Police Jobs : తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ ఇటీవలే రాష్ట్ర అసెంబ్లీలో ఉద్యోగాల నోటిఫికేషన్‌పై కీలక ప్రకటన చేసిన విషయం విదితమే. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న మొత్తం 80వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నామని ప్రకటించారు. ఆయా విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు గాను వేర్వేరుగా నోటిఫికేషన్‌లను విడుదల చేసి ఉద్యోగాల భర్తీ చేపడతారు. ఇక పోలీసు విభాగంలో ఉన్న 18,334 ఖాళీలకు కూడా త్వరలోనే నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నారు. దీంతో నిరుద్యోగ అభ్యర్థులకు సైబరాబాద్ పోలీసులు బంపర్ ఆఫర్‌ను ప్రకటించారు. ఉచితంగా శిక్షణను అందించనున్నట్లు తెలిపారు.
పోలీస్ అవ్వాలనుకునే నిరుద్యోగ అభ్యర్థులకు సైబరాబాద్ పోలీసులు చక్కని అవకాశం కల్పిస్తున్నారు. పోలీసు ఉద్యోగం కోసం అవసరం అయ్యే శిక్షణను ఉచితంగా అందించనున్నట్లు తెలిపారు. ఈ క్రమంలోనే ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ శిక్షణకు హాజరు కావచ్చు. ఇందుకు గాను అభ్యర్థులు కేవలం ఇంటర్ విద్యార్హత ఉన్నా చాలు.. ఈ శిక్షణలో పాల్గొనవచ్చు.
ఇక ఈ శిక్షణను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఎం.స్టీఫెన్ రవీంద్ర పర్యవేక్షణలో అందిస్తారు. అందులో భాగంగానే అభ్యర్థులు ఈ శిక్షణ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మార్చి 14 నుంచి ఇందుకు అవకాశం కల్పించారు. ఈ క్రమంలోనే అభ్యర్థులు కనీసం 18 సంవత్సరాల వయస్సు నిండి ఉండాలి. అలాగే కనీసం ఇంటర్ పాస్ అయి ఉండాలి. ఈ అర్హతలు ఉన్నవారు రెండు ఫొటోలు, ఆధార్ కార్డుతో శంషాబాద్‌లోని డీసీపీ ఆఫీస్‌కు వచ్చి తమ పేరును నమోదు చేయించుకోవచ్చు. అనంతరం శిక్షణలో పాల్గొనవచ్చు. మరిన్ని వివరాలకు 99088 89114, 89788 30185 అనే ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చు.