Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

Yama Dharma Raju : మ‌నిషి చ‌నిపోయాక అత‌ని ఆత్మ య‌మ‌ధ‌ర్మరాజు ద‌గ్గ‌రికి ఎలా వెళ్తుందో తెలుసా..?

Admin by Admin
November 16, 2024
in mythology, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

Yama Dharma Raju : మ‌నిషి చ‌నిపోయాక ఏం జ‌రుగుతుంది..? అత‌ని శ‌రీరాన్న‌యితే ఖ‌న‌నం చేస్తారు. మ‌రి ఆత్మ సంగ‌తి..? అది ఎక్క‌డికి వెళ్తుంది..? ఎన్ని రోజుల పాటు భూమిపై ఉంటుంది..? మీకు తెలుసా..? ఆ.. అయినా ఈ రోజుల్లో ఆత్మ‌లు, ప్రేతాత్మ‌లు ఏంటి అంటారా..? అలా అనుకునే వారు ఉంటే ఉంటార‌నుకోండి. వారి సంగ‌తి ప‌క్క‌న పెడితే అస‌లు చనిపోయిన వారి గురించి హిందూ పురాణాలు ఏం చెబుతున్నాయి..? మ‌నిషి మ‌ర‌ణించాక అత‌ని ఆత్మకు ఏమ‌వుతుంది..? య‌మ‌ధ‌ర్మ రాజు ద‌గ్గ‌రికి ఎలా వెళ్తారు..? త‌దిత‌ర విష‌యాల‌ను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

మ‌నిషి మ‌ర‌ణానంత‌రం జ‌రిగే ప‌రిణామాల గురించి హిందూ శాస్త్రం ప్ర‌కారం గ‌రుడ పురాణంలో వివ‌రించ‌బ‌డింది. మ‌రికొద్ది సెక‌న్ల‌లో చ‌నిపోతాడ‌న‌గా మ‌నిషికి సృష్టి అంతా క‌నిపిస్తుంద‌ట‌. త‌నకు ఆ స‌మయంలో దివ్య దృష్టి లాంటిది వ‌స్తుంద‌ట‌. దీంతో అత‌ను ప్ర‌పంచాన్నంత‌టినీ అర్థం చేసుకుంటాడ‌ట. కానీ ఆ క్ష‌ణంలో ఏమీ మాట్లాడ‌లేడ‌ట‌. అయితే ఆ స‌మ‌యంలోనే మ‌నిషి య‌మ‌దూత‌ల‌ను చూస్తాడ‌ట‌. వారు అత్యంత వికారంగా, న‌ల్ల‌గా, త‌ల అనేది ఒక స‌రైన ఆకారం లేకుండా ఆయుధాల వంటి పెద్ద పెద్ద గోళ్ల‌తో అత్యంత భ‌యంక‌రంగా వారు క‌నిపిస్తార‌ట‌. దీంతో మ‌నిషికి నోటి నుంచి ఉమ్మి వ‌స్తూ దుస్తుల్లోనే మూత్ర లేదా మ‌ల విసర్జ‌న చేస్తాడ‌ట‌. అనంత‌రం అన్ని స్పృహ‌ల‌ను కోల్పోయి చివ‌రికి ప్రాణం పోతుంద‌ట‌. దీంతో ఆ ప్రాణాన్ని (ఆత్మ‌ను) య‌మ‌దూత‌లు న‌ర‌కానికి తీసుకువెళ్తార‌ట‌.

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

how our soul goes to lord yama

య‌మ‌దూత‌లు ఆత్మ‌ల‌ను న‌రకానికి తీసుకువెళ్లేందుకు దాదాపు 47 రోజుల స‌మ‌యం ప‌డుతుంద‌ట‌. ఈ క్ర‌మంలో దారిలో ఆత్మ‌ల‌ను య‌మ‌దూత‌లు అనేక చిత్ర‌హింస‌లు పెడ‌తార‌ట‌. త‌మ‌ను చూసి భ‌య‌ప‌డినా, ఎక్క‌డైనా ఆగినా ఆత్మ‌ల‌ను కొర‌డాల వంటి ఆయుధాల‌తో చిత‌క్కొడుతూ య‌మ‌దూత‌లు తీసుకెళ్తార‌ట‌. దీంతోపాటు న‌రకంలో విధించే శిక్ష‌ల‌ను గురించి య‌మ‌దూత‌లు ఆత్మ‌ల‌కు క‌థ‌లు క‌థ‌లుగా చెబుతార‌ట‌. దీంతో ఆత్మ‌లు ఏడుస్తాయ‌ట‌. త‌మ‌ను అక్క‌డికి తీసుకువెళ్ల‌వ‌ద్ద‌ని ప్రార్థిస్తాయ‌ట‌. అయినా య‌మ‌దూత‌లు క‌నిక‌రించ‌రు స‌రి కదా, ఇంకాస్త క‌ఠినంగా ప్ర‌వ‌ర్తిస్తూ ఆత్మ‌ల‌ను య‌మ‌ధ‌ర్మ రాజు ముందు ప్ర‌వేశ‌పెడ‌తార‌ట‌.

న‌ర‌కంలో య‌మ‌ధ‌ర్మ‌రాజు మ‌నుషుల ఆత్మ‌ల‌కు వారు చేసిన పాప‌, పుణ్యాల ప్ర‌కారం శిక్ష‌లు వేస్తాడ‌ట‌. చిన్న చిన్న త‌ప్పులు చేసి ప‌శ్చాత్తాప ప‌డుతూ దైవాన్ని ప్రార్థిస్తే వాటిని పాపాల కింద య‌మ‌ధ‌ర్మ రాజు చూడ‌డ‌ట‌. కానీ దొంగ‌త‌నం, హ‌త్య వంటి నేరాల‌కు మాత్రం త‌ప్ప‌నిస‌రిగా శిక్ష ప‌డే తీరుతుంద‌ట‌. అబ‌ద్దాన్ని కూడా పాపం గానే ప‌రిగ‌ణిస్తార‌ట‌. అయితే పాప‌, పుణ్యాల‌ను లెక్కించ‌డానికి ముందు య‌ముడు ఆత్మ‌ల‌ను మ‌రోసారి భూలోకానికి వారి బంధువుల వ‌ద్ద‌కు పంపిస్తాడ‌ట‌. ఈ క్ర‌మంలో ఆత్మ‌కు చెందిన వారు హిందూ ధ‌ర్మ శాస్త్రం ప్ర‌కారం క‌ర్మ‌కాండ‌లు, పిండ ప్ర‌దానాలు అన్నీ చేయాల్సి ఉంటుంద‌ట‌. ఇవ‌న్నీ మ‌నిషి చ‌నిపోయిన 10 రోజుల్లో పూర్తి చేయాల‌ట‌. లేదంటే య‌మ‌లోకం నుంచి వ‌చ్చిన ఆత్మ అక్క‌డే చెట్ల‌పై తిరుగుతుంద‌ట‌. ఈ క‌థంతా విన‌డానికి ఆశ్చ‌ర్యంగా ఉంటుంది కానీ, గ‌రుడ పురాణంలో దీన్ని చెప్పారు. అది చ‌దివితే ఇంకా మ‌రిన్ని విష‌యాలు తెలిసేందుకు అవ‌కాశం ఉంటుంది.

Tags: Yama Dharma Raju
Admin

Admin

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

Black Salt : ఈ ఉప్పు గురించి తెలుసా.. ఎన్ని ప్ర‌యోజ‌నాలో తెలిస్తే.. అస‌లు న‌మ్మ‌లేరు..!

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.