iPhone SE 2022 : ప్రముఖ టెక్ దిగ్గజ సంస్థ యాపిల్.. ఐఫోన్ ఎస్ఈ 2022 ఫోన్‌ను లాంచ్ చేసింది. మంగళవారం రాత్రి జరిగిన ఈవెంట్‌లో యాపిల్ ఈ ఫోన్‌ను ప్రవేశపెట్టింది. ఇందులో అద్భుతమైన ఫీచర్లను అందిస్తున్నారు. ఐఫోన్ ఎస్ఈ 2020కి కొనసాగింపుగా ఈ ఫోన్‌ను యాపిల్ లాంచ్ చేసింది. ఇక ఇందులో అందిస్తున్న ఫీచర్ల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
యాపిల్ ఐఫోన్ ఎస్ఈ 2022 ఫోన్‌లో 4.7 ఇంచుల డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఇది 1334 x 750 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్‌ను కలిగి ఉంది. అలాగే యాపిల్ ఎ15 బయానిక్ చిప్ ఇందులో లభిస్తుంది. దీని వల్ల 5జి సేవలను ఉపయోగించుకోవచ్చు. గత ఐఫోన్ ఎస్ఈ మోడల్స్ కన్నా ఈ ఫోన్ ఎంతో వేగంగా కూడా పనిచేస్తుంది. ఇక ఈ ఫోన్ 64, 128, 256 జీబీ స్టోరేజ్ మోడల్స్‌లో విడుదలైంది. ఐఓఎస్ 15 ఆపరేటింగ్ సిస్టమ్ ఇందులో లభిస్తుంది.
ఐఫోన్ ఎస్ఈ 2022 ఫోన్‌లో డ్యుయల్ సిమ్‌లను వేసుకోవచ్చు. ఒకటి నానో, ఒకటి ఇ-సిమ్ రూపంలో అందులోవేసుకుని ఉపయోగించుకోవచ్చు. ఈ ఫోన్‌కు ఐపీ 67 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ ఫీచర్ లభిస్తుంది. వెనుకవైపు 12 మెగాపిక్సల్ మెయిన్ కెమెరా ఉంది. దీనికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్‌ను అందిస్తున్నారు. కనుక కుదుపులు లేకుండా ఫొటోలు, వీడియోలను తీసుకోవచ్చు. అలాగే ముందు వైపు 7 మెగాపిక్సల్ కెమెరాను ఇచ్చారు. దీనికి ఫుల్ హెచ్‌డీ వీడియో రికార్డింగ్ ఫీచర్ లభిస్తుంది.
ఈ ఫోన్‌లో హోమ్ బటన్ కింద టచ్ ఐడీ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. 5జి, వైఫై 6, బ్లూటూత్ 5.0, ఎన్ఎఫ్‌సీ తదితర ఇతర ఫీచర్లను ఈ ఫోన్‌లో అందిస్తున్నారు. ఇక ఈ ఫోన్‌లో ఉన్న బ్యాటరీ వివరాలను తెలియజేయలేదు. కానీ ఈ ఫోన్‌ను ఒక్కసారి ఫుల్ చార్జింగ్ చేస్తే 15 గంటల వరకు నాన్‌స్టాప్‌గా వీడియోలను వీక్షించవచ్చు. దీంట్లో బిల్టిన్ లిథియమ్ ఐయాన్ బ్యాటరీని ఏర్పాటు చేశారు.
ఐఫోన్ ఎస్ఈ 2022 ఫోన్ మిడ్‌నైట్, స్టార్‌లైట్, ప్రొడక్ట్ రెడ్ కలర్ ఆప్షన్లలో విడుదలైంది. ఈ ఫోన్‌కు చెందిన బేస్ మోడల్ 64జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.43,900 ఉండగా.. 128 జీబీ మోడల్ ధర రూ.48,900, 256జీబీ మోడల్ ధర రూ.58,900 గా ఉన్నాయి. ఇక ఈ ఫోన్‌ను మార్చి 11వ తేదీ నుంచి విక్రయించనున్నారు.