Lord Shiva : శివుడిని ఆరాధించేటప్పుడు శివుడికి ఇష్టమైన ఉమ్మెత్త పూలతో చాలామంది పూజ చేస్తూ ఉంటారు. ఉమ్మెత్త పువ్వులను శివుడికి పెడితే ఎంతో మంచి జరుగుతుంది. భక్తులకి మోక్షం కలుగుతుంది. కేరళలోని శివాలయాల్లో ఉమ్మెత్త పువ్వులతో, అభిషేకం ప్రత్యేకంగా చేస్తూ ఉంటారు. మాంగల్యబలం లభించడానికి ఉమ్మెత్త పువ్వులతో శివుడిని ఆరాధిస్తే మంచిది. ఉమ్మెత్త పూలతో మాల కట్టి శివుడికి పూజ చేస్తే కోరికలు నెరవేరుతాయి.
వినాయకుడికి కూడా ఉమ్మెత్త పువ్వులు ఇష్టం. వినాయకుడికి కూడా పెట్టవచ్చు. దుర్గాదేవికి కూడా ఉమ్మెత్త పువ్వులని పెట్టవచ్చు. దరిద్రం పోతుంది. నవరాత్రి రోజుల్లో ఏడవ రోజు సరస్వతీ దేవికి ఉమ్మెత్త పువ్వులని పెట్టి అలంకరిస్తారు. ఉమ్మెత్త పువ్వులతో సరస్వతీ దేవిని పూజించడం వలన చక్కటి ఫలితాలు కనబడతాయి. ప్రదోషకాలంలో శివుడికి ఉమ్మెత్త పువ్వులను పెట్టడం వలన జాతక దోషాలు తొలగిపోతాయి. సర్ప దోషంతో బాధపడేవాళ్లు శివుడికి ఉమ్మెత్త పువ్వులని పెడితే ఆ దోషం నుండి బయటకు రావచ్చు.
అమావాస్యకి, పౌర్ణమికి ఒక్కరోజు ముందు ఈ ప్రదోషం వస్తుంది. ఈ సమయంలో శివుడిని దేవతలు స్తుతిస్తారని అంటారు. ఈ సమయంలో కనుక శివుడిని దర్శించుకుంటే శివుడి అనుగ్రహం కలుగుతుంది. ప్రదోషం రోజున సాయంత్రం నాలుగు నుండి 6 వరకు నందీశ్వరుడిని పూజిస్తే మంచిది. శివుడు అభిషేక ప్రియుడు. ఆ రోజు పాలాభిషేకం చేస్తే మంచి ఫలితం కనబడుతుంది.
కొబ్బరినీళ్లు, బిల్వపత్రాలు కూడా అభిషేకాన్ని చేయడానికి వాడవచ్చు. అలా చేయడం వలన ఈతి బాధలు పోతాయి. ఉమ్మెత్త పూలతో శివుడికి అర్చన చేస్తే సమస్త దోషాలు కూడా పోతాయి. ఏడు జన్మల పాపాలు కూడా పోతాయి. శివుడికి మామిడిపండ్ల రసంతో అభిషేకం చేస్తే ధన ధాన్యాలు కలుగుతాయి. జీవితంలో ధన ధాన్యాలకు లోటే ఉండదు. ఆర్థిక బాధలు, ఈతి బాధలు కూడా పోతాయి. ఈసారి వీటిని గుర్తు పెట్టుకుని శివుడిని ఈ విధంగా ఆరాధిస్తే కచ్చితంగా అంతా మంచే జరుగుతుంది.