Dosa Batter : మనలో చాలా మంది దోశ అంటే చాలా ఇష్టమే. దోశ అనేక మందికి ఫేవరెట్ టిఫిన్‌గా కూడా మారింది. సౌతిండియాలో దోశ చాలా ఫేమస్. దోశల్లో అనేక రకాలు కూడా ఉన్నాయి. అందులో భాగంగానే తరచూ ఎవరైనా సరే తమకు నచ్చిన దోశలను వేసుకుని తింటుంటారు. లేదా బయట బండ్లపై, హోటల్స్‌లో వెరైటీ దోశల రుచులను ఆస్వాదిస్తుంటారు. ఇక దోశలను కొబ్బరి చట్నీ లేదా పల్లి చట్నీ, అల్లం చట్నీ, టమాటా చట్నీలతోపాటు సాంబార్‌తోనూ తినవచ్చు. ఎంతో రుచిగా ఉంటాయి. అయితే దోశల కోసం తయారు చేసే పిండి మాత్రం 1, 2 రోజులకు మించి నిల్వ ఉండదు.
కానీ కింద చెప్పిన చిట్కాలను పాటిస్తే దోశల పిండిని మీరు ఏకంగా వారం రోజులకు పైగానే నిల్వ చేసుకోవచ్చు. ఇక అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. దోశల పిండిని ఫ్రిజ్‌లో కాకుండా గది ఉష్ణోగ్రత వద్ద ఉంచితే త్వరగా పులుస్తుంది. అందువల్ల దోశ పిండి 2 రోజులకు మించి నిల్వ ఉండదు. పాడై పోతుంది. కానీ దోశల పిండిలో ఒక తమలపాకును కాడతో సహా వేసి ఫ్రిజ్‌లో పెట్టేయాలి. దీంతో పిండి ఎప్పుడూ తాజాగానే ఉంటుంది. ఒకేసారి పిండి పట్టుకుని అందులో తమలపాకును వేస్తే చాలు, ఆ పిండి వారం రోజులకు పైగానే నిల్వ ఉంటుంది. దీన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉపయోగించుకోవచ్చు.
కొబ్బరిపాలను కలపవచ్చు..
ఇక దోశల పిండి పట్టుకున్న తరువాత దాన్ని గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేయాలి. గట్టిగా లాక్ చేయాలి. దాన్ని ఫ్రిజ్‌లో పెట్టేయాలి. ఇలా చేసినా కూడా దోశల పిండి ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంటుంది. అలాగే దోశల పిండిలో కొద్దిగా కొబ్బరిపాలను కలిపి ఫ్రిజ్‌లో పెట్టాలి. ఇలా చేయడం వల్ల దోశల పిండి త్వరగా పులవదు. పైగా కొబ్బరిపాలను కలపడం వల్ల దోశలు మరింత టేస్ట్‌గా మారుతాయి. అలాగే దోశల పిండిని జిప్ లాక్ బ్యాగ్స్‌లో కూడా నిల్వ చేయవచ్చు.
జిప్ లాక్ బ్యాగ్ లో పిండిని పోసి ఆ బ్యాగ్‌ను ఫ్రిజ్‌లో పెడితే చాలు. చాలా రోజుల వరకు దోశల పిండి నిల్వ ఉంటుంది. దీంతోపాటు దోశల పిండిలో కరివేపాకులను కూడా వేయవచ్చు. ఇవి కూడా పిండిని చాలా రోజుల వరకు నిల్వ ఉండేలా చేస్తాయి. త్వరగా పులియకుండా చూస్తాయి. ఇక ఫ్రిజ్ నుంచి తీసిన తరువాత 1 గంటపాటు పిండిని అలాగే ఉంచి అనంతరం దాన్ని వాడుకోవాలి. వాడకం అవగానే మళ్లీ యథావిధిగా ఫ్రిజ్‌లో పెట్టేయాలి. ఇలా చేస్తుంటే దోశల పిండి 7 నుంచి 10 రోజుల వరకు నిల్వ ఉంటుంది. కనుక అందరూ ఈ చిట్కాలను పాటించవచ్చు.