Money : పూర్వకాలం నుంచి మన పెద్దలు, పూర్వీకులు వాస్తు శాస్త్రానికి ఎంతో ప్రాధాన్యతను ఇచ్చారు. వాస్తు మన జీవితాలను నిర్దేశిస్తుంది. ఎవరైనా ఒక వ్యక్తి వాస్తు శాస్త్రం ప్రకారం నడుచుకుంటే అతనిపై ఎలాంటి దుష్టశక్తులు, నరదిష్టి పనిచేయవు. అలాగే అతనికి, అతని కుటుంబ సభ్యులకు ఎలాంటి దోషాలు ఉండవు. అలాంటి వారు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో తులతూగుతారు. అందుకని ప్రతి ఒక్కరు వాస్తు శాస్త్రాన్ని పాటించడం తప్పనిసరి.
ఇంటి నిర్మాణం విషయంలోనే కాదు, మనం రోజు వారీ చేసే కొన్ని ముఖ్యమైన పనుల విషయంలోనూ మనం వాస్తు ప్రకారం కొన్ని నియమాలను పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా డబ్బు విషయంలో ప్రతి ఒక్కరూ కొన్ని వాస్తు నియమాలను పాటించాలి. లేదంటే ఆర్థిక సమస్యలు వస్తాయి. అప్పుల చేత పీడించబడతారు. ఇక ఆ నియమాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎప్పుడు పడితే అప్పుడు డబ్బును ఖర్చు పెట్టవద్దు..
సాధారణంగా చాలా మంది డబ్బును ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలా ఖర్చు చేస్తుంటారు. అయితే ఇందుకు కూడా ఒక సమయం ఉంటుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. డబ్బును ఏ సమయంలో పడితే ఆ సమయంలో ఖర్చు చేయకూడదు. బ్రహ్మ ముహుర్తంలో డబ్బును ఖర్చు పెట్టకూడదు. బ్రహ్మ ముహుర్తం అంటే సూర్యోదయానికి గంటన్నర ముందు ఉండే ముహుర్తం. ఆ సమయంలో ఎవరూ కూడా డబ్బును ఖర్చు పెట్టకూడదు.
సూర్యోదయం సమయంలోనూ ఎవరూ డబ్బును ఖర్చు చేయరాదు. అలాగే సాయంత్రం సూర్యాస్తమయం అయ్యాక కూడా డబ్బును ఖర్చు పెట్టకూడదు. ఈ మూడు సమయాల్లో డబ్బును ఖర్చు చేయకూడదు. మిగిలిన సమయాల్లో డబ్బును ఖర్చు పెట్టవచ్చు. ఇలా డబ్బును ఖర్చు పెట్టే విషయంలో వాస్తు ప్రకారం ఈ నియమాలను పాటించినట్లయితే ఎవరూ కూడా ఎలాంటి ఆర్థిక సమస్యల బారిన పడకుండా ఉంటారు. చేతిలో ధనం నిలుస్తుంది. కొత్త ఆదాయ మార్గాలను అన్వేషిస్తారు. ధనం మిక్కిలిగా సంపాదిస్తారు. కనుక వాస్తును పాటించడం తప్పనిసరి.