మనకి ఉన్న ముఖ్యమైన డాక్యుమెంట్స్ లో ఆధార్ కార్డు ఒకటి. ఆధార్ కార్డు ఎన్నో వాటికి ప్రూఫ్ కింద పనికొస్తుంది. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం మొదలు అనేక వాటికి ఆధార్ తప్పనిసరి. అయితే, ఆధార్ కార్డు ని ఫ్రీగా అప్డేట్ చేసుకునే గడువుని పెంచారు. ఆధార్ కార్డుని ఫ్రీగా అప్డేట్ చేసుకోవాలంటే డిసెంబర్ 14, 2024లోగా ఫ్రీగా అప్డేట్ చేసుకోవడానికి అవుతుంది. మీరు మీ ఆధార్ కార్డుని ఫ్రీగా అప్డేట్ చేసుకోవాలని అనుకుంటే UIDAI అధికారిక పోర్టల్ లోకి వెళ్లి అప్డేట్ చేసుకోవచ్చు.
బయోమెట్రిక్ డీటెయిల్స్ ని అప్డేట్ చేసుకోవడానికి కూడా ఎలాంటి రుసుము చెల్లించక్కర్లేదు. ఫ్రీగానే ఆ వివరాలను కూడా అప్డేట్ చేసుకోవచ్చు. మీరు మీ వివరాలను అప్డేట్ చేసుకోవాలనుకుంటే.. మీకు సమీపంలో ఉన్న ఆధార్ కేంద్రానికి వెళ్లి అప్డేట్ చేయొచ్చు. కేంద్ర ప్రభుత్వం అందించిన 12 అంకెల ఆధార్ కార్డు చాలా ముఖ్యమైనది.
వివిధ రకాల సేవలను పొందడానికి మొదలు ప్రభుత్వ స్కీముల వరకు ఆధార్ కార్డు ఉపయోగపడుతుంది. ఆధార్ కార్డు లేకపోతే చాలా సేవలకు అంతరాయం కూడా కలుగుతుంది. ఆధార్ కార్డుని అప్డేట్ చేసుకోవడం వలన ఆధార్ కార్డు దుర్వినియోగం అవ్వకుండా ఉంటుంది. ఆధార్ కార్డు జారీ చేసే పదేళ్లకు పైనే అవుతుంది. అలాంటప్పుడు అప్డేట్ చేసుకోవడం ముఖ్యం. పిల్లలకు 15 ఏళ్లు దాటిన తర్వాత బయోమెట్రిక్ వివరాలను అప్డేట్ చేయాల్సి ఉంటుంది.