కైపత్తూర్, పతనంతిట్ట ఏఎమ్ఆర్ హాస్పిటల్ లో ఒక ఫేక్ డాక్టర్ క్లినిక్ ను నడుపుతున్నారు. అదుర్ రోడ్ లో ఉన్న ఈ క్లినిక్ ను డాక్టర్ చంద్రశేఖరన్ అనే పేరును ఉపయోగించి నడుపుతున్నారు. అయితే ఈ డాక్టర్ ఆ ప్రదేశం నుండి వెళ్లిపోయిన తర్వాత అసిస్టెంట్ నబీసా క్లినిక్ ని నడుపుతున్నారు. తాజాగా ఒక పేషంట్ క్లినిక్ వచ్చారు. దాంతో ట్రీట్మెంట్ లో భాగంగా ఒక ఇంజక్షన్ ను ఈమె చెప్పారు. పేషెంట్ కు అనుమానం రావడంతో ఇంజక్షన్ వద్దని మెడికేషన్ తీసుకుంటా అని చెప్పారు.
దాంతో ఈమె మూడు రకాల మందులను పేషంట్ కి ఇచ్చారు. అయితే ఆ టాబ్లెట్ల పై ఎలాంటి పేర్లు లేవు. ఆ పేషెంట్ కి నొప్పి ఎక్కువగా ఉండడంతో వచ్చారు, దీంతో ఒక టాబ్లెట్ క్యాల్షియం కు సంబంధించింది అని చెప్పి మొత్తం నొప్పి తగ్గిపోతుంది అని అన్నారు. దీనికి కన్సల్టేషన్ ఫీజుగా 250 రూపాయలు తీసుకున్నారు.
పేషంట్ డాక్టర్ గురించి ప్రశ్నించగా డాక్టర్ ఉన్నారని చెప్పి తర్వాత మాట మార్చేశారు. ఈ పేషంట్ ఇంకొక డాక్టర్ దగ్గరకు వెళ్లి ఇచ్చిన మెడికేషన్ ను పరీక్షించగా ఒకటి పెయిన్ కిల్లర్ అని మరొకటి గ్యాస్ రిలీఫ్ చేయడానికి అని గుర్తించారు. ఇంకొక టాబ్లెట్ ని గుర్తించలేకపోయారు. ఇలా లేబుల్ లేని టాబ్లెట్లను ఇవ్వడం నేరం అని, లైసెన్స్ లేకుండా ఎటువంటి క్లినిక్ నడపరాదని పోలీసులకు ఫిర్యాదు చేశారు.