Finger Fish : చేపలతో ఫింగర్‌ ఫిష్‌ను ఇలా తయారు చేయండి.. లొట్టలేసుకుంటూ తింటారు..!

Finger Fish : చేపలతో సహజంగానే చాలా మంది రకరకాల వంటలను తయారు చేస్తుంటారు. చేపల పులుసు లేదా వేపుడును ఎక్కువ మంది చేస్తుంటారు. అయితే చేపలతో ఫింగర్‌ ఫిష్‌ ను కూడా తయారు చేసుకోవచ్చు. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. కాకపోతే ముళ్లు లేని చేపలతో దీన్ని తయారు చేయాల్సి ఉంటుంది. అప్పుడే దీని రుచి అదిరిపోతుంది. ఇక ఫింగర్‌ ఫిష్‌ను ఎలా తయారు చేయాలి.. దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఫింగర్‌ ఫిష్‌ తయారీకి కావల్సిన పదార్థాలు..

చేపలు – అర కిలో (ముళ్లు లేనివి), బ్రెడ్‌ ముక్కలు – కొన్ని, నూనె – వేయించడానికి సరిపడా, అల్లం వెల్లుల్లి ముద్ద – రెండు టీస్పూన్లు, కారం – కొద్దిగా, నిమ్మరసం – రెండు టీస్పూన్లు, జీలకర్ర పొడి – ఒక టీస్పూన్‌ (వేయించాలి), గుడ్లు – రెండు, ఉప్పు – రుచికి తగినంత.

Finger Fish very easy to make recipe is here
Finger Fish

ఫింగర్‌ ఫిష్‌ ను తయారు చేసే విధానం..

ముళ్లు లేని చేపలను ఎంచుకుని సన్నగా, నిలువుగా ముక్కలుగా కట్‌ చేయాలి. గుడ్లలోని తెల్లసొనను తీసుకుని గిలకొట్టి పక్కన పెట్టుకోవాలి. బ్రెడ్‌ ముక్కలను పెనంపై కాల్చి పొడి చేయాలి. ఇప్పుడు గిన్నెలోకి చేప ముక్కలను తీసుకుని అల్లం వెల్లుల్లి ముద్ద, ఉప్పు, కారం, నిమ్మరసం, జీలకర్ర పొడి కలిపి మూత పెట్టి ఉంచాలి. ఒక గంట సేపు అయ్యాక బాణలిలో నూనె పోసి స్టవ్‌ మీద పెట్టాలి. నూనె వేడి అయ్యాక చేప ముక్కలును గుడ్డు సొనలో ముంచి బ్రెడ్‌ పొడిలో దొర్లించి నూనెలో వేయాలి. ఈ ముక్కలు బంగారు రంగులోకి మారిన తరువాత తీయాలి. ఇలా అన్ని చేప ముక్కలను కాల్చాలి. దీంతో ఫింగర్‌ ఫిష్‌ రెడీ అవుతుంది. వీటిని నేరుగా తినవచ్చు. లేదా పప్పు, సాంబార్‌ వంటి కూరలు తినేటప్పుడు వీటిని అంచున పెట్టుకుని కూడా తినవచ్చు. ఎంతో రుచిగా ఉంటాయి.

Editor

Recent Posts