IPL 2022 Auction : ఐపీఎల్ 2022 మెగా వేలానికి రంగం సిద్ధమైంది. శని, ఆది వారాల్లో జరగనున్న ఈ మెగావేలంలో భారీ ఎత్తున ప్లేయర్లకు వేలం వేయనున్నారు. ఈ వేలంలో మొత్తం 10 ఫ్రాంచైజీలు పాల్గొంటున్నాయి. దీంతో ఏయే జట్లు ఏయే ప్లేయర్లను ఎంతకు కొనుగోలు చేస్తాయోననే విషయం ఆసక్తికరంగా మారింది. ఈ సారి వేలంలో రెండు కొత్త టీమ్‌లు పాల్గొంటున్నాయి. గుజరాత్ టైటాన్స్‌తోపాటు లక్నో సూపర్ జియాంట్స్ ఈవేలంలో ప్లేయర్లను కొనుగోలు చేయనున్నాయి.
ఇక ఈ మెగా వేలంలో మొత్తం 590 మంది ప్లేయర్లకు వేలం వేస్తారు. వారిలో 370 మంది భారత ప్లేయర్లు కాగా 220 మంది విదేశీ ప్లేయర్లు ఉన్నారు. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లతోపాటు ముందుగా చెప్పిన రెండు జట్లు ఈ వేలంలో పాల్గొంటున్నాయి.
ఇక ఇప్పటికే అన్ని ఫ్రాంచైజీలు కొందరు ప్లేయర్లను రిటెయిన్ చేసుకున్నాయి. దీంతో ఆయా జట్ల వద్ద ఉన్న మొత్తంతోనే ఆటగాళ్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. శనివారం ఉదయం 11 గంటల నుంచి ఈ వేలం ప్రారంభం కానుంది. ఆదివారం కూడా కొనసాగనుంది. స్టార్ స్పోర్ట్స్‌లో ఈ వేలం కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. ఈసారి జరగనున్న ఐపీఎల్‌కు టాటా సంస్థ టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరించనుంది.
ఈ వేలంలో శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్, డేవిడ్ వార్నర్, శిఖర్ ధావన్, శార్దూల్ ఠాకూర్ వంటి ప్లేయర్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.