Crispy Onion Pakoda : ఉల్లిపాయ‌ల‌తో ఎంతో క‌ర‌క‌ర‌లాడే ప‌కోడీల‌ను ఇలా చేయండి..!

Crispy Onion Pakoda : మ‌నం సాయంత్రం స‌మ‌యాల్లో ఎక్కువ‌గా త‌యారు చేసే చిరుతిళ్ల‌ల్లో ప‌కోడీలు కూడా ఒక‌టి. ప‌కోడీలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. అయితే కొంద‌రు ఎంత ప్ర‌యత్నించినా వీటిని క్రిస్పీగా త‌యారు చేసుకోలేక‌పోతూ ఉంటారు. కింద చెప్పిన విధంగా చేయ‌డం వ‌ల్ల మ‌నం చాలా సుల‌భంగా క్రిస్పీగా, రుచిగా ఉండే ప‌కోడీల‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. వీటిని త‌యారు చేసుకోవ‌డం చాలా తేలిక‌. అంద‌రికి న‌చ్చేలా క్రిస్పీగా, రుచిగా ఉండే ప‌కోడీల‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ప‌కోడి త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

స‌న్న‌గా పొడ‌వుగా త‌రిగిన ఉల్లిపాయ ముక్క‌లు – ఒక క‌ప్పు, చిన్న‌గా త‌రిగిన అల్లం ముక్క‌లు – ఒక టీ స్పూన్, చిన్న‌గా త‌రిగిన ప‌చ్చిమిర్చి – 5 నుండి 6, ఉప్పు – త‌గినంత‌, జీల‌క‌ర్ర – ఒక టీ స్పూన్, శ‌న‌గ‌పిండి – అర క‌ప్పు, బియ్యంపిండి – పావు క‌ప్పు, నూనె – 2 టేబుల్ స్పూన్స్.

how to make Crispy Onion Pakoda know the recipe
Crispy Onion Pakoda

ప‌కోడి త‌యారీ విధానం..

ముందుగా ఒక గిన్నెలో ఉల్లిపాయ ముక్క‌ల‌ను తీసుకోవాలి. త‌రువాత అల్లం, ప‌చ్చిమిర్చి ముక్క‌లు వేసుకోవాలి. త‌రువాత ఉప్పు, జీల‌క‌ర్ర వేసి క‌ల‌పాలి. ఇప్పుడు శ‌న‌గ‌పిండి, బియ్యంపిండి, నూనె వేస్తూ క‌లుపుకోవాలి. వీలైనంత వ‌ర‌కు ఉల్లిపాయ‌ల‌ల్లో ఉండే నీటితోనే పిండిని క‌లుపుకోవాలి. అవ‌స‌ర‌మైతే ఒక‌టి లేదా రెండు టీ స్పూన్ల నీటిని వేసుకోవ‌చ్చు. ఇలా కలుపుకున్న త‌రువాత కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ వేడి నూనెలో ప‌కోడి లాగా వేసుకోవాలి. ఈ ప‌కోడీల‌ను మ‌ధ్య‌స్థ మంట‌పై ఎర్ర‌గా, క్రిస్పీగా అయ్యే వ‌ర‌కు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ప‌కోడీలు త‌యార‌వుతాయి. వీటిని ఒక్క‌టి కూడా విడిచి పెట్ట‌కుండా అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. స్నాక్స్ తినాల‌నిపించిన‌ప్పుడు ఇలా అప్ప‌టిక‌ప్పుడు రుచిగా, క్రిస్పీగా ప‌కోడీల‌ను త‌యారు చేసి తీసుకోవ‌చ్చు.

D

Recent Posts