Lakshmi Devi : లక్ష్మీ దేవి అనుగ్రహం కొరకు ప్రతి ఒక్కరు ఆరాటపడతారు. ఆశిస్తారు. లక్ష్మీదేవి ఇంట్లో ఉన్నప్పుడే ఆ ఇంట్లో లేమి అనే కొరత ఉండదు. సుఖ సంతోషాలతో ఆ ఇల్లు కళకళలాడుతూ ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందడానికి రకరకాల ప్రయత్నాలు, పూజలు చేస్తూ ఉంటారు. శుక్రవారం అయితే చాలు ఇళ్లంతా చక్కగా, కళగా అలంకరిస్తారు. సాధారణంగా లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానిస్తూ గడపకు పసుపు రాసి పూలతో అలంకరిస్తారు. అలాగే దేవుని గదిలో పూలు, పండ్లతో చక్కగా పూజనిర్వహిస్తారు. మంత్రాలు, శ్లోకాలు చదువుతారు.
ఇలాంటి ఎన్నో నియమాలతో పాటు కొంతమంది శుక్రవారం రోజున డబ్బులను కూడా ఇతరులకు ఇవ్వరు. అలాగే శుక్రవారం లక్ష్మీదేవికి ప్రత్యేకం. కాబట్టి చాలా మంది చాలా రకాల నియమాలు పాటిస్తూ ఉంటారు. లక్ష్మీ దేవి ఎక్కువగా ఎక్కడ ఉంటుంది.. ఎక్కడ ఉండదు అనే విషయాలను సాక్ష్యాత్తు మహా విష్ణువే ఎలా వివరించారో ఇప్పుడు తెలుసుకుందాం. భగవంతున్ని పాలకులపై కోపం ప్రదర్శించే వారి ఇంట్లో లక్ష్మీ దేవి ఉండదు.
శంఖం శబ్దం వినిపించని ఇంట్లో కూడా లక్ష్మీ దేవి ఉండదు. ప్రతి ఇంట్లో తులసి ఉండాలనేది ఎప్పటి నుండో వస్తున్న ఆచారం. అయితే తులసిని పూజించని ఇంట్లో కూడా లక్ష్మీ దేవి ఉండదని సాక్ష్యాత్తు శ్రీ మహా విష్ణువే వివరించారు. అతిధులకు భోజనం పెట్టని ఇంట్లో కూడా లక్ష్మీ దేవి ఉండదు. ఇళ్లు కళకళలాడని చోట అంటే ఇంట్లో పూజలు, పునస్కారాలు చేయని చోట, ఎప్పుడూ లేమి అనే వారి బాధపడే వారి ఇంట్లో, శుక్రవారం నాడు బూజు దులిపే ఇంట్లో లక్ష్మీ దేవి ఉండదు.
అలాగే ఇంటికి దీపమైన ఇల్లాలు ఎప్పుడూ కంటతడి పెడుతూ ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీ దేవి ఉండదు. అదే విధంగా చెట్లను నరికే వారి ఇంట్లో కూడా లక్ష్మీ లోపిస్తుందట. సూర్యోదయ సమయంలో భోజనం చేసే వారి ఇంట్లో, తడి పాదాలతో నిద్ర పోయే వారి ఇంట్లో లక్ష్మీ దేవి నివసించదు. తులసి దేవిని పూజించే ఇంట్లో, శంఖు ధ్వనాలు వినిపించే ఇంట్లో లక్ష్మీ దేవి అష్టైశ్వర్యాలను కురుపిస్తుందని మహా విష్ణువు తెలియజేసారు.