Dieffenbachia Plant : చూడగానే మనస్సుకు ఆహ్లాదాన్ని కలిగించేలా చక్కని రూపం, పచ్చదనంతో కూడిన మొక్కలను పెంచుకోవడం మనలో చాలా మందికి అలవాటే. చాలా మంది ప్రశాంతత, ఆహ్లాదకరమైన వాతావరణం కోసం మాత్రమే కాదు, అలంకరణ కోసం కూడా మొక్కలను పెంచుతుంటారు. దీంతో చెప్పలేనంత మానసిక ఆరోగ్యం కూడా కలుగుతుంది. అయితే మీకు తెలుసా..? మనం ఇండ్లలో పెంచుకునే అన్ని మొక్కలు అంత మంచివైతే కావు. వాటిలో కొన్ని మనకు అనారోగ్య సమస్యలను కూడా తెచ్చి పెడతాయి. అవునా, అని ఆశ్చర్యపోకండి. మేం చెబుతోంది నిజమే. అలాంటి హానికరమైన మొక్కల్లో కింద చెప్పబడిన మొక్క కూడా ఉంది. అదేమిటంటే..
కింద చిత్రంలో ఇచ్చిన మొక్కను గమనించారా..? దీన్ని మన ఇండ్లలో చాలా మంది పెంచుకుంటారు. ఈ మొక్క పేరు డిఫెన్‌బాకియా (Dieffenbachia). పెద్ద పెద్ద ఆకులను కలిగి ఉంటుంది. మధ్యలో తెల్లగా ఉంటుంది. ఈ మొక్క ఆకులు, కాండం, పువ్వులు అన్నీ మనకు అనారోగ్యకరమే. ప్రాణాలకు హాని కలిగించే విష పూరితమైన పదార్థాలు ఈ మొక్కలో ఉంటాయి. ఈ క్రమంలో ఈ మొక్కను ఎక్కడ ముట్టుకున్నా మన శరీరంలోకి విష పదార్థాలు ప్రవేశించి ప్రాణాపాయ స్థితుల్లోకి నెట్టివేస్తాయి. తీవ్రమైన కడుపునొప్పి, నోట్లో, గొంతులో మంట, దృష్టి లోపం, డయేరియా, కంటి నొప్పి, వాంతులు, శరీరమంతా ఉబ్బిపోవడం వంటి అస్వస్థతలు కలుగుతాయి.
ఆగ్జాలిక్ యాసిడ్, ఆస్పారజిన్ అనే రెండు హానికారక కెమికల్స్ ఈ మొక్కలో ఉన్నందువల్లే మనకు అలా జరుగుతుంది. అయితే ఈ మొక్క ఇంతటి విష పూరితమైందని ఎవరికీ తెలియదు. ఎస్తెబన్ అనే 5 సంవత్సరాల బాలుడు తమ ఇంట్లో ఉన్న Dieffenbachia మొక్కను ముట్టుకున్నాడు. చాలా సేపు దాని వద్దే గడిపాడు. దీంతో ఆ మొక్కలోని విషాలు అతని శరీరంలోకి ప్రవేశించాయి. ఈ క్రమంలో ఎస్తెబన్‌కు తీవ్రమైన కడుపునొప్పి వచ్చి వాంతులు కలిగాయి. ఇది గమనించిన అతని తల్లిదండ్రులు అతన్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.
అయితే అదృష్టవశాత్తూ ఆ బాలుడుకి ఏమీ కాలేదు. ప్రాణాపాయం తప్పింది. అయితే అతని తల్లిదండ్రులు మొదట ఏమనుకున్నారంటే బాగా స్వీట్లు తినడం వల్లే అతనికి అలా జరిగిందని భావించారు. కానీ అసలు విషయం తెలిశాక విస్మయానికి లోనయ్యారు. దీంతో వెంటనే సదరు మొక్కను తమ ఇంట్లో నుంచి తొలగించారు. కాబట్టి జాగ్రత్త. మన దగ్గర కూడా ఇలాంటి మొక్కలు చాలా మంది ఇండ్లలోనే ఉన్నాయి. వెంటనే వాటిని తీసేయండి. లేదంటే ప్రాణాలకే ప్రమాదం ఏర్పడుతుంది.