Hotel Style Gobi 65 : హోట‌ల్ స్టైల్‌లో గోబీ 65 ఇలా చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!

Hotel Style Gobi 65 : క్యాలీప్ల‌వ‌ర్ తో కూర‌లే కాకుండా వివిధ ర‌కాల చిరుతిళ్ల‌ను కూడా తయారు చేస‌త్ఊ ఉంటాము. క్యాలీప్ల‌వ‌ర్ తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైర చిరుతిళ్లల్లో గోబి65 కూడా ఒక‌టి. గోబి65 చాలారుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని రుచి చూసే ఉంటారు. ఎక్కువ‌గా ఫంక్ష‌న్ ల‌ల్లో, హోటల్స్ లో, కర్రీ పాయింట్ ల‌లో దీనిని స‌ర్వ్ చేస్తూ ఉంటారు. ప‌ప్పు, సాంబార్ వంటి వాటితో సైడ్ డిష్ గా తిన‌డానికి, స్నాక్స్ గా తిన‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. ఈ గోబి 65 ని మ‌నం కూడా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. దీనిని త‌యారు చేయ‌డం చాలా తేలిక‌. హోట‌ల్ స్టైల్ గోబి 65 ని ఇంట్లోనే ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

గోబి 65 త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

క్యాలీప్ల‌వ‌ర్ – 1( మ‌ధ్య‌స్థంగా ఉన్న‌ది), మైదాపిండి – ఒక టేబుల్ స్పూన్, కార్న్ ఫ్లోర్ – 2 టేబుల్ స్పూన్స్, శన‌గ‌పిండి – 2 టేబుల్ స్పూన్స్, బియ్యంపిండి – ఒక టేబుల్ స్పూన్, ప‌సుపు – పావు టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, కారం – ఒక‌టిన్న‌ర టీ స్పూన్, ధ‌నియాల పొడి – అర టీ స్పూన్, గ‌రం మ‌సాలా – ఒక టీ స్పూన్, మిరియాల పొడి – పావు టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా, జీడిపప్పు – కొద్దిగా, తరిగిన ప‌చ్చిమిర్చి – 3, క‌రివేపాకు – 2 రెమ్మ‌లు, ఫుడ్ క‌ల‌ర్ – కొద్దిగా.

Hotel Style Gobi 65 recipe in telugu very easy to make
Hotel Style Gobi 65

గోబి 65 త‌యారీ విధానం..

ముందుగా క్యాలీప్ల‌వ‌ర్ ను పెద్ద ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి. త‌రువాత గిన్నెలో నీళ్లు పోసి వేడి చేయాలి. ఇందులోనే ఉప్పు, ప‌సుపు వేసి నీటిని మ‌రిగించాలి. నీరు మ‌రిగిన త‌రువాత క్యాలీప్ల‌వ‌ర్ ముక్క‌లు వేసి మ‌రో 2 నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. త‌రువాత క్యాలీప్ల‌వ‌ర్ ముక్క‌ల‌ను ప్లేట్ లోకి తీసుకుని ప‌క్క‌కు ఉంచాలి. త‌రువాత ఒక గిన్నెలో మైదాపిండిని తీసుకోవాలి. త‌రువాత మిగిలిన ప‌దార్థాలన్నీ వేసి బాగా క‌ల‌పాలి. త‌రువాత కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ గంటెజారుడుగా పిండిని క‌లుపుకోవాలి. త‌రువాత క్యాలీప్ల‌వ‌ర్ ముక్క‌లు వేసి బాగా క‌ల‌పాలి. ఇప్పుడు క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక క్యాలీప్ల‌వ‌ర్ ముక్క‌ల‌ను నూనె వేసి వేయించాలి. వీటిని మ‌ధ్య‌స్థ మంట‌పై ఎర్ర‌గా, క్రిస్పీగా అయ్యే వ‌ర‌కు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి.ఇలా చేయ‌డం వల్ల ఎంతో రుచిగా ఉండే గోబి 65 త‌యార‌వుతుంది. ఈ విధంగా త‌యారు చేసిన గోబి 65 ని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

D

Recent Posts