నలభై ఏళ్ల వయస్సులోనే ఆఫీసుకి వెళ్లడానికి చాలా మంది జంకుతుంటారు. కాని రామ్ చరణ్ సతీమణి ఉపాసన తాత అపోలో హాస్పిటల్స్ వ్యవస్థాపకుడు డాక్టర్ సి. ప్రతాప రెడ్డి 91 ఏళ్ల వయస్సులోను నిత్యం ఆఫీసుకి వెళుతూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నాడు. ఉదయం 10 గంటలకు తన పని దినాన్ని ప్రారంభించి సాయంత్రం 5 గంటలకు ముగిస్తాడు. పని పట్ల అతని నిబద్ధత ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తుంటుంది.ఈ అంకిత భావం వల్లనే అతను ఈ స్థాయిలో ఉన్నారు.తన జీవితంలో అన్ని సాధించిన ఆయన ఇప్పటికీ వైద్య వృత్తిని చురుగ్గానే సాగిస్తున్నారు. చిత్తూరు జిల్లా, తవణంపల్లె మండలం, ఆరగొండలో పుట్టాడు.
మొట్టమొదటి కార్పొరేట్ ఆసుపత్రుల శ్రేణి అయిన అపోలో హాస్పిటల్స్ ను స్థాపించాడు. ఆ తరువాత అపోలో ఫార్మసీ సంస్థను స్థాపించాడు. ఫోర్బ్స్ సంస్థ విడుదల చేసిన భారతదేశ 100 మంది సంపన్నుల జాబితాలో 86వ స్థానం పొందిన వ్యక్తి ప్రతాప్ సి. రెడ్డి ప్రతాప రెడ్డికి నలుగురు కుమార్తెలు. ఈ నలుగురూ అపోలో హస్పిటల్స్ లో డైరెక్టర్లుగా ఉన్నారు. 1991లో కేంద్ర ప్రభుత్వం పద్మ భూషణ్, 2010లో పద్మ విభూషణ్ ఇచ్చి గౌరవించింది. 1983లో చెన్నైలో అపోలో ఆసుపత్రి ప్రారంభం కాగా, అప్పటి నుండి చెన్నైలోని తన కార్యాలయానికి వెళుతూ వస్తుంటారు. వారంలో ఒక్కరోజు మాత్రమే సెలవు తీసుకుంటారు.
ప్రస్తుతం అపోలో ఆసుపత్రుల సంస్థ రూ.70000 కోట్ల మార్కెట్ క్యాప్‌తో లిస్టెడ్ కంపెనీలో 29.3 శాతం వాటా కలిగి ఉంది. అపోలో సంస్థ కింద 21 కంపెనీలు ఉన్నాయి. ఇందులో 5వేల ఫార్మసీ స్టోర్‌లు, 291 ప్రైమరీ కేర్ క్లిన్‌లు, డిజిటల్ హెల్త్ పోర్టల్, డయాగ్నోస్టిక్స్ చైన్, 71 ఆసుపత్రులతో కూడిన ఫ్లాగ్ షిప్ చైన్ కాకుండా ప్రసూతి సేవలు కూడా ఉన్నాయి. ఫోర్బ్స్ సంస్థ విడుదల చేసిన భారతదేశ వంద మంది సంపన్నులు జాబితాలో 86వ స్థానం పొందారు. 2017లో ఇండియా టుడే వెలువరించిన భారతదేశపు 50 శక్తిమంతులైన వ్యక్తులలో ప్రతాప్ చంద్రా రెడ్డి 48వ స్థానం దక్కింది. 1979లో, ఒక విషాద సంఘటన డాక్టర్ రెడ్డిని తీవ్రంగా ప్రభావితం చేసింది. భారతదేశంలోని ఒక రోగి, అత్యవసరంగా గుండె శస్త్రచికిత్స చేయవలసి ఉండగా, చికిత్స కోసం విదేశాలకు వెళ్లలేక ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన భారతదేశంలో అధునాతన వైద్య సౌకర్యాల కొరతను ఎత్తిచూపింది . ఆ సమయంలోనే అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ మద్దతుతో, అతను చెన్నైలో అపోలో హాస్పిటల్స్‌ను స్థాపించాడు.