Dondakaya Ullikaram : దొండ‌కాయ ఉల్లికారం ఇలా చేసి తినండి.. రుచి అద‌ర‌హో అంటారు..

Dondakaya Ullikaram : మ‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల్లో దొండ‌కాయ‌లు కూడా ఒక‌టి. ఇత‌ర కూర‌గాయ‌ల వ‌లే దొండ‌కాయ‌లు కూడా మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే దొండ‌కాయ‌ల‌ను తిన‌డానికి చాలా మంది ఇష్ట‌ప‌డ‌రు. దొండ‌కాయ‌ల్లో కూడా మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాలు ఉంటాయ‌ని వీటిని కూడా త‌ప్ప‌కుండా ఆహారంగా తీసుకోవాల‌ని నిపుణులు సూచిస్తున్నారు. దొండ‌కాయ‌ల‌ను తిన‌డానికి ఇష్ట‌ప‌డ‌ని వారు కూడా కింద చెప్పిన విధంగా చేసిన దొండ‌కాయ ఉల్లికారాన్ని ఎంతో ఇష్టంగా తింటారు. చ‌క్క‌గా, సులువుగా చేసుకోగ‌లిగే ఈ దొండ‌కాయ ఉల్లికారాన్ని ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

దొండ‌కాయ ఉల్లికారం త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

దొండ‌కాయ‌లు – పావు కిలో, పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ‌లు – 3( మ‌ధ్య‌స్థంగా ఉన్న‌వి), వెల్లుల్లి రెబ్బలు – 4, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, ఎండుమిర్చి – 2, కారం – 3 టేబుల్ స్పూన్స్, ఉప్పు – త‌గినంత‌, క‌రివేపాకు – ఒక రెమ్మ‌.

Dondakaya Ullikaram recipe in telugu very easy to make and tasty
Dondakaya Ullikaram

దొండ‌కాయ ఉల్లికారం త‌యారీ విధానం..

ముందుగా దొండ‌కాయ‌ల‌ను శుభ్ర‌ప‌రిచి గుత్తి వంకాయ‌ల మాదిరిగా నాలుగు ముక్క‌లుగా చేసుకోవాలి. త‌రువాత జార్ లో ఉల్లిపాయ ముక్క‌లు, ఒక టేబుల్ స్పూన్ కారం, వెల్లుల్లి రెబ్బ‌లు, ఉప్పు వేసి బ‌ర‌క‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక దొండ‌కాయ ముక్క‌లు వేసి వేయించాలి. ఈ దొండ‌కాయ‌ల‌ను మెత్త‌గా అయ్యే వ‌ర‌కు బాగా వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. త‌రువాత అదే నూనెలో తాళింపు దినుసులు, ఎండుమిర్చి, క‌రివేపాకు వేసి వేయించాలి. తాళింపు వేగిన త‌రువాత ముందుగా మిక్సీ ప‌ట్టుకున్న ఉల్లికారం వేసి వేయించాలి. దీనిని 10 నిమిషాల పాటు మ‌ధ్య‌స్థ మంట‌పై వేయించాలి. త‌రువాత ముందుగా వేయించిన దొండ‌కాయ ముక్క‌లను వేసి క‌ల‌పాలి.

దీనిపై మూత పెట్టి 5 నిమిషాల పాటు మ‌గ్గించాలి. 5 నిమిషాల త‌రువాత మూత తీసి మ‌రోసారి క‌లుపుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే దొండ‌కాయ ఉల్లికారం త‌యార‌వుతుంది. దీనిని అన్నంతో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. దొండ‌కాయ‌ల‌ను ఇష్ట‌ప‌డ‌ని వారు కూడా ఈ దొండ‌కాయ ఉల్లికారాన్ని ఎంతో ఇష్టంగా తింటారు. దొండ‌కాయ‌ల‌తో త‌ర‌చూ చేసే వంట‌కాల‌తో పాటు అప్పుడ‌ప్పుడూ ఇలా ఉల్లికారాన్ని కూడా త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. ఈ దొండ‌కాయ ఉల్లికారాన్ని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Share
D

Recent Posts