Appu : ఎవరైనా సరే ఆపదలో ఉన్నామని.. దీనంగా ముఖం పెట్టి డబ్బు అప్పుగా కావాలని.. త్వరగానే తీర్చేస్తానని చెబితే.. కొందరు ఇట్టే సులభంగా బుట్టలో పడిపోతారు. అయితే అప్పటి వరకు బాగానే ఉంటుంది. కానీ అప్పు తీసుకున్న వారు మళ్లీ ఇస్తారో లేదోనన్న బెంగ కూడా వెంటాడుతుంది. అయితే వారు అప్పు మళ్లీ తీర్చేస్తే సరి. లేదంటే అప్పు ఇచ్చిన వాళ్లకు ఇబ్బందులు తప్పవు. దీని వల్ల తీవ్రమైన మానసిక వేదన అనుభవించాల్సి ఉంటుంది. అయితే ఇచ్చిన అప్పులు వెంటనే తిరిగి రావాలంటే.. అందుకు గాను కొన్ని పరిహారాలు చేయాలి. అవేమిటంటే..
శ్రీచక్రానికి ఖడ్గమాల చదువులూ బిల్వ దళాలతో పూజ చేయాలి. లేదా లలితా సహస్రనామ పారాయణ చేయాలి. లేదంటే.. పంచాయుధ స్తోత్రం రోజూ 27 సార్లు 41 రోజుల పాటు పారాయణం చేసినా ఫలితం ఉంటుంది.
ఇచ్చిన అప్పు తిరిగి త్వరగా వసూలు కావాలంటే.. దీపంలో రెండు గురివింద గింజలు వేసి కొబ్బరినూనెతో దీపం పెట్టి లక్ష్మీ స్తోత్రం పారాయణ చేస్తూ వాడని పువ్వులు అంటే.. వెండి పువ్వులతో ఒక్కో శ్లోకానికి ఒక్కో పువ్వుని సమర్పిస్తూ పూజ చేసి చివరిగా కనకధార స్తోత్రం ఖడ్గమాల పారాయణ చేసినా ఫలితం ఉంటుంది.
ప్రతి మంగళవారం ఇంటి దేవుడికి పులిహోర నివేదన చేసి అది పంచి పెట్టాలి. దీంతో నష్టపోయిన మరియు అప్పుగా ఇచ్చిన డబ్బు అన్నీ వెనక్కి వస్తాయి. అలాగే కేసులు, శత్రువుల బాధ నుంచి విముక్తి లభిస్తుంది. ఇక శత్రువుల భయం పోవాలంటే భైరవుడి స్తోత్రం, ప్రత్యంగిర స్తోత్రాలను రాత్రి 8 గంటల తరువాత పారాయణ చేయాలి. అలాగే ఈ పారాయణాలను 41 రోజుల పాటు చేస్తే.. ఎలాంటి మొండి అప్పు అయినా సరే వెంటనే వెనక్కి వస్తుంది. శత్రువుల బెడద కూడా ఉండదు.