Guppedantha Manasu : గుప్పెడంత మనసు గత ఎపిసోడ్‌లో శైలేంద్ర..రంగా ఇంటికి రావడం ఆ సమయంలో వసుధార కనపడకుండా ఆమెని తెలివిగా దాచే ప్రయత్నం చేయడం మనం చూశాం. అయితే వసుధారని రంగా లోపల దాచేయడంతో శైలేంద్రని వసుధార కలవలేకపోతుంది. అందుకు కారణం శైలేంద్రని రంగా.. సరోజ ఇంటికి తీసుకెళ్లడమే. అయితే దారిలో వెళుతున్న సమయంలో కొందరు రంగా బాగా పరిచయం ఉన్నట్టుగా మాట్లాడడంతో శైలేంద్ర అతను.. రిషి కాదు రంగా అనే శైలేంద్ర ఫిక్సవుతాడు. ఇక తన అనుమానాలన్నీ క్లియర్ కావడంతో సరోజ ఇంటికి వెళ్లకుండానే అర్జెంట్ పని పడిందని సిటీకి వెళ్లాలని రంగాకి చెబుతాడు. అయితే సరోజ సంబంధం మాకు నచ్చిందని, మీ మావయ్యకి చెప్పాలని రంగాతో అంటాడు శైలేంద్ర.
ఇక వసుధార ఫొటోను రంగాతో పాటు బుజ్జికి చూపించి ఈ అమ్మాయిని ఎక్కైడైనా చూశారా అని అడుగుతాడు శైలేంద్ర. వసుధార ఫొటో చూసి బుజ్జిషాకవుతాడు. అతడు నిజం చెప్పబోతుండగా రంగా అడ్డుకొని ఈమెని ఎప్పుడు చూడలేదని అబద్ధం ఆడుతాడు. రంగా అబద్దం ఆడడంతో బుజ్జిలో అనేక అనుమానాలు వ్యక్తం అవుతాయి. శైలేంద్ర ప్రవర్తనపై అనుమానంతోనే అలా అబద్ధం ఆడానని రంగా అంటాడు. మరోవైపు రంగా, శైలేంద్రలను వెతుక్కుంటూ సరోజ ఇంటికొస్తుంది వసుధార. కానీ అక్కడ రంగా కనిపించడు. రంగా కోసం వచ్చిన వసుధారపై సరోజ ఫైర్ అవుతుంది. నువ్వు ఉండగా మా బావ నా దగ్గరకు ఎందుకొస్తాడని ఆమెపై చిర్రుబుర్రులాడుతుంది.
బావ అంటే నాకు ప్రాణం..బావకు నేను అంటే ఇష్టం…కానీ నువ్వే బావ మనసులో నా పట్ల ఉన్న ఇష్టం , ప్రేమ మొత్తాన్ని చంపేశావని, రిషి అంటూ పిలుస్తూ అతడిని నీ వైపుకు తిప్పుకున్నావని కోప్పడుతుంది. అసలు నీ రిషి ఉన్నాడో చచ్చాడో తెలియదని నోరు జారుతుంది సరోజ.ఆ సమయంలో అక్కడికి వచ్చిన రంగా.. సరోజపై ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. ఆ సమయంలో రంగాని కొన్ని ప్రశ్నలు అడుగుతుంది సరోజ. నీ మనసులో నేను ఉన్నానా లేదా ఇప్పుడే చెప్పాలని రంగాను నిలదీస్తుంది సరోజ. నువ్వే కాదు నా మనసులో ఎవరూ లేరని రంగా ఆన్సర్ ఇస్తాడు. ఇక రంగానే కావాలని సరోజ పట్టుబడుతుండగా, నా కోసం పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటే ఎలాంటి ప్రయోజనం ఉండదని సరోజకు చెప్పి వసుధారను తీసుకొని అక్కడి నుంచి వెళ్లిపోతాడు రంగా.
ఇక ఎంక్వైరీలో రంగా గురించి కనిపెట్టిన విషయాలు ఫోన్ చేసి తల్లికి చెబుతాడు శైలేంద్ర. రంగా రూపంలో ఉన్నది రిషి కాదని, రిషి లేడు, ఇక రాడని శైలేంద్ర తేల్చేస్తాడు.ఇక ఆ సమయంలో డీబీఎస్‌టీ కాలేజీ దక్కించుకోవడానికి, నువ్వు ఎండీ కావడానికి రంగా మనకు మంచి ఛాన్స్ ఇచ్చాడని దేవయాని అంటుంది. గతంలో రిషి, వసుధార ఇద్దరిలో ఏ ఒక్కరు ఎండీగా నీ పేరు చెప్పిన నీకే ఆ పదవి ఇస్తానని మినిస్టర్ అన్నారు కదా అంటూ అప్పటి మాటలని గుర్తు చేస్తుంది. ఈ క్రమంలో రంగాని సిటీకి తీసుకొచ్చి ఎండీ సీటు దక్కించుకునేలా ప్లాన్ చేస్తుంది దేవయాని. దాంతో తాజా ఎపిసోడ్ ముగుస్తుంది.