Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home ఆధ్యాత్మికం

Pradakshina : ఆల‌యాల్లో ప్ర‌ద‌క్షిణ‌ల‌ను ఎలా చేయాలి.. ఎన్ని చేయాలి..?

D by D
August 15, 2022
in ఆధ్యాత్మికం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Pradakshina : మ‌న‌లో చాలా మంది పండుగ‌ల‌కు, ప‌ర్వ దినాల‌కు, అలాగే మొక్క‌ల‌ను తీర్చుకోవ‌డానికి దేవాల‌యాల‌కు వెళ్తుంటారు. దేవాల‌యానికి వెళ్లిన‌ప్పుడు ఆల‌యం చుట్టూ ప్ర‌ద‌క్షిణ చేసి దేవున్ని ద‌ర్శించుకుంటాం. అయితే ప్ర‌ద‌క్షిణ ఎలా చేయాలి.. ఎన్ని సార్లు చేయాలి అని సందేహంగా ఉంటుంది. ప్ర‌ద‌క్షిణ గురించి స‌వివ‌రంగా ఇప్పుడు తెలుసుకుందాం. దేవాల‌యానికి వెళ్లినప్పుడు పాద ర‌క్ష‌ల‌ను తీసి పాదాల‌ను శుభ్రంగా క‌డుక్కుని త‌ల మీద నీళ్లు చ‌ల్లుకోవాలి.

త‌రువాత ధ్వ‌జస్తంభానికి న‌మ‌స్క‌రించి ఏ దేవాల‌యానికి వెళ్లామో ఆ దేవుణ్ని మ‌న‌సులో స్మ‌రించుకుంటూ రెండు చేతుల‌ను జోడించి న‌మ‌స్కారం చేస్తూ స‌వ్య దిశ‌లో ప్ర‌ద‌క్షిణ చేయాలి. ధ‌ర్మ శాస్త్రం ప్ర‌కారం 3, 5, 9, 11, 21, 51, 58, 101, 108.. ఇలా ఈ సంఖ్య ప్ర‌కార‌మే ప్ర‌ద‌క్షిణ చేయాలి. అదే విధంగా ప్ర‌ద‌క్షిణ చేసేట‌ప్పుడు ధ్వ‌జ‌స్తంభం విడిచి ప్ర‌ద‌క్షిణ చేయ‌కూడ‌దు. అయితే ప్ర‌ద‌క్షిణ అన్ని ఆల‌యాల్లో ఒక విధంగా శివాల‌యంలో మ‌రో విధంగా చేయాలి. అన్నీ ఆల‌యాల్లో చేసిన‌ట్టు శివాల‌యంలో ప్ర‌ద‌క్షిణ చేయ‌కూడ‌దు. శివాల‌యంలో ప్ర‌ద‌క్షిణ ఎలా చేయాలో లింగ పురాణంలో స‌వివ‌రంగా వ‌ర్ణించ‌బ‌డింది.

how to do Pradakshina and how many have to do
Pradakshina

 

శివాల‌యానికి వెళ్లిన‌ప్పుడు ధ్వ‌జ స్తంభం ద‌గ్గ‌రి నుండి మ‌న‌కు ఎడ‌మ వైపుగా బ‌య‌లుదేరి గ‌ర్భాల‌యానికి వెనుక ఉన్న సోమ‌సూత్రం (శివ‌లింగానికి అభిషేకించిన నీరు బ‌య‌ట‌కు పోయే మార్గం) వ‌రకు వెళ్లి ఆ సోమ‌సూత్రం నుండి వెనుక‌కు తిరిగి అప్ర‌ద‌క్షిణంగా ధ్వ‌జ స్తంభాన్ని చుట్టుకుని మ‌ర‌లా సోమ‌సూత్రం వ‌ర‌కు రావాలి. ఇలా చేస్తే ఒక ప్ర‌ద‌క్షిణ పూర్తి చేసిన‌ట్టు. ఎట్టి ప‌రిస్థితుల్లో కూడా ఈ సోమ‌సూత్రాన్ని దాట‌కూడ‌దు. ఒక‌వేళ సోమ‌సూత్రాన్ని దాటి ఎన్ని ప్ర‌ద‌క్షిణ‌లు చేసినా ఒక్క ప్ర‌ద‌క్షిణ కిందికే వస్తుంద‌ట‌.

