Egg Biryani In Pressure Cooker : కోడిగుడ్లతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో ఎగ్ బిర్యానీ కూడా ఒకటి. ఎగ్ బిర్యానీ చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. ఎక్కువగా రెస్టారెంట్ లలో లభిస్తుంది. అయితే రెస్టారెంట్ లకు వెళ్లే పని లేకుండా ఇంట్లోనే మనం ఎగ్ బిర్యానీని తయారు చేసి తీసుకోవచ్చు. అయితే ఈ బిర్యానీని తయారు చేసుకోవడం చాలా మంది శ్రమతో, సమయంతో కూడిన పని అని భావిస్తూ ఉంటారు. కానీ చాలా సులభంగా, చాలా తక్కువ సమయంలో కుక్కర్ లో కూడా ఈ బిర్యానీని తయారు చేసుకోవచ్చు. వీకెండ్స్ లో, స్పెషల్ డేస్ లో ఇలా రుచిగా ఎగ్ బిర్యానీని తయారు చేసి తీసుకోవచ్చు. కుక్కర్ లో రుచిగా, సులభంగా ఎగ్ బిర్యానీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కుక్కర్ లో ఎగ్ బిర్యానీ తయారీకి కావల్సిన పదార్థాలు..
ఉడికించిన కోడిగుడ్లు – 5, నానబెట్టిన బాస్మతీబియ్యం – ఒక గ్లాస్, ఫ్రైడ్ ఆనియన్స్ – ఒక కప్పు, నూనె – 3 టేబుల్ స్పూన్స్, బిర్యానీ ఆకు – 1, అనాస పువ్వు – 1, మరాఠీ మొగ్గ – 1, దాల్చిన చెక్క – ఒక అంగుళం ముక్క, జాపత్రి – కొద్దిగా, లవంగాలు – 4, యాలకులు – 2, సాజీరా – అర టీ స్పూన్, తరిగిన పచ్చిమిర్చి – 4, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, తరిగిన టమాట – 1, పుదీనా ఆకులు – కొన్ని, తరిగిన కొత్తిమీర – గుప్పెడు, పెరుగు – 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు – తగినంత, పసుపు – పావు టీ స్పూన్, కారం – ఒకటిన్నర టీ స్పూన్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, గరం మసాలా -అర టీ స్పూన్, బిర్యానీ మసాలా – ఒక టీ స్పూన్, నీళ్లు – ఒకటింపావు గ్లాస్, నెయ్యి – 2 టీ స్పూన్స్, యాలకుల పొడి – చిటికెడు.
కుక్కర్ లో ఎగ్ బిర్యానీ తయారీ విధానం..
ముందుగా కోడిగుడ్లను ఒక గిన్నెలోకి తీసుకుని అందులో పావు టీ స్పూన్ ఉప్పు, పసుపు, కారం వేసి కలిపి పక్కకు ఉంచాలి. తరువాత కుక్కర్ లో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక కోడిగుడ్లను వేసి ఎర్రగా అయ్యే వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే నూనెలో మసాలా దినుసులు వేసి వేయించాలి. తరువాత పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. తరువాత టమాట ముక్కలు వేసి మెత్తగా అయ్యే వరకు వేయించాలి.
తరువాత పుదీనా ఆకులు, కొత్తిమీర వేసి కలపాలి. తరువాత పెరుగు వేసి కలపాలి. దీనిని బాగా వేయించిన తరువాత ఫ్రైడ్ ఆనియన్స్ వేసి కలపాలి. తరువాత ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, బిర్యానీ మసాలా వేసి కలపాలి. వీటిని వేయించిన తరువాత నీళ్లు పోసి కలపాలి. తరువాత బియ్యం వేసి కలపాలి. ఇప్పుడు పైన వేయించిన గుడ్లు వేసి మూత పెట్టి మధ్యస్థ మంటపై 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీనిని ఆవిరి పోయే వరకు ఉంచి ఆ తరువాత సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఎగ్ బిర్యానీ తయారవుతుంది. దీనిని రైతాతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా తయారు చేసిన ఎగ్ బిర్యానీని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.