సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనేది వ్యక్తి చిన్న పొదుపు పెట్టుబడిని ప్రారంభించగలిగే ఎంపిక అని చెప్పొచ్చు. SIP ద్వారా మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టొచ్చు. ఇది మార్కెట్ లింక్డ్ స్కీమ్. కనుక మీకు రాబడి కూడా మార్కెట్ ఆధారంగా వస్తుంది. అయితే రిస్క్ ఉంటుంది. రాబడికి హామీ ఉండదు. దీర్ఘకాలంలో 12% వరకు సగటు రాబడిని ఇస్తుంది. ఏ ఇతర పథకం కంటే ఎక్కువ వడ్డీని పొందవచ్చు. భవిష్యత్తు కోసం భారీగా ఇన్వెస్ట్ చెయ్యవచ్చు. కానీ కొన్ని విషయాలని కచ్చితంగా అర్థం చేసుకోవాలి.
దీని ద్వారా పెట్టుబడి పెట్టాలనుకుంటే మొదటి జీతం నుంచి పెట్టుబడి పెట్టాలి. పెట్టుబడిని ఎక్కువ కాలం అంటే 20, 30 ఏళ్లు కొనసాగించడం ద్వారా మంచి ఫండ్ ని సృష్టించుకోవచ్చు. ఇందులో డబ్బులు పెడితే క్రమశిక్షణతో ఉండాలి. ప్రతి నెల ఒక నిర్ణీత తేదీని పెట్టుబడి పెట్టడం కొనసాగించాలి. అలా చేయడం వలన రాబడి బాగా వస్తుంది. మార్కెట్ ని దృష్టిలో ఉంచుకొని మీరు ఇందులో పెట్టుబడి పెట్టాలి.
మీరు సరిగ్గా నిర్ణయం తీసుకోకపోతే నష్టపోవాల్సి ఉంటుంది. కానీ డబ్బుల్ని కూడబెట్టుకోవాలనుకుంటే మాత్రం ఇది చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు ఏమి రాకుండా ఉండడానికి ఇది సహాయం చేస్తుంది. దీర్ఘకాలికంగా పెట్టుబడి పెట్టాలనుకున్న, కొద్ది సమయంలో పెట్టుబడి పెట్టాలనుకున్న ఈ విషయాలను కచ్చితంగా దృష్టిలో పెట్టుకుని ఫాలో అవ్వడం మంచిది. గోల్డ్, సిల్వర్, ఈక్విటీ, డెబిట్ ఫండ్స్, రియల్ ఎస్టేట్, మ్యూచువల్ ఫండ్స్ వంటి వాటిలో డబ్బులు పెట్టుబడి పెట్టొచ్చు.