Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home food

Dondakaya Karam : దొండ‌కాయ కారాన్ని ఒక్క‌సారి ఇలా చేయండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారు..!

D by D
September 3, 2023
in food, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Dondakaya Karam : మ‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల్లో దొండ‌కాయ‌లు కూడా ఒక‌టి. దొండ‌కాయ‌లు అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను క‌లిగి ఉంటాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు. అలాగే దొండ‌కాయ‌ల‌తో చేసే వంట‌కాలు కూడా చాలా రుచిగా ఉంటాయి. దొండ‌కాయ‌ల‌తో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాలను త‌యారు చేస్తూ ఉంటాము. త‌ర‌చూ చేసే వంట‌కాల‌తో పాటు దొండ‌కాయ‌ల‌తో కింద చెప్పిన విధంగా చేసే దొండ‌కాయ కారం కూడా చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఉండే ఈ దొండ‌కాయ కారాన్ని ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

దొండ‌కాయ కారం త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

దొండ‌కాయ‌లు – పావుకిలో, శ‌న‌గ‌పప్పు – 2 టేబుల్ స్పూన్స్, మిన‌ప‌ప్పు – ఒక టేబుల్ స్పూన్, ధ‌నియాలు – అర టీ స్పూన్, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, నువ్వులు – 2 టీ స్పూన్స్, నూనె – 2 టేబుల్ స్పూన్స్, ఎండుమిర్చి – 6 లేదా త‌గిన‌న్ని, ప‌సుపు – పావు టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, వెల్లుల్లి రెబ్బ‌లు – 10.

Dondakaya Karam recipe in telugu make in this method
Dondakaya Karam

దొండ‌కాయ కారం త‌యారీ విధానం..

ముందుగా ఒక దొండ‌కాయ‌ల‌ను నిలువుగా 4 ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి. త‌రువాత క‌ళాయిలో మిన‌ప‌ప్పు.శ‌న‌గ‌ప‌ప్పు, ధ‌నియాలు, జీల‌క‌ర్ర‌, నువ్వులు వేసి దోర‌గా వేయించాలి. త‌రువాత వీటిని జార్ లోకి తీసుకోవాలి. ఇందులోనే ఉప్పు, ప‌సుపు,, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బ‌లువేసి బ‌ర‌క‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక దొండ‌కాయ ముక్క‌ల‌ను వేసి వేయించాలి. వీటిపై మూత పెట్టి మ‌ధ్య మ‌ధ్య‌లో క‌లుపుతూ దొండ‌కాయ ముక్క‌లు మెత్త‌గా అయ్యే వ‌ర‌కు మ‌గ్గించాలి. దొండ‌కాయ ముక్క‌లు చ‌క్క‌గా మ‌గ్గిన త‌రువాత మిక్సీ ప‌ట్టుకున్న కారం వేసి క‌ల‌పాలి. దీనిని మ‌రో 3 నిమిషాల పాటు వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే దొండ‌కాయ కారం త‌యార‌వుతుంది. దీనిని అన్నంతో క‌లిపి తింటే క‌డుపు నిండుగా భోజ‌నం చేస్తార‌ని చెప్ప‌వ‌చ్చు. దొండ‌కాయ‌ల‌ను ఇష్ట‌పడని వారు కూడా ఈ కారాన్ని ఇష్టంగా తింటారు.

Tags: Dondakaya Karam
Previous Post

Eggless Sponge Cake : ఓవెన్ లేకున్నా, కోడిగుడ్లు, చ‌క్కెర క‌ల‌ప‌కుండా.. కేక్‌ను ఇలా సుల‌భంగా చేయ‌వ‌చ్చు..!

Next Post

Dates Milk Drink : రోజూ ఒక్క గ్లాస్ చాలు.. కంటి చూపు పెరుగుతుంది.. బ‌లంగా, పుష్టిగా త‌యార‌వుతారు..!

Related Posts

వైద్య విజ్ఞానం

షుగ‌ర్ వ్యాధి కంట్రోల్‌లో ఉండ‌క‌పోతే కిడ్నీలు చెడిపోతాయా..?

July 4, 2025
ఆధ్యాత్మికం

మీకు శ‌నిదోషం ఉందా..? అయితే ఈ ప‌రిహారాల‌ను పాటిస్తే మంచిది..!

July 3, 2025
ఆధ్యాత్మికం

ఏ వేలితో బొట్టు పెట్టుకుంటే ఎలాంటి ఫ‌లితాలు క‌లుగుతాయంటే..?

July 3, 2025
ఆధ్యాత్మికం

శుక్ర‌వారం నాడు ఇలా చేస్తే మీ ఇంట్లో ల‌క్ష్మీ క‌టాక్ష‌మే..!

July 3, 2025
lifestyle

స్త్రీల‌లో పురుషులు ఇష్టప‌డే 15 అంశాలు ఇవే తెలుసా..?

July 3, 2025
హెల్త్ టిప్స్

ఈ 5 ర‌కాల తెల్ల‌ని విష ప‌దార్థాల‌ను మ‌నం రోజూ తింటున్నామ‌ని తెలుసా..?

July 3, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.