సాధారణంగా చాలా మందికి పెళ్లి జరిగి సంవత్సరాలు గడుస్తున్నా సంతానం ఉండదు. ఈ క్రమంలోనే సంతానం కోసం వైద్య పరీక్షలు చేయించుకున్నప్పటికీ కొందరికి సంతానం కలగదు. ఈ క్రమంలోనే సంతానం కోసం మహిళలు ఎన్నో పూజలు నోములు చేస్తుంటారు. ఈ విధంగా సంతానంలేని సమస్యతో బాధపడే మహిళలు ప్రతి మంగళవారం ఆంజనేయుడికి పూజ చేయడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుందని పండితులు చెబుతున్నారు.
ప్రతి మంగళవారం ఉదయం సూర్యోదయానికి కంటే ముందుగా నిద్రలేచి స్నానం చేసి ఎర్రని దుస్తులు ధరించాలి. అదేవిధంగా ఆంజనేయస్వామికి తమలపాకులతో అభిషేకం చేసి, సింధూరంతో పూజించాలి. ఈ విధంగా స్వామివారికి పూజ అనంతరం ఎర్రటి పుష్పాలను సమర్పించి ఉపవాస దీక్షలతో పూజ చేయటం వల్ల స్వామివారి అనుగ్రహం కలుగుతుంది.
స్వామివారికి పూజ చేసిన తర్వాత కేసరి నైవేద్యంగా సమర్పించే హనుమాన్ చాలీసా చదవాలి. ఈ విధంగా సంతానం లేని దంపతులు 9 లేదా 11 మంగళవారాలు ఆంజనేయ స్వామిని ఉపవాస దీక్షలతో పూజించడం వల్ల వారికి సంతానప్రాప్తి కలుగుతుందని, అదే విధంగా ఏ విధమైనటువంటి దోషాలు, సమస్యలు ఉన్నా కూడా తొందరగా పరిష్కారమవుతాయని పండితులు చెబుతున్నారు.