Healthy Guava Snacks : చాలా ఆరోగ్య‌క‌ర‌మైన స్నాక్స్‌.. ఎంతో రుచిగా ఉంటాయి.. త‌యారీ ఇలా..!

Healthy Guava Snacks : మ‌నం ఆహారంగా తీసుకునే పండ్ల‌ల్లో జామకాయ కూడా ఒక‌టి. జామ‌కాయ మ‌న ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. జామ‌కాయ‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. బ‌రువు త‌గ్గ‌డంలో, శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంలో, మ‌ల‌బ‌ద్దకాన్ని త‌గ్గించ‌డంలో జామ‌కాయ మ‌న‌కు ఎంతో స‌హాయ‌ప‌డుతుంది. అంతేకాకుండా జామ‌కాయ‌ను తీసుకోవ‌డం వ‌ల్ల గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. ర‌క్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. కంటి చూపు మెరుగుప‌డుతుంది.

క్యాన్స‌ర్ వంటి అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డే అవ‌కాశాలు చాలా త‌క్కువ‌గా ఉంటాయి. ఈ విధంగా జామ‌కాయ మ‌న‌కు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని అందించ‌డంలో తోడ్ప‌డుతుంది. జామ‌కాయ‌ను సాధార‌ణంగా మ‌నం ముక్క‌లుగా క‌ట్ చేసుకుని తింటూ ఉంటాము. అయితే ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా ఈ జామ‌కాయ‌ను మ‌నం మ‌రింత రుచిగా కూడా తీసుకోవ‌చ్చు. కింద చెప్పిన విధంగా చేయ‌డం వ‌ల్ల రుచిగా ఉండ‌డంతో పాటు జామ‌కాయ‌లో ఉండే పోష‌కాలు కూడా న‌శించ‌కుండా ఉంటాయి. జామ‌కాయ‌ను మ‌రింత రుచిగా ఎలా తీసుకోవ‌చ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

Healthy Guava Snacks recipe in telugu make like this
Healthy Guava Snacks

హెల్దీ స్నాక్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

దోర‌గా పండిన జామ‌కాయ – 1, బ్లాక్ సాల్ట్ – అర టీ స్పూన్, మిరియాల పొడి – అర టీస్పూన్, నిమ్మ‌ర‌సం – అర చెక్క‌, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా, మ‌స్ట‌ర్డ్ సాల్ట్ – ఒక టీ స్పూన్, మెత్త‌గా దంచిన ప‌చ్చిమిర్చి – 1.

హెల్దీ స్నాక్ త‌యారీ విధానం..

ముందుగా జామ‌కాయ‌ను ముక్క‌లుగా క‌ట్ చేసుకుని గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత ఇందులో పైన చెప్పిన ప‌దార్థాల‌న్నీ ఒక్కొక్క‌టిగా వేసి క‌లిపి స‌ర్వ్ చేసుకోవాలి. ఈ విధంగా జామ‌కాయ‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. దీనిని అంద‌రూ ఎంతో ఇస్టంగా తింటారు.

D

Recent Posts