Negative Energy : ఇంట్లో తరచూ గొడవలు పడడం, తీవ్రమైన ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులు, మానసిక ప్రశాంతత లేకపోవడం వంటి సమస్యలతో సతమతమయ్యే వారు మనలో చాలా మంది ఉండే ఉంటారు. ఎంత వెతికినా కూడా ఈ సమస్యల నుండి పరిష్కారం అనేది దొరకదు. దీంతో కుంటుంబ సభ్యుల మధ్య అపార్థాలు పెరిగిపోతాయి. ఎంత సంపాదించినా కూడా ఇంట్లో ధనం నిలవకుండా పోతుంది. ఇంట్లో ఉండే నెగెటివ్ ఎనర్జీయే ఈ సమస్యలన్నింటికీ ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. ఈ నెగెటివ్ ఎనర్జీ ప్రభావం కుంటుంబంలోని సభ్యులందరి మీద ఉంటుంది. ప్రతికూల శక్తుల ప్రభావంతో ఇంట్లోని వారికి మనశ్శాంతి కరువవుతుంది.
ఇంట్లోని నెగెటివ్ ఎనర్జీని చిన్న చిట్కా పాటించడం వల్ల మనం బయటకు పంపించవచ్చు. దీని కోసం పెయింటింగ్ అలాగే గీతలు లేకుండా పారదర్శకంగా ఉండే ఒక గాజు గ్లాసును తీసుకోవాలి. ఈ గ్లాస్ మీద ఎటువంటి వేలిముద్రలు కూడా ఉండకూడదు. అలాగే ఒకసారి ఉపయోగించిన దానిని రెండోసారి ఉపయోగించకూడదు. పారదర్శకంగా ఉండే గాజు గ్లాస్ ను తీసుకుని దానిలో ఒకటో వంతు రాళ్ల ఉప్పును వేయాలి. తరువాత అందులోనే రెండు వంతుల వెనిగర్ ను పోయాలి. మిగతా ఖాళీలో స్వచ్ఛమైన నీటిని పోయాలి. నీటిని నెమ్మదిగా ఒక పక్క నుండి గ్లాస్ లో ఉన్న పదార్థాలు కదలకుండా పోయాలి. ఉప్పు, నీరు, వెనిగర్ పోసిన తరువాత గ్లాస్ ను కదిలించకూడదు.
ఈ గ్లాస్ ప్రతికూల శక్తి ప్రభావం ఉందని భావించిన మూలన ఉంచాలి. ఈ గ్లాస్ ను 24 గంటల పాటు ఎవరికీ కనబడకుండా ఉంచాలి. ఇలా చేసిన మరుసటి రోజూ నీటిని పరిశీలించాలి. నీటిలో ఎలాంటి మార్పులు లేకుంటే ఇంట్లో ప్రతికూల శక్తులు లేనట్టు భావించాలి. ఒకవేళ ఆ నీరు ఆకుపచ్చ రంగులో లేదా గ్రే రంగులోకి మారినా లేదా మచ్చలు ఏర్పడినా ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ ఉన్నట్టు భావించాలి. ఆ ప్రదేశం నుండి ఆ గ్లాస్ ను తొలగించి ఈ నీటిని సింక్ లో పారబోసి శుభ్రం చేయాలి.
ఇలా తరచూ చేయడం వల్ల ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ ప్రభావం తగ్గుతుంది. అయితే చాలా మంది ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ ఎక్కడ ఉందో ఎలా కనుగొనాలి అనే సందేహ పడుతుంటారు. అలాంటప్పుడు ఇంట్లో తల పైకెత్తి ఏదో ఒక మూలన చూస్తే నెగెటివ్ ఎనర్జీ ఎక్కడ ఉందో మన మనసుకు ఇట్టే తెలిసిపోతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ చిట్కాను పాటించడం వల్ల ప్రతికూల శక్తుల ప్రభావం తగ్గి సమస్యల నుండి బయటపడవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.