Money Plant : డ‌బ్బు స‌మ‌స్య‌లు పోవాలంటే ఇంట్లో మ‌నీ ప్లాంట్‌ను ఎక్క‌డ పెట్టాలి ?

Money Plant : హిందూ సంప్ర‌దాయంలో అనేక ర‌కాల మొక్క‌లు, వృక్షాల‌కు ఎంతో ప్రాధాన్య‌త‌ను క‌ల్పించారు. వీటిని ఇల్లు లేదా ఆఫీసు కార్యాల‌యాల్లో పెట్టుకుంటే ఎంతో మంచిద‌ని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతుంటారు. అయితే సాధార‌ణంగా మ‌న‌కు ప్ర‌తి ఇంటిలోనూ క‌నిపించే మొక్క‌ల్లో మ‌నీ ప్లాంట్ ఒక‌టి. ఇది దాదాపుగా అంద‌రి ఇళ్ల‌లోనూ ఉంటుంది. దీన్ని పెట్టుకోవ‌డం వ‌ల్ల ఆర్థిక స‌మ‌స్య‌లు తొల‌గిపోతాయ‌ని, అదృష్టం క‌ల‌సి వ‌స్తుంద‌ని, ఇంట్లో అంద‌రూ హ్యాపీగా ఉంటార‌ని భావిస్తారు. అయితే మ‌నీ ప్లాంట్‌కు చెందిన ఈ విష‌యాలు నిజ‌మే అయిన‌ప్ప‌టికీ ఈ మొక్క‌ను ఇంట్లో ఎలా ప‌డితే అలా పెట్ట‌కూడ‌దు.

కొన్ని ప్ర‌త్యేక‌మైన ప్ర‌దేశాల్లో పెట్ట‌డం వ‌ల్ల మాత్ర‌మే మ‌న‌కు మ‌నీ ప్లాంట్‌తో మేలు క‌లుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు ఉన్న‌వారు, ఖ‌ర్చుల‌కు అస‌లు డ‌బ్బులు స‌రిపోవ‌డం లేద‌ని అనుకునేవారు, వ్యాపారంలో న‌ష్టాలు వ‌స్తున్న‌వారు మ‌నీ ప్లాంట్‌ను ప‌లు ప్ర‌త్యేక‌మైన ప్ర‌దేశాల్లో పెట్టాలి. అప్పుడే స‌రైన ఫ‌లితాలు వ‌స్తాయి. మనీ ప్లాంట్‌ను సంప‌ద‌కు చిహ్నంగా భావిస్తారు. అందువ‌ల్ల దీన్ని ఇంట్లో ఎలా ప‌డితే అలా పెట్ట‌కూడ‌దు. కొన్ని నిర్దిష్ట‌మైన ప్ర‌దేశాల్లో మాత్ర‌మే పెట్టాలి.

in which direction Money Plant should be placed for wealth
Money Plant

మనీ ప్లాంట్‌ను మ‌నం ఇంట్లో పెట్టే విధానాన్ని బ‌ట్టి మ‌న‌కు లక్ష్మీదేవి, శ్రీ‌మ‌హావిష్ణువుల ఆశీస్సులు ల‌భిస్తాయి. మ‌నీ ప్లాంట్‌ను ఇంట్లో ఇప్పుడు చెప్ప‌బోయే విధంగా పెట్టేవారికి జీవితంలో అస‌లు ఎలాంటి స‌మ‌స్య‌లు రావ‌ని వాస్తు శాస్త్ర నిపుణులు తెలియ‌జేస్తున్నారు. మ‌నీ ప్లాంట్‌ను ఇంట్లో ఆగ్నేయ దిశ‌లో పెట్టాలి. ఈ దిశ‌లో పెడితేనే ఇంట్లోకి పాజిటివ్ ఎన‌ర్జీ వ‌స్తుంది. అప్పుడు స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌తారు.

మ‌నీ ప్లాంట్‌ను ఈశాన్య దిశ‌లో పెట్ట‌కూడ‌దు. అలా పెడితే స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. ఇంట్లో నెగెటివ్ ఎన‌ర్జీ వ‌స్తుంది. ఇక మ‌నీ ప్లాంట్ ఎల్ల‌ప్పుడూ మీద‌కు పెరిగేలా చూడాలి. మ‌నీ ప్లాంట్ ఎల్ల‌ప్పుడూ ప‌చ్చ‌గా ఉండాలి. ఎండిపోతే తీసేసి వెంట‌నే ఇంకో ప్లాంట్ పెట్టాలి. మ‌నీ ప్లాంట్‌పై దుమ్ము, ధూళి ప‌డ‌కుండా చూసుకోవాలి. ఈ విధంగా మ‌నీ ప్లాంట్ విష‌యంలో జాగ్ర‌త్త‌లు పాటిస్తే అది మ‌న‌కు అదృష్టాన్ని తెచ్చి పెడుతుంది. దీంతో ఆర్థిక స‌మ‌స్య‌ల నుంచి గ‌ట్టెక్కుతారు.

Share
Editor

Recent Posts