Vastu Tips : నిత్య జీవితంలో మనం ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాం. కొన్ని రకాల సమస్యలు అప్పటికప్పుడు పరిష్కారం అవుతాయి. కానీ కొన్ని సమస్యలు మాత్రం మనల్ని జీవితాంతం వెంటాడుతుంటాయి. వాటిని పరిష్కరించుకునేందుకు మనం అనేక దారులు వెతుకుతుంటాం. కానీ ఏవీ లభించవు. అలాంటి సమస్యల్లో ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఒకటి. అయితే కొన్ని సార్లు ఈ సమస్యలకు వాస్తు దోషాలు కూడా కారణమవుతుంటాయి. మనం ఇంట్లో చేసే కొన్ని తప్పుల మూలంగా ఈ దోషాలు వస్తాయి. దీంతో అవి మనకు దీర్ఘకాలిక సమస్యలను కలగజేస్తుంటాయి.
ఇక వాస్తు దోషాల కారణంగా చాలా మందికి ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. ఎల్లప్పుడూ ఏదో ఒక వ్యాధితో ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి వారు ఒక్క విషయాన్ని మాత్రం గుర్తుంచుకోవాలి. ఇంట్లో కిచెన్‌లో ఎల్లప్పుడూ ఎలాంటి మెడిసిన్లను కూడా పెట్టరాదు. వాటిని ఉంచే బాక్స్‌లను కూడా పెట్టరాదు. అలా పెడితే అన్నీ ఆరోగ్య సమస్యలే వస్తుంటాయి. వాస్తు ప్రకారం వంట ఇంట్లో మెడిసిన్లను ఉంచరాదు. ఇది దోషాలను కలగజేస్తుంది. కనుక అలాంటివి ఇప్పటికే మీ కిచెన్‌లో ఉంటే వెంటనే తీసేయండి. లేదంటే వాస్తు దోషం అలాగే ఉంటుంది. ఫలితంగా మీకు అనారోగ్య సమస్యలు వస్తూనే ఉంటాయి.
ఇక ఇంట్లో ఉన్నవారికి ఉండే ఆరోగ్య సమస్యలు పోవాలంటే.. అందుకు గాను ముందుగా ఇంట్లోని నెగెటివ్ ఎనర్జీని బయటకు పంపాలి. దీనికి గాను ఇంటి గుమ్మానికి బయటి వైపు ఒక బూడిద గుమ్మడికాయను వేలాడ దీయాలి. దీంతో ఇంట్లోకి నెగెటివ్ ఎనర్జీ రాదు. అలాగే ఇంట్లో ఉన్నవారికి ఆర్థిక, ఆరోగ్య సమస్యలు పోతాయి. దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇక గుమ్మడికాయ కుళ్లిపోయే వరకు ఉంచకుండా కాస్త కుళ్లిపోగానే వెంటనే తీసేసి ఇంకో కాయను కట్టాలి. ఇలా చేస్తుంటే ఇంట్లోకి ఎప్పుడూ నెగెటివ్ ఎనర్జీ రాదు. వాస్తు దోషాలు ఏర్పడకుండా ఉంటాయి.