Gangubai Kathiawadi : ఆలియాభ‌ట్ గంగూబాయి సినిమా ఓటీటీలో.. ఎందులో అంటే..?

Gangubai Kathiawadi : బాలీవుడ్ న‌టి ఆలియా భ‌ట్ ప్ర‌ధాన పాత్ర‌లో వ‌చ్చిన చిత్రం గంగూబాయి క‌తియ‌వాడి. ఈ సినిమా ఫిబ్ర‌వ‌రి 25వ తేదీన ప్ర‌పంచ వ్యాప్తంగా థియేట‌ర్ల‌లో పెద్ద ఎత్తున రిలీజ్ అయింది. ఈ క్ర‌మంలోనే బాక్సాఫీస్ వ‌ద్ద ఈ మూవీ ఘ‌న విజ‌యం సాధించింది. రూ.100 కోట్ల క్ల‌బ్‌లో చేరింది. అయితే ఈ సినిమా త్వ‌ర‌లోనే ఓటీటీలో రిలీజ్ అయ్యేందుకు సిద్ధ‌మ‌వుతోంది. ఈ క్ర‌మంలోనే ఈ సినిమాకు గాను ప్ర‌ముఖ స్ట్రీమింగ్ యాప్ నెట్‌ఫ్లిక్స్ డిజిట‌ల్ రైట్స్‌ను కొనుగోలు చేసిన‌ట్లు తెలుస్తోంది. దీంతో అదే యాప్‌లో ఈ మూవీ స్ట్రీమ్ కానుంది.

Gangubai Kathiawadi to stream on OTT know which app
Gangubai Kathiawadi

ఫిబ్ర‌వ‌రి 25న ఈ మూవీ రిలీజ్ అయింది కాబ‌ట్టి వాస్త‌వంగా చూస్తే నెల రోజుల్లో.. అంటే మార్చి 25వ తేదీ త‌రువాత ఈ సినిమా ఓటీటీలో రావాలి. కానీ ఈ మూవీకి నిర్మాత‌లు 8 వారాల గ‌డువు పెట్టార‌ట‌.. అంటే.. ఏప్రిల్ నెలాఖ‌రు వ‌ర‌కు అన్న‌మాట‌. అప్ప‌టి వ‌ర‌కు ఈ సినిమా ఓటీటీలోకి వ‌స్తుంద‌ని తెలుస్తోంది. అయితే మ‌రోవైపు ఈ నెల 25వ తేదీన ఆలియా భ‌ట్ నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా కూడా రిలీజ్ కు ఉంది. క‌నుక ఆ మూవీకి ఇబ్బందులు క‌ల‌గ‌కూడ‌ద‌నే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది.

ఇక ఆర్ఆర్ఆర్ కోసం గంగూబాయి సినిమాను ఓటీటీలో ఆల‌స్యంగా రిలీజ్ చేస్తార‌ని తెలుస్తోంది. అందులో భాగంగానే ఆర్ఆర్ఆర్ రిలీజ్ అయిన వారం రోజుల‌కు.. అంటే.. ఏప్రిల్ 1వ తేదీ త‌రువాత ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లోకి వ‌స్తుంద‌ని కూడా అంటున్నారు. ఇక దీనిపై త్వ‌ర‌లోనే అధికారికంగా వివ‌రాల‌ను వెల్ల‌డించ‌నున్నారు.

Editor

Recent Posts