Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home food

Gongura Royyalu : గోంగూర రొయ్య‌ల‌ను క‌లిపి ఇలా చేస్తే.. అన్నం ఒక ముద్ద ఎక్కువే తింటారు..!

D by D
April 23, 2023
in food, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Gongura Royyalu : మ‌నం రొయ్య‌ల‌తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. రొయ్య‌ల‌తో చేసే కూర‌లు రుచిగా ఉండ‌డంతో పాటు వీటిని తిన‌డం వ‌ల్ల ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. రొయ్య‌ల‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో రొయ్య‌ల గోంగూర కూడా ఒక‌టి. గోంగూర, రొయ్య‌లు క‌లిపి చేసే ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. వంట‌రాని వారు, బ్యాచిల‌ర్స్ కూడా ఈ కూర‌ను సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. క‌మ్మ‌గా, రుచిగా ఉండే రొయ్య‌ల గోంగూర క‌ర్రీని ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

రొయ్య‌ల గోంగూర క‌ర్రీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

శుభ్రం చేసిన రొయ్య‌లు – అరకిలో, గోంగూర – ఒక పెద్ద గుప్పెడు, ప‌చ్చిమిర్చి – 5, త‌రిగిన ట‌మాట – 1, ఉప్పు – ఒక టీ స్పూన్, ప‌సుపు – పావు టీ స్పూన్.

Gongura Royyalu recipe in telugu very tasty how to make it
Gongura Royyalu

క‌ర్రీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె – 4 టేబుల్ స్పూన్స్, దాల్చిన చెక్క – ఒక చిన్న ముక్క‌, ల‌వంగాలు – 2, చిన్న‌గా త‌రిగిన ఉల్లిపాయ‌లు – 2, ఉప్పు – త‌గినంత‌, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, కారం – 2 టీ స్పూన్స్, ధ‌నియాల పొడి – ఒక టీ స్పూన్, జీల‌క‌ర్ర పొడి – అర టీ స్పూన్, నీళ్లు – ముప్పావు గ్లాస్, గ‌రం మ‌సాలా – అర టీ స్పూన్.

రొయ్య‌ల గోంగూర క‌ర్రీ త‌యారీ విధానం..

ముందుగా రొయ్య‌ల‌ను ఉప్పు, ప‌సుపు, నిమ్మ‌ర‌సం వేసి బాగా శుభ్రం చేయాలి. త‌రువాత ఒక క‌ళాయిలో శుభ్రం చేసిన రొయ్య‌లు, ప‌సుపు, ఉప్పు వేసి వేయించాలి. రొయ్య‌ల్లో ఉండే నీరంతా పోయే వ‌ర‌కు రొయ్య‌ల‌ను చ‌క్క‌గా వేయించాలి. త‌రువాత మ‌రో గిన్నెలో ప‌చ్చిమిర్చిని ముక్క‌లుగా చేసి వేసుకోవాలి. త‌రువాత ఇందులోనే ట‌మాట ముక్క‌లు, గోంగూర వేసి మెత్త‌గా ఉడికించాలి. త‌రువాత ఈ గోంగూర‌ను ప‌ప్పు గుత్తితో మెత్త‌గా చేసుకోవాలి. ఇప్పుడు క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక దాల్చిన చెక్క‌, ల‌వంగాలు, ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్క‌లు వేగిన త‌రువాత క‌రివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ప‌చ్చివాస‌న పోయే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత కారం, ప‌సుపు, ఉప్పు, ధ‌నియాల పొడి, జీల‌క‌ర్ర పొడి వేసి క‌ల‌పాలి.

త‌రువాత మంట‌ను చిన్న‌గా చేసి వేయించిన రొయ్య‌లు, గోంగూర వేసి క‌ల‌పాలి. త‌రువాత నీళ్లు పోసి క‌ల‌పాలి. ఇప్పుడు మూత పెట్టి చిన్న మంట‌పై నూనె పైకి తేలే వ‌ర‌కు ఉడికించాలి. ఇలా ఉడికించిన త‌రువాత గ‌రం మ‌సాలా వేసి క‌లపాలి. దీనిని మ‌రో నిమిషం పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే రొయ్య‌ల గోంగూర త‌యార‌వుతుంది. దీనిని అన్నంతో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. రొయ్య‌ల‌తో త‌ర‌చూ చేసే కూర‌ల‌తో పాటు ఇలా గోంగూర‌ను వేసి కూడా రుచిగా కూర‌ను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు.

Tags: Gongura Royyalu
Previous Post

Indigo Leaf : బంగారం క‌న్నా విలువైన మొక్క ఇది.. కనిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

Next Post

Wheat Dosa : టిఫిన్‌కి ఏమీ పెట్ట‌లేదా.. అయితే ఇంట్లో ఉన్న‌వాటితో అప్పటిక‌ప్పుడు ఇలా దోశ‌ల‌ను వేసుకోండి..!

Related Posts

ఆధ్యాత్మికం

మీ ఇంటి వద్ద‌కు వ‌చ్చి కాకి ప‌దే ప‌దే అరుస్తుందా..? దాని అర్థం ఏమిటంటే..?

July 4, 2025
ఆధ్యాత్మికం

దేశంలో ఉన్న 18 అష్టాద‌శ శ‌క్తి పీఠాలు ఎక్క‌డ ఉన్నాయి..? అవి ఏమిటి..?

July 4, 2025
ఆధ్యాత్మికం

దీపారాధ‌న‌కు అస‌లు ఏ నూనె వాడాలి..? దీపారాధ‌న ఎలా చెయ్యాలి..?

July 4, 2025
వినోదం

70 ఏళ్ల వ‌య‌స్సులోనూ ర‌జ‌నీకాంత్ అంత ఫిట్‌గా ఉన్నారంటే..? ఆయ‌న పాటించే దిన‌చ‌ర్య ఎలాంటిదంటే..?

July 4, 2025
technology

స్మార్ట్‌ఫోన్ల పై భాగంలో ఉండే రంధ్రాన్ని ఎప్పుడైనా గ‌మ‌నించారా..? అదేమిటో తెలుసా..?

July 4, 2025
lifestyle

బుల్లెట్ బైక్‌ నే దేవుడిగా చేసి, పూజలు చేస్తున్న గ్రామస్తులు, దీని వెనక పెద్ద కథే ఉంది.!

July 4, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.