్ వెరైటీల‌లో కాజు ప‌నీర్ మ‌సాలా క‌ర్రీ కూడా ఒక‌టి. ఈ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. నాన్, బ‌ట‌ర్ నాన్ వంటి వాటితో తిన‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. ఈ క‌ర్రీని చాలా మంది రుచి చూసే ఉంటారు. దీనిని ఇష్ట‌ప‌డ‌ని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. ఈ కాజు ప‌నీర్ మ‌సాలా కర్రీని ధాబా స్టైల్ లో మ‌నం కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. దీనిని త‌యారు చేయ‌డం చాలా తేలిక‌. వీకెండ్స్ లో, స్పెషల్ డేస్ లో ఇలా ప‌నీర్ తో రుచిగా క‌ర్రీని త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ కాజు ప‌నీర్ మ‌సాలా క‌ర్రీని ధాబా స్టైల్ లో ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ధాబా స్టైల్ కాజు ప‌నీర్ మ‌సాలా క‌ర్రీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె – 2 టేబుల్ స్పూన్స్, జీడిప‌ప్పు – పావు క‌ప్పు, జీల‌క‌ర్ర – ఒక టీ స్పూన్, చిన్న‌గా త‌రిగిన పెద్ద ఉల్లిపాయ – 1, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, వేయించిన జీల‌క‌ర్ర పొడి – ఒక టీ స్పూన్, కారం – ఒక టేబుల్ స్పూన్, ధ‌నియాల పొడి – ఒక టీ స్పూన్, గ‌రం మ‌సాలా – అర టీ స్పూన్, పసుపు- అర టీ స్పూన్, పెద్ద ట‌మాటాలు – 2, నీళ్లు – 150 ఎమ్ ఎల్, చిలికిన పెరుగు – 2 టేబుల్ స్పూన్స్, ప‌నీర్ క్యూబ్స్ – పావుకిలో, ప్రెష్ క్రీమ్ – 2 టేబుల్ స్పూన్స్, కొత్తిమీర త‌రుగు – 2 టేబుల్ స్పూన్స్, నెయ్యి – ఒక టేబుల్ స్పూన్.

Dhaba Style Kaju Paneer Masala recipe make in this method
Dhaba Style Kaju Paneer Masala

ధాబా స్టైల్ కాజు ప‌నీర్ మ‌సాలా క‌ర్రీ త‌యారీ విధానం..

ముందుగా క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక జీడిప‌ప్పు వేసి ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. త‌రువాత మరో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. తరువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి అవి ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు వేయించాలి. ఉల్లిపాయ ముక్క‌లు స‌గానికి పైగా వేగిన త‌రువాత ప‌చ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్క‌లు చ‌క్క‌గా వేగిన త‌రువాత జీల‌క‌ర్ర పొడి, కారం, ధ‌నియాల పొడి, గ‌రం మ‌సాలా, ప‌సుపు వేసి క‌ల‌పాలి. మ‌సాలాలు చ‌క్క‌గా వేగిన త‌రువాత ట‌మాటాల‌ను ఫ్యూరీలాగా చేసి వేసుకోవాలి.

దీనిని నూనె పైకి తేలే వ‌ర‌కు వేయించిన త‌రువాత నీళ్లు క‌ల‌పాలి. త‌రువాత పెరుగు వేసి క‌ల‌పాలి. పెరుగు అంతా కూర‌లో క‌లిసే వ‌ర‌కు బాగా కలిపిన త‌రువాత నూనె పైకి తేలే వ‌ర‌కు ఉడికించాలి. త‌రువాత పనీర్, వేయించిన జీడిప‌ప్పు వేసి క‌ల‌పాలి. దీనిని మ‌ధ్య మ‌ధ్య‌లో క‌లుపుతూ నూనె పైకి తేలే వ‌ర‌కు ఉడికించాలి. ఇలా ఉడికించిన త‌రువాత ఫ్రెష్ క్రీమ్, కొత్తిమీర త‌రుగు, నెయ్యి వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ధాబా స్టైల్ కాజు ప‌నీర్ మ‌సాలా క‌ర్రీ త‌యార‌వుతుంది. దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. చ‌పాతీ, రోటీ వంటి వాటితో తింటే ఇది చాలా రుచిగా ఉంటుంది.

Tags: Dhaba Style Kaju Paneer Masala
Previous Post

Cholesterol : ఈ 10 ర‌కాల సూప‌ర్ ఫుడ్స్‌ను తిన్నారంటే చాలు.. కొలెస్ట్రాల్ మొత్తం త‌గ్గిపోతుంది..!

Next Post

KFC Style Chicken Drumsticks : కేఎఫ్‌సీ స్టైల్‌లో చికెన్ డ్ర‌మ్‌స్టిక్స్‌ను ఇలా ఇంట్లోనే ఈజీగా చేయండి.. ఎంతో రుచిగా ఉంటాయి..!

Related Posts

హెల్త్ టిప్స్

టమాటాల‌ను మీరు తిన‌కూడదా..? అయితే వంట‌ల్లో వీటిని వేయండి..!

July 5, 2025
హెల్త్ టిప్స్

ఆరోగ్యం విష‌యంలో రోజూ చాలా మంది చేసే త‌ప్పులు ఇవే..!

July 5, 2025
హెల్త్ టిప్స్

డ‌యాబెటిస్ ఉన్న‌వారు ఈ ఒక్క‌టి తింటే చాలు.. షుగ‌ర్ ఎంత ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే..!

July 5, 2025
ఆధ్యాత్మికం

మ‌న‌కి మంచి రోజులు వ‌చ్చాయ‌ని ఎలా తెలుస్తుంది..?

July 5, 2025
ఆధ్యాత్మికం

ఈ రాశుల‌కు చెందిన వారు ఎట్టి ప‌రిస్థితిలోనూ తాబేలు ఉంగ‌రాన్ని ధ‌రించ‌కూడ‌దు..!

July 5, 2025
ఆధ్యాత్మికం

శివుడికి మీరు వీటితో అభిషేకం చేస్తే.. ఏం కోరుకున్నా నెర‌వేరుతుంది..!

July 5, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.