Infinix : భారీ డిస్‌ప్లే, బ్యాట‌రీ, అదిరిపోయే ఫీచ‌ర్ల‌తో విడుద‌లైన ఇన్ఫినిక్స్ కొత్త 5జి ఫోన్‌..!

Infinix : మొబైల్స్ త‌యారీదారు ఇన్ఫినిక్స్‌.. జీరో 5జి పేరిట ఓ నూత‌న స్మార్ట్ ఫోన్‌ను భార‌త్‌లో విడుద‌ల చేసింది. ఇందులో అదిరిపోయే ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. పైగా ఈ ఫోన్ ధ‌ర కూడా త‌క్కువ‌గానే ఉంది. ఇందులో ఉన్న ఫీచ‌ర్ల వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

Infinix Zero 5G smart phone launched in India
Infinix

ఇన్ఫినిక్స్ జీరో 5జి ఫోన్‌లో 6.78 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్ క‌లిగిన డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ ల‌భిస్తుంది. అందువ‌ల్ల డిస్‌ప్లే చాలా క్వాలిటీగా ఉంటుంది. ఈ ఫోన్‌లో ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 900 ప్రాసెస‌ర్‌ను ఏర్పాటు చేశారు. దీని వ‌ల్ల 5జి సేవ‌ల‌ను ఉప‌యోగించుకోవ‌చ్చు. ఈ ఫోన్ 8జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్‌లో మాత్ర‌మే విడుద‌లైంది. మెమొరీని కార్డు ద్వారా 256 జీబీ వ‌ర‌కు పెంచుకోవ‌చ్చు.

Infinix : వెనుక వైపు 48 మెగాపిక్స‌ల్ మెయిన్ కెమెరా..

ఈ ఫోన్‌లో ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఎక్స్ఓఎస్‌ను అందిస్తున్నారు. డ్యుయ‌ల్ సిమ్‌ల‌తోపాటు ఒక మైక్రో ఎస్‌డీ కార్డును వేసుకోవ‌చ్చు. హైబ్రిడ్ స్లాట్ కాదు. ఈ ఫోన్‌లో వెనుక వైపు 48 మెగాపిక్స‌ల్ మెయిన్ కెమెరాకు తోడుగా మ‌రో 13 మెగాపిక్స‌ల్ టెలిఫొటో కెమెరా, 2 మెగాపిక్స‌ల్ డెప్త్ సెన్సార్ ల‌ను ఏర్పాటు చేశారు. ఈ కెమెరాల‌తో 4కె వీడియోల‌ను చిత్రీక‌రించుకోవ‌చ్చు. 2ఎక్స్ ఆప్టికల్ జూమ్ ల‌భిస్తుంది. ముందు వైపు 16 మెగాపిక్స‌ల్ కెమెరాను ఏర్పాటు చేశారు. దీనికి డ్యుయ‌ల్ ఎల్ఈడీ ఫ్లాష్ స‌దుపాయం ఉంది. అందువ‌ల్ల సెల్ఫీలు నాణ్యంగా వ‌స్తాయి.

ఈ ఫోన్‌లో కూలింగ్ మాస్ట‌ర్ టెక్నాల‌జీని అందిస్తున్నారు. అందువ‌ల్ల మూవీస్ చూసేట‌ప్పుడు, ఇంట‌ర్నెట్ ఆప‌రేట్ చేసే స‌మ‌యంలో లేదా గేమ్స్ ఆడేట‌ప్పుడు ఫోన్ ఎక్కువ‌గా హీట్ కాకుండా ఉంటుంది. అలాగే ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌ను ఈ ఫోన్‌కు ప‌క్క భాగంలో ఇచ్చారు. డీటీఎస్ స‌రౌండ్ సౌండ్ ఫీచ‌ర్ అందుబాటులో ఉంది. 5జి, బ్లూటూత్ 5.2, యూఎస్‌బీ టైప్ సి వంటి ఇత‌ర ఫీచ‌ర్లు ఈ ఫోన్‌లో ఉన్నాయి. ఇందులో 5000 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ ఉన్న బ్యాట‌రీని ఏర్పాటు చేశారు. దీనికి ఫాస్ట్ చార్జింగ్ స‌పోర్ట్‌ను అందిస్తున్నారు. అందువ‌ల్ల ఫోన్ వేగంగా చార్జింగ్ అవుతుంది.

ఇన్ఫినిక్స్ జీరో 5జి స్మార్ట్ ఫోన్ కాస్మిక్ బ్లాక్‌, స్కై లైట్ ఆరెంజ్ క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో విడుద‌లైంది. ఈ ఫోన్ ధ‌ర రూ.19,999 ఉండ‌గా.. దీన్ని ఫ్లిప్‌కార్ట్‌లో ఈ నెల 18వ తేదీ నుంచి విక్రయించ‌నున్నారు. ఇక ఈ ఫోన్‌ను కొనుగోలు చేసిన వారికి రూ.1 కే ఇన్ఫినిక్స్ స్నోక‌ర్ ఇయ‌ర్ బ‌డ్స్‌ ను అందించ‌నున్నారు. వీటి అస‌లు ధ‌ర రూ.999గా ఉంది. ఈ ఫోన్‌ను కొన్న త‌రువాత వారం రోజుల్లోగా ఈ ఆఫ‌ర్‌ను ఉప‌యోగించుకోవాల్సి ఉంటుంది. ఇక ఫ్లిప్‌కార్ట్ స్మార్ట్ అప్ గ్రేడ్ ప్రోగ్రామ్ ద్వారా ఈ ఫోన్‌ను 70 శాతం ధ‌ర‌కే కొన‌వ‌చ్చు. అలాగే 6, 9, 12 నెల‌ల వ్య‌వ‌ధితో నో కాస్ట్ ఈఎంఐ స‌దుపాయాన్ని కూడా ఈ ఫోన్‌పై అందిస్తున్నారు.

Share
Editor

Recent Posts