Mosquitoes : మన ఇంట్లో ఉండే దోమలను నివారించడానికి చేయని ప్రయత్నం అంటూ ఉండదు. మార్కెట్ లో దొరికే అన్ని రకాల దోమల నివారణ మందులను వాడుతూ ఉంటాం. వీటిని వాడడం వల్ల ఫలితాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. వీటిలో రసాయనాలను అధికంగా ఉపయోగిస్తారు. కనుక వీటిని ఉపయోగించడం వల్ల అనారోగ్యాల బారిన పడతారని నిపుణులు తెలియజేస్తున్నారు. కాలంతో సంబంధం లేకుండా ప్రస్తుత తరుణంలో అన్ని కాలాలలోనూ దోమలు విజృంభిస్తున్నాయి. దోమ కాటు వల్ల మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ వంటి విష జ్వరాల బారిన పడేవారి సంఖ్య కూడా ఎక్కువవుతోంది.
ఎటువంటి దుష్పభ్రావాలు లేకుండా సహజ సిద్దంగా మనం మన ఇంట్లో ఉండే దోమలను నివారించుకోవచ్చు. మన ఇంటి చుట్టు పక్కల అనేక రకాల ఔషధ మొక్కలు ఉండనే ఉంటాయి. అలాంటి మొక్కలల్లో గడ్డి చామంతి మొక్క కూడా ఒకటి. దీనిని గాయపాకు, పరకాకు అని కూడా అంటారు. ఈ మొక్క మనకు ఎక్కడపడితే అక్కడ కనబడుతూనే ఉంటుంది. గడ్డి చామంతి మొక్క ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. దోమలను నివారించడంలో ఈ మొక్క ఎంతగానో ఉపయోగపడుతుంది. మనకు వచ్చే అనేక రోగాలను నయం చేయడంలో కూడా ఈ మొక్క ఎంతగానో ఉపయోగపడుతుంది.
గడ్డి చామంతి మొక్క యాంటీ సెప్టిక్ లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. ఈ మొక్క ఆకుల రసాన్ని గాయాలపై రాయడం వల్ల గాయాలు త్వరగా మానుతాయి. అందుకే దీనిని గాయపాకు అని అంటారు. గడ్డి చామంతి మొక్క ఆకులను ఎండబెట్టాలి. ఇలా ఎండబెట్టిన వాటిని మట్టి పిడతలో లేదా కుండలో ఉంచి ఇంటి కిటికీలు, తులపులు అన్ని మూసేసి పొగ బెట్టాలి. ఒక పదిహేను నిమిషాల తరువాత తలుపులు తీయాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉండే దోమలు చనిపోతాయి. ఈ పొగను పీల్చడం వల్ల మనకు ఎటువంటి హాని కలగదు. ఈ విధంగా గడ్డి చామంతి మొక్కను ఉపయోగించి ఇంట్లో ఉండే దోమలను నివారించడంతోపాటు మనకు వచ్చే అనారోగ్య సమస్యలను కూడా నయం చేసుకోవచ్చు.