Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

Dhaba Style Tomato Curry : ధాబా స్టైల్‌లో ట‌మాటా క‌ర్రీని ఇలా చేయండి.. ఎంతో బాగుంటుంది..!

D by D
August 29, 2023
in food, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

Dhaba Style Tomato Curry : మ‌న‌కు ధాబాల‌లో ల‌భించే వివిధ ర‌కాల రుచిక‌ర‌మైన వంట‌కాల్లో ట‌మాట క‌ర్రీ కూడా ఒక‌టి. ఈ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. రోటీ, చ‌పాతీ, పుల్కా, నాన్ వంటి వాటితో తింటే ఈ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. ట‌మాట క‌ర్రీని ఇష్ట‌ప‌డని వారు కూడా ఇలా చేసిన క‌ర్రీని ఇష్టంగా తింటారు. ఈ కర్రీని మ‌నం ఇంట్లో కూడా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. మొద‌టిసారి చేసే వారుకూడా ఈ కర్రీని సుల‌భంగా త‌యారు చేయ‌వ‌చ్చు. ఎంతో రుచిగా, క‌మ్మ‌గా ధాబా స్టైల్ లో ట‌మాట క‌ర్రీని ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ధాబా స్టైల్ ట‌మాట క‌ర్రీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

నూనె – 50 గ్రా., ఆవాలు – అర టీస్పూన్, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, ఎండుమిర్చి – 3, చిన్న‌గా త‌రిగిన ఉల్లిపాయ‌లు – 100 గ్రా., చిన్న‌గా త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, గ‌రం మ‌సాలా – అర టీ స్పూన్, కారం – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, జీల‌క‌ర్ర పొడి- ఒక టీ స్పూన్, ధ‌నియాల పొడి – ఒక టీ స్పూన్, ట‌మాట ఫ్యూరీ – 200 గ్రా., క‌రివేపాకు – రెండు రెమ్మ‌లు, పెద్ద ముక్క‌లుగా త‌రిగిన ట‌మాటాలు – పావుకిలో, నీళ్లు – 200 ఎమ్ ఎల్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

Dhaba Style Tomato Curry recipe in telugu make in this method
Dhaba Style Tomato Curry

ధాబా స్టైల్ ట‌మాట క‌ర్రీ త‌యారీ విధానం..

ముందుగా క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత ఆవాలు, జీల‌కర్ర‌, ఎండుమిర్చి వేసి వేయించాలి. త‌రువాత ఉల్లిపాయ‌లు, ప‌చ్చిమిర్చి వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్క‌లు వేగిన త‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత గ‌రం మ‌సాలా, కారం, ఉప్పు, జీల‌క‌ర్ర పొడి, ధ‌నియాల పొడి వేసి క‌ల‌పాలి. త‌రువాత ట‌మాట ఫ్యూరీ వేసి వేయించాలి. దీనిని నూనె పైకి తేలే వ‌ర‌కు ఉడికించిన త‌రువాత ట‌మాట ముక్క‌లు వేసి క‌ల‌పాలి.ఈ ముక్క‌ల‌ను ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించిన త‌రువాత నీళ్లు పోసి క‌ల‌పాలి.

త‌రువాత చిన్న మంట‌పై నూనె పైకి తేలే వ‌ర‌కు ఉడికించి కొత్తిమీర చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ట‌మాట క‌ర్రీ త‌యార‌వుతుంది. దీనిని అన్నం, చ‌పాతీ, రోటీ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది. త‌ర‌చూ ఒకే స్టైల్ లో కాకుండా ఇలా ధాబా స్లైల్ లో మ‌రింత రుచిగా త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. ఈ క‌ర్రీని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Tags: Dhaba Style Tomato Curry
D

D

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

Masala Egg Bonda : బ‌య‌ట బండ్ల‌పై ల‌భించే మ‌సాలా ఎగ్ బొండా.. ఇలా చేయాలి..!

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.