మ‌న శాస్త్రాల ప్ర‌కారం మొత్తంగా ఆరు ర‌కాల ప్ర‌ద‌క్షిణ‌లు ఉంటాయి. సాధార‌ణంగా గుడి చుట్టూ న‌డుచుకుంటూ చేసే ప్ర‌ద‌క్షిణ‌ను పాద ప్ర‌ద‌క్షిణ అంటారు. మ‌నం పూజ మందిరంలో పూజ చేసేట‌ప్పుడు అక్క‌డే మూడు సార్లు త‌మ చుట్టూ తాము తిరిగే దానిని ఆత్మ ప్ర‌ద‌క్షిణ అని పిలుస్తారు. దండ ప్ర‌మాణాలు చేసే ప్ర‌ద‌క్షిణ‌ను దండ ప్ర‌ద‌క్షిణ‌ అంటారు. అన్ని అవ‌యవాలు నేల‌కు తాకుతూ చేసే ప్ర‌ద‌క్షిణ‌ను అంగ ప్ర‌ద‌క్షిణ అంటారు. దేవుడు కొలువు తీరిన కొండ చుట్టూ చేసే ప్ర‌ద‌క్షిణ‌ను గిరి ప్ర‌ద‌క్షిణ‌గా వ్య‌వ‌హ‌రిస్తారు. ఇలా దేవుడి చుట్టూ ప్ర‌ద‌క్షిణ‌ల‌ను చేయాల్సి ఉంటుంది.

Tags: Pradakshina
Previous Post

Multi Dal Dosa : ఎంతో రుచిక‌ర‌మైన మ‌ల్టీ దాల్ దోశ‌.. త‌యారీ ఇలా..

Next Post

Cream : కేక్‌పై అలంక‌రించే క్రీమ్‌ను.. ఇంట్లోనే ఇలా సుల‌భంగా త‌యారు చేయ‌వ‌చ్చు..

Related Posts

lifestyle

తొడ‌లు లావుగా ఉన్న‌వారు ఇలాంటి దుస్తుల‌ను ధ‌రిస్తే మంచిది..!

June 3, 2025
హెల్త్ టిప్స్

పాదాల వాపులు ఉన్నాయా.. అయితే ఇలా చేయండి చాలు..

June 3, 2025
వైద్య విజ్ఞానం

ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయా.. అయితే అది డీహైడ్రేష‌న్ అన్న‌మాటే.. ఇలా చేస్తే చాలు..!

June 3, 2025
mythology

మంగ‌ళ సూత్రాల‌కు పిన్నీసుల‌ను ఎందుకు పెట్ట‌కూడ‌దు..?

June 2, 2025
ఆధ్యాత్మికం

చిన్న వ‌య‌స్సులోనే పిల్ల‌లు చ‌నిపోతే.. అందుకు కార‌ణం ఎవ‌రు..?

June 2, 2025
ఆధ్యాత్మికం

పూజ చేసిన త‌రువాత క‌ర్పూరం ఎందుకు వెలిగిస్తారు..? దీని వెనుక ఉన్న సైన్స్ ఇదే..!

June 2, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
lifestyle

మీ భార్య‌ను మీరు అనుక్ష‌ణం తిడుతున్నారా..? అలా చేయ‌డం పెద్ద త‌ప్పు.. ఎందుకంటే..?

by Admin
May 22, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
పండ్లు

అంజీర్ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు

by Admin
December 6, 2021

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Date Seeds : ఖ‌ర్జూరాల‌ను తింటే వాటిల్లో ఉండే విత్త‌నాల‌ను ప‌డేయ‌కండి.. ఎందుకంటే..?

by Editor
December 25, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!