lifestyle

Chanakya Niti : ఈ 5 అల‌వాట్లు మీకు ఉన్నాయా.. అయితే మీరు జీవితంలో ఫెయిల్ అవుతారు.. మీ ద‌గ్గ‌ర ఎవ‌రూ ఉండ‌రు..!

Chanakya Niti : ఆచార్య చాణ‌క్యుడు గొప్ప జ్ఞానవంతుడు మ‌రియు పండితుడు. చాణ‌క్యుడు చంద్ర‌గుప్త మౌర్యుని యొక్క గురువు. అత‌ను చాణ‌క్య నీతి అని పిల‌వ‌బ‌డే నీతి శాస్త్రాన్ని రచించాడు. నేటికి ప్ర‌జ‌లు త‌మ జీవితాల్లో ఈ విధానాన్ని అవలంబిస్తారు. చాణ‌క్యుడు ఇచ్చిన విధివిధానాలు ఒక మ‌నిషిని వ్యక్తిగ‌తంగా, సామాజికంగా, రాజ‌కీయంగా న‌డిపిస్తాయి. అలాగే చాణక్యుడు అత‌ని నీతి శాస్త్రంలో మ‌నం ఎల్ల‌ప్పుడూ దూరంగా ఉండాల్సిన 5 అలవాట్ల గురించి కూడా చెప్పాడు. వీటికి దూరంగా ఉండ‌క‌పోతే మ‌నం జీవితంలో వైఫ‌ల్యాల‌ను, స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని కూడా అత‌ను చెప్పాడు. చాణ‌క్యుడి నీతిశాస్త్రం ప్ర‌కారం మ‌నం దూరంగా ఉండాల్సిన అల‌వాట్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మ‌నం ఎప్పుడూ కూడా ఎవ‌రి గురించి చెడుగా మాట్లాడ‌కూడ‌దు.

దీని వ‌ల్ల ప్ర‌జ‌లు వారు చేసే త‌ప్పుల‌ను మ‌రిచిపోయి ఇత‌రుల త‌ప్పుల‌పై దృష్టి ఎక్కువ‌గా పెడ‌తారు. మీ చుట్టూ అలాంటి వారు ఎవ‌రైనా ఉంటే వారికి దూరంగా ఉండ‌డం మంచిది. అలాగే మ‌నం ఎప్పుడూ కూడా శుభ్ర‌మైన వాతావ‌ర‌ణంలో ఉండాలి. మ‌న చుట్టూ మురికిగా ఉంటే మ‌న ద‌గ్గ‌ర నెగెటివ్ ఎన‌ర్జీ ఉన్న‌ట్టే. అంతేకాకుండా అప‌రిశుభ్ర‌మైన చోట ల‌క్ష్మీ దేవి ఉండ‌దు. క‌నుక ఎప్పుడూ స్వ‌చ్చ‌త‌ను, ప‌రిశుభ్ర‌త‌ను పాటించాలి. మ‌న చుట్టూ ఎవ‌రైనా మురికిగా ఉంటే వారికి దూరంగా ఉండ‌డం మంచిది. అలాగే మ‌నం ఎప్పుడూ కూడా నిజాలే మాట్లాడాలి. అబ‌ద్దాలు చెప్ప‌కూడ‌దు. అబద్దాలు చెప్పే వారు ఎల్ల‌ప్పుడూ క‌ష్టాల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. అంతేకాకుండా అబ‌ద్దాలు చెప్ప‌డం వ‌ల్ల మ‌నం గౌర‌వాన్ని కూడా కోల్పోవాల్సి వ‌స్తుంది.

if you have these 5 habits then you will fail in life

అలాగే మ‌నం ఎప్పుడూ కూడా చురుకుగా ప‌ని చేసుకోవాలి. బ‌ద్ద‌కంగా అస్స‌లు ఉండ‌కూడ‌దు. బ‌ద్ద‌కంగా ఉండ‌డం వ‌ల్ల మ‌నం భ‌విష్య‌త్తులో స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. అలాగే చాణ‌క్య నీతి ఎప్పుడూ కూడా అత్యాశ మంచిది కాదు అని చెబుతుంది. అత్యాశ‌, దురాశ రెండు కూడా మంచివి కావు. వీటి వ‌ల్ల మ‌నం క‌ష్టాల‌ను, అగౌర‌వాన్ని ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. ఈ విధంగా చాణ‌క్య‌నీతి మ‌న‌కు ఈ 5 చెడు అల‌వాట్ల‌కు దూరంగా ఉండాల‌ని చెబుతుంది. వీటికి దూరంగా ఉండ‌డం వ‌ల్ల మ‌న‌కు మంచి జ‌ర‌గ‌డంతో పాటు గౌర‌వాన్ని కూడా పొంద‌గ‌లుగుతాము.

Admin

Recent Posts