మీ ఇంటి వాస్తు స‌రిగ్గానే ఉందా..? ఏవి ఎక్క‌డ ఉండాలో తెలుసా ? ఒక్క‌సారి స‌రిచూసుకోండి..!

మ‌నం ఒక ఇంటిని నిర్మించేట‌ప్పుడు అనేక విష‌యాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటాము. అందులో ముఖ్య‌మైన‌ది ఇంటి వాస్తు. ఇంటి వాస్తు స‌రిగ్గా ఉంటేనే మ‌నం ఆర్థికంగా, ఆరోగ్య‌ప‌రంగా, సంతాన‌ప‌రంగా, పాడిపంట‌లప‌రంగా సుభిక్షంగా ఉంటాము. ఇంటిని వాస్తు ప‌రంగా నిర్మించుకున్న‌ట్ట‌యితే ఆ ఇల్లు సుఖ సంతోషాల‌తో విర‌జిల్లుతూ, చూడ‌ముచ్చ‌ట‌గా ఉంటుంది. ఇంట్లోకి ప్ర‌వేశించ‌గానే ఇల్లు చూడ‌చ‌క్క‌గా ఉండాలి. అలాగే నైరుతి దిక్కులో ప‌డ‌క గ‌ది ఉండాలి. ఇంట్లో వంట‌గ‌ది ఆగ్నేయంలో ఉండాలి. అదే విధంగా వాయువ్యంలో పాడి పంట‌ల‌కు పంబంధించిన పాక‌ల‌ను నిర్మించుకోవాలి.

అలాగే ఈశాన్యం మూల‌న బావి, బోర్ లేదా సంపులు ఉండేలా చూసుకోవాలి. అలాగే ఇంటిని నిర్మించేట‌ప్పుడు గుమ్మాల‌కు ఎదురుగా ఎటువంటి చెట్లు ఉండ‌కుండా చూసుకోవాలి. అదే విధంగా ఒక మూల‌ను మ‌రో మూల‌తో క‌ల‌ప‌కూడ‌దు. ఒక వేళ నైరుతి మూల పెరిగితే య‌జ‌మానికి అరిష్టం. ఆగ్నేయం మూల పెరిగితే ఇంటి య‌జ‌మానురాలికి అనారోగ్యం వాటిల్లుతుంది. అలాగే వాయువ్యం మూల పెరిగితే ఆ ప్ర‌భావం ఆ ఇంట్లో సంతానం మీద, సంప‌ద మీద ప‌డుతుంది.

do you have correct vastu for home

ఈశాన్యం మూల పెరిగితే ఇంట్లోని వారికి అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తే అవ‌కాశం ఉంటుంది. ఇంటి వాస్తు స‌రిగ్గా లేక‌పోవ‌డం వ‌ల్ల స‌మ‌స్య‌లు ఉత్ప‌న్నమ‌య్యే అవ‌కాశం ఉంటుంది. క‌నుక ఇంటిని నిర్మించుకునేట‌ప్పుడే చ‌క్క‌ని వాస్తుతో నిర్మించుకోవాలి. ఇంటిని నిర్మించేట‌ప్పుడు ఏ దిక్కున, ఏ దిశలో ఏది ఉండాలో చూసుకుని మ‌రీ చ‌క్క‌ని నిర్మాణ శైలితో నిర్మించుకోవాలి. అలాగే ఇంట్లో గుమ్మాల‌కు ఒకే క‌ర్ర‌ను ఉప‌యోగించాలి. ఇంటి సింహ‌ద్వారాన్ని చ‌క్క‌ని క‌ర్ర‌ను ఉప‌యోగించి నిర్మించుకోవాలి.

ఇంటి నిర్మాణంలో ప‌దాలు, ఆయువు అనేవి ఉంటాయ‌ని.. వాటిని క‌నుక త‌ప్పితే మ‌నం చ‌క్క‌ని ఫ‌లితాల‌ను పొంద‌లేమ‌ని నిపుణులు చెబుతున్నారు. ఇంటి వాస్తు స‌రిగ్గా లేక‌పోయినాన కూడా మ‌నం ఆర్థిక‌, ఆరోగ్య‌, మాన‌సిక ప‌ర‌మైన స‌మ‌స్య‌ల బారిన ప‌డే అవ‌కాశాలు కూడా చాలా ఉంటాయి. క‌నుక ఇంటిని వాస్తుకు అనుగుణంగా నిర్మించుకోవాలి. అప్పుడే కుటుంబం వృద్ధిలో ఉంటుందని, మ‌న సంతానం కూడా ప్ర‌యోజ‌కులు అవుతార‌ని, మ‌నం కూడా ఇత‌రుల‌కు మార్గ‌ద‌ర్శ‌కంగా ఉంటామ‌ని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

D

Recent Posts