బాగా మాడిపోయిన గిన్నెను కూడా ఇలా సుల‌భంగా శుభ్రం చేయ‌వ‌చ్చు..!

మ‌నం ప్ర‌తిరోజూ వంట గ‌దిలో స్ట‌వ్ మీద పాల‌ను ఉంచి వేడి చేస్తూ ఉంటాం. అయితే కొన్నిసార్లు ఇలా పాల‌ను స్ట‌వ్ మీద ఉంచి మ‌నం వేరే ప‌నిలో ప‌డి వాటిని మ‌రిచిపోతూ ఉంటాం. ఆ పాలు కాస్తా పూర్తిగా మ‌రిగి అడుగు భాగం మాడిపోతుంది. కొద్దిగా మాడిన పాత్ర‌ల‌ను మ‌నం సులువుగా శుభ్రం చేసుకోవ‌చ్చు. కానీ కొన్నిసార్లు గిన్నె అడుగు భాగం ఎక్కువ‌గా మాడిపోయి శుభ్రం చేయ‌డానికి కూడా వీలు లేకుండా ఉంటుంది. ఇక‌ చేసేదేమి లేక మ‌నం ఆ గిన్నెను వాడ‌డ‌మే మానేస్తాము.

ఇంటి చిట్కాను ఉప‌యోగించి ఎంతగా మాడిన గిన్నెనైనా మ‌నం చాలా సులువుగా శుభ్ర‌ప‌రుచుకోవ‌చ్చు. ఇందుకోసం మ‌నం ముందుగా మాడిన గిన్నెను కొద్దిగా నీటితో శుభ్రం చేసుకోవాలి. త‌రువాత ఆ గిన్నెలో కొద్దిగా వంట‌సోడాను, పావు క‌ప్పు వెనిగ‌ర్ ను వేయాలి. త‌రువాత ఆ గిన్నెలో గిన్నె మాడినంత వ‌ర‌కు నీటిని పోసి 20 నిమిషాల పాటు ప‌క్క‌న‌ ఉంచాలి. త‌రువాత ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల డిట‌ర్జంట్ పౌడ‌ర్ ను వేసి గిన్నెను స్ట‌వ్ మీద ఉంచి వేడి చేయాలి. గిన్నెలో నీళ్లు స‌గం అయ్యే వ‌ర‌కు మంట‌ను పెంచుతూ త‌గిస్తూ వేడి చేయాలి.

here it is how you can clean fried bowls

నీళ్లు మ‌రిగేట‌ప్పుడు గంటెను తీసుకుని సున్నితంగా అడుగు భాగంలో మాడు తొల‌గిపోయేలా రుద్దుతూ ఉండాలి. ఇలా అంతా తొల‌గిపోయేలా రుద్దిన త‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసుకుని నీటిని పార‌బోయాలి. త‌రువాత గంటెను తీసుకుని మిగిలిన మాడును పూర్తిగా తొల‌గించాలి. త‌రువాత గిన్నెను స్టీల్ స్క‌బ్ర‌ర్ ను, స‌బ్బును ఉప‌యోగించి పూర్తిగా మాడిన భాగం తొల‌గిపోయేలా గ‌ట్టిగా రుద్దాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల మాడు తొల‌గిపోయి గిన్నె పూర్తిగా శుభ్ర‌ప‌డుతుంది. పాలు మాత్ర‌మే కాకుండా ఏ ఇత‌ర ప‌దార్థాలు మాడినా కూడా ఈ విధంగా గిన్నెను శుభ్ర‌ప‌రుచుకోవ‌డం వ‌ల్ల.. గిన్నెను తిరిగి వాడుకోవ‌చ్చు.

Share
D

Recent Posts