Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

Eggs Freshness Test : కోడి.. గుడ్డు పెట్టి ఎన్ని రోజుల‌వుతుంది.. గుడ్లు తాజాగా ఉన్నాయా లేదా.. ఈ చిట్కాల‌తో సుల‌భంగా తెలుసుకోవ‌చ్చు..!

Editor by Editor
November 5, 2022
in information, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

Eggs Freshness Test : కోడిగుడ్లు అంటే స‌హ‌జంగానే చాలా మందికి ఇష్టంగా ఉంటుంది. కోడిగుడ్ల‌ను అంద‌రూ తింటారు. నాన్‌వెజ్ తిన‌ని వారు కొంద‌రు గుడ్ల‌ను తినేందుకు ప్రాధాన్య‌త‌ను ఇస్తారు. చాలా మంది కోడిగుడ్ల‌ను ఆమ్లెట్ లేదా ఉడ‌కబెట్టి తింటారు. కొంద‌రు కూర‌ల రూపంలో చేసి తింటారు. అయితే కోడిగుడ్డు సంపూర్ణ పౌష్టికాహార‌మ‌ని పోష‌కాహార నిపుణులు చెబుతున్నారు. అందువ‌ల్ల కోడిగుడ్డును రోజుకు ఒక‌టి తినాల‌ని.. దీంతో అన్ని పోషకాల‌ను మ‌నం పొంద‌వ‌చ్చ‌ని చెబుతున్నారు. కోడిగుడ్ల‌ను ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్‌లో తింటే మ‌నం అధికంగా ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చ‌ని సూచిస్తున్నారు.

అయితే కోడిగుడ్ల‌ను స‌హ‌జంగానే మ‌నం షాపుల్లో కొని తెస్తుంటాం. సూప‌ర్ మార్కెట్‌ల‌లో ప్యాక్ చేయ‌బ‌డిన గుడ్లు అయితే వాటిపై ఎక్స్‌పైరీ తేదీ ఉంటుంది. క‌నుక ఆ తేదీలోగా మనం వాటిని సుల‌భంగా వాడుకోవ‌చ్చు. కానీ వేరే దుకాణాల్లో.. ఇత‌ర చోట్ల గుడ్ల‌ను కొంటే అవి తాజాగా ఉన్నాయా.. కుళ్లిపోయాయా.. అన్న విష‌యం తెలియ‌దు. కానీ కింద తెలిపిన చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల కోడిగుడ్లు తాజాగా ఉన్నాయో లేదో ఇట్టే తెలిసిపోతుంది. కోడి.. గుడ్ల‌ను ఎప్పుడు పెట్టిందో కూడా క‌నుక్కోవ‌చ్చు. అందుకు ఏమేం చిట్కాల‌ను పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026
Eggs Freshness Test how to know they are in good condition
Eggs Freshness Test

కోడిగుడ్లు తాజాగా ఉన్నాయో లేదో తెలుసుకోవాలంటే.. ఏదైనా గుడ్డును తీసుకుని దీన్ని వాస‌న చూడాలి. కోడిగుడ్లు పాడైపోతే ప‌చ్చివి కూడా వాస‌న వ‌స్తాయి. అలా వ‌స్తే వాటిని పాడైన‌విగా గుర్తించాలి. వాటిని ప‌డేయాలి. ఇక కోడిగుడ్డు పెంకును బాగా ప‌రిశీలించాలి. దానిపై ప‌గుళ్లు వచ్చినా లేదా ఏదైనా పౌడ‌ర్ ఉన్న‌ట్లు అనిపించినా గుడ్డు బాగా లేద‌ని నిర్దారించుకోవాలి. అలాంటి గుడ్ల‌ను ప‌డేయాలి. అలాగే కోడిగుడ్ల‌ను నీళ్ల‌లో వేసి కూడా వాటిని తాజ‌దనాన్ని ప‌రిశీలించ‌వ‌చ్చు. కింద ఇచ్చిన చిత్రాన్ని ఒక‌సారి గ‌మ‌నించండి.

ఒక పాత్ర‌లో మంచి నీటిని తీసుకుని అందులో గుడ్డును వేయాలి. అది మునిగిపోకుండా తేలితే ఆ గుడ్డు బాగా పాత‌ది అని గుర్తించాలి. చాలా రోజుల కిందట‌ కోడి ఆ గుడ్డును పెట్టింద‌ని అర్థం చేసుకోవాలి. ఇలాంటి గుడ్ల‌ను వాడ‌రాదు. వాడితే ఆరోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి. అయితే గుడ్డు పూర్తిగా మునిగి అడుగు భాగానికి చేరి అడ్డంగా ఉంటే.. అది తాజాగా ఉన్న‌ట్లు అర్థం. అలాంటి గుడ్డును వాడుకోవ‌చ్చు.

ఇక గుడ్డు పూర్తిగా మునిగి అడుగు భాగానికి చేరినా కూడా కాస్త పైకి ఉన్న‌ట్లు అనిపిస్తే ఆ గుడ్డును సుమారుగా వారం కిందట‌ కోడి పెట్టి ఉంటుంద‌ని నిర్దారించుకోవాలి. అలాగే గుడ్డు మునిగి అడుగు భాగంలో ఉన్న‌ప్ప‌టికీ అది నిలువుగా పై వైపున‌కు ఉంటే ఆ గుడ్డును కోడి.. 2-3 వారాల కింద పెట్టి ఉంటుంద‌ని అర్థం చేసుకోవాలి. ఇలా కోడిగుడ్ల తాజాద‌నాన్ని ప‌రిశీలించ‌వ‌చ్చు. అయితే ఈ చిట్కాల వ‌ల్ల కూడా కొన్ని సార్లు కోడిగుడ్లు తాజాగా ఉన్నాయా.. లేదా.. అన్న విష‌యం తెలియ‌దు. కానీ కోడిగుడ్డును ప‌గ‌ల‌గొట్టి చూస్తే అర్థ‌మ‌వుతుంది. దుర్వాస‌న వ‌చ్చినా.. ప‌సుపు ప‌చ్చ సొన మొత్తం క‌ల‌సి పోయిన‌ట్లు ఉన్నా.. గ‌డ్డ క‌ట్టినా.. అలాంటి గుడ్లు పాడ‌య్యాయ‌ని తెలుసుకోవాలి. ఇలా కోడిగుడ్ల‌ను ప‌రిశీలించి అవి పాడ‌య్యాయా.. లేదా.. అన్న విష‌యాన్ని సుల‌భంగా తెలుసుకోవ‌చ్చు.

Tags: eggsEggs Freshness Test
Editor

Editor

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

Jalebi : షాపుల్లో అమ్మే లాంటి రుచితో.. ఇంట్లోనే జిలేబీని ఇలా సుల‌భంగా చేయ‌వ‌చ్చు..!

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.