Snakes : పామును చంపే సమయంలో దాని మీద దెబ్బ పడ్డ తర్వాత అది తప్పించుకుపోతే అది మిమ్మల్ని పగబడుతుందా..? మీరు కొట్టే సమయంలో ఆ పాము తన మెమొరీలో మీ ఫోటోను సేవ్ చేసుకొని.. తర్వాత ప్రతీకారం తీర్చుకుంటుందా..? అంటే.. అవుననే అంటారు మన పెద్దలు. పాము పగ అని ఓ జాతీయాన్నే వాడుతుంటారు. అయితే సైన్స్ ప్రకారం పాము పగబడుతుందా..? ఎన్ని రోజులైనా పాము తన ప్రతీకారాన్ని తీర్చుకుంటుందా..? అనే విషయాన్ని కాస్త కాన్సంట్రేషన్ ను పెట్టి పరిశీలిస్తే.. ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి.
నిజమేంటంటే.. పాముకు అసలు మెమొరీనే ఉండదట.. అలాంటప్పుడు పాము మనల్ని గుర్తు పెట్టుకునే ఛాన్స్, పగబట్టే ఛాన్స్ అసలు ఉండనే ఉండదట. ఇదంతా మనవాళ్లు కల్పించిన ఓ నమ్మకం మాత్రమేనట. అయితే దీని వెనుక కూడా ఓ కారణం ఉందనే అంటారు చాలామంది.
అప్పట్లో రైతుల ప్రధాన వృత్తి వ్యవసాయం. పండించిన పంటలకు ఎలుకల నుండి తీవ్ర నష్టం వాటిల్లేదట. కాబట్టి కనబడిన పామును కనబడినట్టు చంపడం ద్వారా ఎలుకలను తినే పాముల సంఖ్య తగ్గడంతో ఎలుకలు విపరీతంగా పెరగడం.. పంటలకు ఇంకా ఎక్కువ నష్టం వాటిల్లడం లాంటివి అవుతాయని.. ముందస్తుగా పాములను చంపొద్దు, ఒక వేళ మిస్ అయితే అవి పగబడతాయి అనే భయాన్ని క్రియేట్ చేశారట. పురాతాన జనాలు పామును దేవతగా కొలవడం, ప్రకృతి ప్రేమికులు కావడం కూడా దీని వెనుకున్న అసలు కారణాలట.